పోలీసుల అత్యుత్సాహంపై జాతీయ ఎస్టీ కమిషన్, రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ఎటపాక, మంగళవారం.ఏప్రిల్ 14, 2026: కృష్ణవరం గ్రామంలో ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తూ, దేవుడిని కించపరిచిన ఎటపాక సిఐ మరియు ఎస్సైల తీరుపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మరియు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను తెలిపారు. మంగళవారం ఎటపాకలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణవరం సర్వే నంబర్ 115లోని ప్రభుత్వ భూమిలో గ్రామస్తులు దేవుడిని ప్రతిష్ఠిస్తే, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు అతిగా వ్యవహరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటపాక సిఐ కన్నప్ప రాజు, ఎస్సై అప్పలరాజు గ్రామ పెద్దలను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అత్యంత దారుణంగా బూతులు తిడుతూ, "దేవుడు లేడు. గుడి లేదు.. విగ్రహాన్ని పీకి పారేయండి అని బెదిరించడం ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ, సామాన్య ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అధికారుల వైఖరిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, బాధ్యులైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని, ఈ విషయంలో బాధితులకు న్యాయం జరిగే వరకు మరియు ఆక్రమణదారుల నుండి ప్రభుత్వ భూమిని కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కుంజా శ్రీను హెచ్చరించారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉండి ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణవరం గ్రామస్తులు చిచ్చడి సూరిబాబు, చిచ్చటి రామారావు మల్లికార్జున్ సున్నం శ్రీను సాయం నరసింహారావు, నాగేష్ , ధర్మయ్య, గోపాలరావు మరియు ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Post by V Ramarao1
- Post by Ramprasad islavath1
- పిఠాపురం: రాష్ట్ర విపత్తుల స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, ప్రజల్లో అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.వారోత్సవాల ప్రారంభం సందర్భంగా స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి అధికారులు జెండా ఊపి ప్రదర్శనను ప్రారంభించారు. మీ సేవయే మా కర్తవ్యం అనే నినాదంతో ముందుకు సాగుతున్న అగ్నిమాపక శాఖ, మంగళవారం నాడు స్థానిక ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద భారీ బహిరంగ ప్రదర్శనను నిర్వహించింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానాలను, ఆధునిక పరికరాల పనితీరును ప్రత్యక్షంగా చేసి చూపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పౌరుడికి కనీస అగ్నిమాపక శిక్షణ ఉండాలని, తద్వారా ప్రాణ,ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని తెలిపారు. అగ్ని నివారణ నియమాలను పాటించడం ద్వారా తమను తాము కాపాడుకోవడమే కాకుండా సమాజానికి మేలు చేసిన వారవుతారని పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించేలా రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ప్రదర్శనకు స్థానిక ప్రజల నుండి విశేష స్పందన లభించింది. వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.1
- కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన 135వ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో స్థానిక కూటమి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. స్థానిక గొల్ల అప్పారావు సెంటర్ లో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి,కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు దళిత నాయకులు పాల్గొన్నారు.1
- my life money problems with your friends and family1
- నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ *నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించడం జరిగింది. #AmbedkarJayanti #StatueOfSocialJustice1
- Post by V Ramarao4