Shuru
Apke Nagar Ki App…
మోహన్ బాబు ఆయన స్వగ్రామం ఏ.రంగంపేట లోని మోహన్ బాబు యూనివర్సిటీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గతంలో జరిగిన విషయాలను మర్చిపోలాని తన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలోని డైలాగును గుర్తు చేశారు.
Geeta Pinisingi
మోహన్ బాబు ఆయన స్వగ్రామం ఏ.రంగంపేట లోని మోహన్ బాబు యూనివర్సిటీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గతంలో జరిగిన విషయాలను మర్చిపోలాని తన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలోని డైలాగును గుర్తు చేశారు.
More news from Korukonda and nearby areas
- సమీకృషితో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట నడిపిద్దాం..!! ★ అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయండి... ★ రాజానగరం నియోజకవర్గ మూడు మండలాల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష.. ★ గుర్తించిన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి.. ★ గ్రామాల వారిగా అత్యవసర పనులను గుర్తించండి.. ★ వాటికి తొలిదశ ప్రాధాన్యత ఇవ్వండి.. ★ ఇప్పటికే చేపడుతున్న పనుల్లో నాణ్యత కొరవడితే సహించేది లేదు.. - ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులకు దశానిర్ధేశం చేశారు. మంగళవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి కార్యాలయం నందు నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల కు చెందిన ఆయా ప్రధాన శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా గ్రామాల్లో గుర్తించిన సమస్యలతోపాటు, అత్యవసర పనులపైనా, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపైనా.. సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ప్రధానమైన రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, ప్రతి గ్రామానికి రక్షిత మంచినీటి సౌకర్యం.. వంటి అత్యవసర పనులపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఇప్పటికే ఆయా మండల గ్రామాల్లో జరుగుతున్న రహదారుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడవద్దు అని సూచించారు. ఎక్కడైనా నాణ్యత లోపిస్తే.. సహించేది లేదని హెచ్చరించారు. సంబంధిత కాంట్రాక్టర్లు.. అభివృద్ధి పనుల నిర్మాణ విషయంలో నాణ్యత ఏవిధంగా పాటిస్తున్నారు అన్న విషయాలను నిత్యం మండల స్థాయి అధికారులు పరిశీలించాలన్నారు. నాణ్యతలో రాజీ పడకుండా.. పది కాలాలపాటు ఆయా అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల వారీగా ఎన్ని పనులు అత్యవసరమైనవి గుర్తించారు, ఎన్ని పనులు ప్రతిపాదనలు పంపించారు, ఎన్ని అభివృద్ధి పనులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి, ఎన్ని పనులు పూర్తయ్యాయి.. తదితర అంశాలను ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలుసుకున్నారు. ★ గత పాలకులు నియోజకవర్గాన్ని దుర్భరం చేశారు.. ఈ సందర్భంగా గత వైసిపి ప్రభుత్వం ఐదేళ్లపాటు దోపిడీయే లక్ష్యంగా అభివృద్ధిని పూర్తిగా విస్మరించందన్నారు. దానివల్ల రాజానగరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఇక్కడ ఎక్కడ చూసినా సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయన్నారు. వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించి, ప్రజలు ఏ లక్ష్యంతో.. ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారో.. తనను ఇక్కడ అత్యధిక ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారో.. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పనితీరు ఉండాలన్నారు. అందుకు ఎమ్మెల్యేగా నా వంతు కృషి నిరంతరం నేను చేస్తూనే ఉన్నానన్నారు. 2500 కోట్ల రూపాయల అభివృద్ధి లక్ష్యంగా.. ఒక పక్కా ప్రణాళికతో తాను ముందడుగు వేస్తున్నట్లు ఎమ్మెల్యే బలరామకృష్ణ అధికారులకు తెలిపారు. దీనికి ఆయా శాఖల అధికారుల సహకారం కూడా సంపూర్ణంగా ఉండాలన్నారు. ప్రజలతోపాటు, అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తే ఖచ్చితంగా 5 ఏళ్లలో పాతికేళ్ల పాటు నిలిచిపోయే అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేసి చూపిస్తానన్నారు. అదే ధ్యేయంగా తను పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు.. తమకున్న ఇబ్బందులు, తమ ద్వారా నిర్మాణం జరుగుతున్న పనులు, అలాగే.. ప్రతిపాదించాల్సిన పలు ముఖ్యమైన అభివృద్ధి పనులు. వంటి అంశాలపై ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అన్నిటి పైన సుదీర్ఘంగా సమీక్షించిన అనంతరం, పండగ లోపు.. ప్రధానమైన రహదారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అలాగే డ్రైనేజీ, త్రాగునీరు, వైద్యం, విద్య, ఉపాధి, ముఖ్యంగా.. రైతాంగానికి సంబంధించి సాగినీరు వంటి ప్రధాన అంశాలు అన్నింటి పైన అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడా.. ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. రాత్రి, పగలు తేడా లేకుండా.. ఏ సమయంలోనైనా ప్రజల కష్టాల విషయంలో తనకు ఒక ఫోన్ చేస్తే చాలు.. క్షణాల్లో అక్కడ నిలబడతానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యలు తీర్చడం, వారి కష్టనష్టాల్లో పాలుపంచుకుని నేనున్నానని భరోసా ఇవ్వడమే మా అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని తెలిపారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రివర్గం, అధిష్టాన నేతల సహకారంతో నియోజకవర్గ ప్రగతే ప్రధాన లక్ష్యంగా తమ ప్రయాణం కొనసాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అలాగే సమీక్షలో భాగంగా అధికారుల నుండి వచ్చిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. వాటికి త్వరితగతన అనుమతులు తీసుకువచ్చి ఆయా సమస్యలు పరిష్కరించడానికి, అభివృద్ధి పనులు నిర్వహించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బి,ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, రెవెన్యూ, మండల అభివృద్ధి అధికారులతో పాటు ఆయా శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.1
- రాసిపెట్టుకోండి ఢిల్లీ గడ్డపై BJP జెండానే ఎగురుతుంది: చంద్రబాబు1
- work from home jobs Contact 9494070432 for more details1