తుడా నా అడ్డా అంటే కుదరదు ఇంచార్జ్ వీసి మౌర్య దురుసుతనం మానుకోవాలి. పరస్పర గౌరవం ముఖ్యం మౌర్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన మీడియా మిత్రులు. ప్రజాస్వామ్యానికి మీడియా నాల్గవ స్తంభం లాంటిదని, అలాంటి మీడియా పైన వీసి మౌర్య అనుచితంగా ప్రవర్తించడ తగదని తిరుపతి మీడియా మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుడా కార్యాలయంలో 60 సంవత్సరాల పైబడిన వారు కూడా కొనసాగుతుండడం పైన గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై వివరణ కోరడానికి తుడ ఇంచార్జి విసి మౌర్యాని కలిసిన ఏపిజేయఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు పట్ల చెప్పరాని విధంగా దురుసుగా ప్రవర్తించడంపై మీడియా మిత్రులు గురువారం తిరుపతి తుడా కార్యాలయం ముందు నిరసన తెలిపారు.వీసి మౌర్యకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.ఈ సందర్బంగా మీడియా మిత్రులు మాట్లాడుతూ మీడియా ఏదైనా విషయంపై దృవీకరణకోసం సంబందిత అధికారులను కలిసి వివరణ కోరే హక్కు బాధ్యతలలో భాగమేనని తెలిపారు. అధికారులకు ఉన్నట్లు మీడియాకు కూడా బాధ్యతలు వుంటాయని, వాటిని నిర్వర్తించాల్సి వస్తుందని అధికారిగా వీసి మౌర్య గుర్తించకపోవటం విచారకరమన్నారు. ఇంచార్జి వీసిగా కాక,అధికార దర్పంతో హేళనగా మాట్లాడి అవమానపరచటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఎంతోమంది అదికారులు పనిచేసి వారి పదవికి వన్నెతెచ్చారని గుర్తు చేసారు. ఇలాంటి ఉన్నత స్థానంలో ఉంటున్న అధికారిణి అయిన మౌర్య మీడియా మిత్రులను తూలనాడుతూ మాట్లాడటం శోచనీయమన్నారు.అంతేకాక అధికారిగా ఆమె మాట్లాడిన మాటలకు, పశ్చాత్తాపడాల్సింది పోయి సామాజిక వర్గాల నుంచి ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగటం ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమైన మీడియాను భయపెట్టడానికి పూనుకోవటమేనని మీడియా భావిస్తున్నదన్నారు.తిరుపతి జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ గా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఇంచార్జ్ వైస్ చైర్మన్, స్మార్ట్ సిటీ చైర్మన్ నాలుగు పదవీ బాధ్యతలు బాధ్యతలు నిర్వహిస్తూ మీడియా పట్ల అంత దురుసుగా ప్రవర్తించటం ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు.దీనికి సదరు అధికారిణి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇలాంటి అనుచిత ప్రవర్తన ఇకమీదట పునరావృతం కాకూడదన్నారు.ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర శాఖ తీసుకునిపోనున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు, తిరుపతి జిల్లా కన్వీనర్లు అరవ జయపాల్, గల్లా మహేష్, నెత్తం హరిబాబు, మహా టీవీ మోహన్, బిగ్ టీవీ దామోదర్ నాయుడు, సీనియర్ జర్నలిస్టులు రూప సుందర నాయుడు , సీనియర్ జర్నలిస్ట్ బాలయ్య, తదితరులు భారీ ఎత్తున పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
తుడా నా అడ్డా అంటే కుదరదు ఇంచార్జ్ వీసి మౌర్య దురుసుతనం మానుకోవాలి. పరస్పర గౌరవం ముఖ్యం మౌర్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన మీడియా మిత్రులు. ప్రజాస్వామ్యానికి మీడియా నాల్గవ స్తంభం లాంటిదని, అలాంటి మీడియా పైన వీసి మౌర్య అనుచితంగా ప్రవర్తించడ తగదని తిరుపతి మీడియా మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుడా కార్యాలయంలో 60 సంవత్సరాల పైబడిన వారు కూడా కొనసాగుతుండడం పైన గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై వివరణ కోరడానికి తుడ ఇంచార్జి విసి మౌర్యాని కలిసిన ఏపిజేయఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు పట్ల చెప్పరాని విధంగా దురుసుగా ప్రవర్తించడంపై మీడియా మిత్రులు గురువారం తిరుపతి తుడా కార్యాలయం ముందు నిరసన తెలిపారు.వీసి మౌర్యకి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.ఈ సందర్బంగా మీడియా మిత్రులు మాట్లాడుతూ మీడియా ఏదైనా విషయంపై దృవీకరణకోసం సంబందిత అధికారులను కలిసి వివరణ కోరే హక్కు బాధ్యతలలో భాగమేనని తెలిపారు. అధికారులకు ఉన్నట్లు మీడియాకు కూడా బాధ్యతలు వుంటాయని, వాటిని నిర్వర్తించాల్సి వస్తుందని అధికారిగా వీసి మౌర్య గుర్తించకపోవటం విచారకరమన్నారు. ఇంచార్జి వీసిగా కాక,అధికార దర్పంతో హేళనగా మాట్లాడి అవమానపరచటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో ఎంతోమంది అదికారులు పనిచేసి వారి పదవికి వన్నెతెచ్చారని గుర్తు చేసారు. ఇలాంటి ఉన్నత
స్థానంలో ఉంటున్న అధికారిణి అయిన మౌర్య మీడియా మిత్రులను తూలనాడుతూ మాట్లాడటం శోచనీయమన్నారు.అంతేకాక అధికారిగా ఆమె మాట్లాడిన మాటలకు, పశ్చాత్తాపడాల్సింది పోయి సామాజిక వర్గాల నుంచి ఫోన్లు చేయించి బెదిరింపులకు దిగటం ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమైన మీడియాను భయపెట్టడానికి పూనుకోవటమేనని మీడియా భావిస్తున్నదన్నారు.తిరుపతి జిల్లా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ గా, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ ఇంచార్జ్ వైస్ చైర్మన్, స్మార్ట్ సిటీ చైర్మన్ నాలుగు పదవీ బాధ్యతలు బాధ్యతలు నిర్వహిస్తూ మీడియా పట్ల అంత దురుసుగా ప్రవర్తించటం ముక్తకంఠంతో ఖండిస్తున్నామన్నారు.దీనికి సదరు అధికారిణి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇలాంటి అనుచిత ప్రవర్తన ఇకమీదట పునరావృతం కాకూడదన్నారు.ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర శాఖ తీసుకునిపోనున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మద్దినేని హరిబాబు, తిరుపతి జిల్లా కన్వీనర్లు అరవ జయపాల్, గల్లా మహేష్, నెత్తం హరిబాబు, మహా టీవీ మోహన్, బిగ్ టీవీ దామోదర్ నాయుడు, సీనియర్ జర్నలిస్టులు రూప సుందర నాయుడు , సీనియర్ జర్నలిస్ట్ బాలయ్య, తదితరులు భారీ ఎత్తున పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
- Post by Bondhu Suresh1
- ఇచ్చిన డబ్బులు అడిగితే అక్రమ కేసు లేనా1
- చంద్రగిరిలో జవాన్ సొంత స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా లంచం అడుగుతున్న టీడీపీ నేతలు #STV9: రూ.2 లక్షలు ఇవ్వాలని.. లేకపోతే ఇల్లు కట్టుకోనివ్వమని స్థానిక టీడీపీ నేత బాలాజీ వార్నింగ్ #chandhragi1
- వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల ముందస్తు సంక్రాంతి సంబరాలు పీలేరు జనవరి 8 : స్థానిక పీలేరు పట్టణంలో సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేసే వి.ఎస్.ఎన్ విద్యా సంస్థలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా ఎంతో ఘనంగా నిర్వహించారు. మొదటగా వి.ఎస్.ఎన్ విద్యాసంస్థల అధినేత్రి వి.మాధవి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల గురించి భోగి,సంక్రాంతి మరియు కనుమ పండుగల ఆవశ్యకత, గొప్పతనాన్ని గురించి వివరించారు. తదుపరి విద్యార్థిని, విద్యార్థులకు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఆటలు పోటీలు నిర్వహించారు. విద్యార్థినులకు రంగోళి, ఖోఖో పోటీలు మరియు విద్యార్థులకు గాలి పతంగులు, కబడ్డి, క్రికెట్ వంటి ఆటల పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, పాల్గొన్నారు. చివరగా వి.ఎస్.ఎన్ ఒలంపియాడ్ ప్రిన్సిపాల్ సురేష్ పండుగలను విద్యార్థులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ కుటుంబ సభ్యులు మరియు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలి అని కుటుంబ విలువలు గురించి తెలిపి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని, ఉపాధ్యాములు అందురు విద్యార్థులలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.1
- మండల సర్వేయర్ పై పోలీసులకు ఫిర్యాదు. పలమనేరు జనవరి 9 (ప్రజా ప్రతిభ) : అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయకుండానే చేసినట్లు తప్పుడు ఎండార్స్ ఇచ్చిన గంగవరం మండల సర్వేర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పలమనేర్ నియోజకవర్గం అంబేద్కర్ భవనాల అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం గంగవరం అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు డి.వి. మునిరత్నం, ఎం. శ్రీనివాసులు,మణి, మహేష్, రెడ్డి ప్రసాద్, హరి మాట్లాడుతూ నెల రోజుల క్రితం అంబేద్కర్ భవన స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన శ్రీలంక శరణార్థులకు అంబేద్కర్ వాదులకు వాగ్వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో సమస్య పరిష్కరించాలని కోరుతూ మండల తహసిల్దార్ కు విన్నవించామన్నారు. వారు నిర్లక్ష్యం చేయడంతో16--12---25 వ తేదీన జిల్లా కలెక్టరేట్లో జరిగే పి జి ఆర్ ఎస్ లో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశామన్నారు. ఆ ఫిర్యాదు మేరకు జనవరి 6వ తేదీ వివాదంలో ఉన్న అంబేద్కర్ భవన స్థలాన్ని సర్వే చేయడానికి వస్తున్నామని వాట్సాప్ ద్వారా మండల సర్వేర్ నోటీసు పంపించారని వివరించారు. ఆరోజు సాయంత్రం వరకు దళిత, బహుజన నాయకులు అధికారులు వస్తారని పడిగాపులు కాసినా ఎవరు రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగామన్నారు. ఇప్పటివరకు సర్వేనెంబర్ 314 స్థలం సబ్ డివిజన్ కాకపోయినా మండల సర్వే314/3 గా సబ్ డివిజన్ అయినట్లు క్రియేట్ చేసి మాకు పంపిన ఎండార్స్ లో పంపారని ఆరోపించారు. 31----12---2025 వతేది మేము పి జి ఆర్ ఎస్ లో నమోదు చేసుకొన్న ఫిర్యాదు మేరకు అధికారులు వచ్చి సమస్య పరిష్కరించినట్లుగా తప్పుడు ఎండార్స్ ఇచ్చి అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. దళితులు పట్ల అధికారులకు, అగ్రవర్ణాలకు వివక్ష ఉన్నదనే విషయం నగ్నమెరిగిన సత్యం అని ,అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశం పొందిన అధికారులు కూడా అంబేద్కర్ కోసం కేటాయించిన స్థలం విషయములో వివక్ష చూపుతూ తప్పుడు సమాచారం ఇవ్వడం చూస్తుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. మండల సర్వేయర్ దళితులు పట్ల చూపుతున్న వ్యవహార శైలిని ఎండగడుతూ అతనిపైన చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ను కోరారు, ఈ కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు పాల్గొన్నారు1
- PPP విధానం ఆపండి1
- చిత్తూరు... సెంటర్... పలమనేరు ... బైరెడ్డిపల్లి మండలo బైరెడ్డిపల్లి లో ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్ట్ ... 16 కేజీల గంజాయి స్వాధీనం ... నాయుడుపేట to పలమనేర్ కు గంజాయి సప్లై చేసిన స్మగ్లర్ ... స్మగ్లర్ నుండి ఇతర మండలాల విక్రయదారులకు చేరుకుంటున్న గంజాయి ... ప్రధాన స్మగ్లర్లు పట్టుకుని ఊచలు లెక్క పెట్టిస్తాం అంటున్న పోలీసులు ... వినియోగదారులకు సైతం పోలీస్ కౌన్సిలింగ్ ఇస్తాం1
- Post by Bondhu Suresh1