logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పేదల సంక్షేమంతోపాటు కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల సమగ్ర అభివృద్ధే ఇందిరమ్మ ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ 1వ డివిజన్ కైకొండాయిగూడెంలో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్డు పనులకు కలెక్టర్ దివాకరతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి సంక్షేమ ఫలాలను పేదల గుమ్మానికి చేర్చడమే లక్ష్యమన్నారు.

52 min ago
user_ARUNKUMAR
ARUNKUMAR
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
52 min ago
1ed33a62-6241-4071-a093-2318f3734b00
b6ed9028-2b77-474d-a634-b7d3450ff68e
ae3730e5-9f3f-4117-a5e1-5119353147f5

మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి పేదల సంక్షేమంతోపాటు కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల సమగ్ర అభివృద్ధే ఇందిరమ్మ ప్రభుత్వ ధ్యేయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ 1వ డివిజన్ కైకొండాయిగూడెంలో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్డు పనులకు కలెక్టర్ దివాకరతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి సంక్షేమ ఫలాలను పేదల గుమ్మానికి చేర్చడమే లక్ష్యమన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వైరల్ వీడియో రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు మహిళ ఫైర్ స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా అని ప్రశ్నిస్తూ, రేపు ప్రభుత్వం మారితే ఈ కార్డుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్లపైనా ఫొటోలు వేస్తారా అని ఆమె ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం 'ఎక్స్' లో వైరల్ గా మారింది.
    1
    వైరల్ వీడియో రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు మహిళ ఫైర్
స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా అని ప్రశ్నిస్తూ, రేపు ప్రభుత్వం మారితే ఈ కార్డుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్లపైనా ఫొటోలు వేస్తారా అని ఆమె ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం 'ఎక్స్' లో వైరల్ గా మారింది.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
  • రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    1
    రూప్లా తండా గుడుంబా స్తావరాలపై నర్సింహులపేట పోలీస్ ల దాడులు..
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల కేంద్ర శివారు రుప్లా తండాలోని గుడుంబా స్తావరాలపై పోలీస్ లు విస్తృత దాడులు నిర్వహించారు.. అక్రమంగా నిల్వ ఉంచిన 700 లీటర్ల బెల్లం పానకం ను ద్వoసం చేయడం తో పాటు 17 లీటర్ల నాటుసారను సీజ్ చేశారు.. అనంతరం నర్సిoహుల పేట ఎస్ ఐ వెంకన్న మాట్లాడుతూ అక్రమ వ్యాపారాలు, దందా లు చేస్తే చట్ట పర చర్యలు ఉంటాయని హెచ్చరించారు
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* *-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు. సూర్యాపేట సిటీ:: *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల* తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
    1
    *నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల*

*-తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన అధికారులు.

సూర్యాపేట సిటీ::
*నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల*
తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా కాలువలో నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నీటి విడుదలతో ఉపశమనం లభించింది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
    user_YADLA VENUDHAR
    YADLA VENUDHAR
    Suryapet, Telangana•
    16 hrs ago
  • మల్యాల గ్రామ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. సమస్యలు పరిష్కరించని ఎడల పోరాటాలు ఉదృతం చేస్తాం. స్థానిక సమస్యలపై నిరసన సిపిఎం మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో విద్యుత్ దీపాలు వెలుగులు లేకపోవడంతో స్థానిక ప్రజలతో కలిసి స్థానిక వీధుల్లో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తక్షణమే గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజలతో మమేకమై స్థానిక పోరాటాలు నిర్వహిస్తామని మండల అధికారులను హెచ్చరించారు.
    1
    మల్యాల గ్రామ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన. 
సమస్యలు పరిష్కరించని ఎడల పోరాటాలు ఉదృతం చేస్తాం. 
స్థానిక సమస్యలపై నిరసన సిపిఎం 
మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో విద్యుత్ దీపాలు వెలుగులు లేకపోవడంతో స్థానిక ప్రజలతో కలిసి స్థానిక వీధుల్లో సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది తక్షణమే గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రజలకు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ప్రజలతో మమేకమై స్థానిక పోరాటాలు నిర్వహిస్తామని మండల అధికారులను హెచ్చరించారు.
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..
    1
    చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్..  కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    10 hrs ago
  • గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    4
    గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    1
    ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను  నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు
ప్రశాంతమైనవాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను  నిర్వహించుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అన్నారు.ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు నది పరిసరాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనువైన ప్రదేశం, నీటి మట్టం, రహదారి మార్గాలు, వాహనాల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు మున్నేరు, ప్రకాష్‌నగర్ వద్ద నీటి మట్టాన్ని, గణేష్ నిమజ్జనానికి ఉన్న అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నిమజ్జనం ప్రదేశాలను సమగ్రంగా పర్యవేక్షించి ప్రజలకు అనువుగా తుది నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • అభివృద్ధి కోసం అర్ధరాత్రి అయిన ముందుండే నాయకుడు.. ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్... డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... నా ప్రాంతం అభివృద్ధి కోసం అర్ధరాత్రి అయినా ఆలోచించే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తిత్వం ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్... పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు రామచంద్రునాయక్.. బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు ఒక్కటే ప్రశ్న.. అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకుడిపై విమర్శలు చేయడం కాదు… మీ హయాంలో ప్రజలకు ఏం చేశారు? నేడు జరుగుతున్న అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పండి. అసత్య ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకోలేరు. ప్రజల కోసం పనిచేసే నాయకుడికి ప్రజలే అండగా ఉంటారు. డోర్నకల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ నాయకత్వానికి మా పూర్తి మద్దతు. ✊🏽 అభివృద్ధి మాట్లాడుతుంది… అసత్య ప్రచారాలు మౌనమవుతాయి!
    1
    అభివృద్ధి కోసం అర్ధరాత్రి అయిన ముందుండే నాయకుడు.. 
ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్... 
డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 26... 
నా ప్రాంతం అభివృద్ధి కోసం అర్ధరాత్రి అయినా ఆలోచించే, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తిత్వం ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్... పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు రామచంద్రునాయక్.. 
బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు ఒక్కటే ప్రశ్న.. 
అభివృద్ధి కోసం కష్టపడుతున్న నాయకుడిపై విమర్శలు చేయడం కాదు… మీ హయాంలో ప్రజలకు ఏం చేశారు? నేడు జరుగుతున్న అభివృద్ధిలో మీ పాత్ర ఏమిటో ప్రజలకు చెప్పండి.
అసత్య ప్రచారాలతో అభివృద్ధిని అడ్డుకోలేరు.
ప్రజల కోసం పనిచేసే నాయకుడికి ప్రజలే అండగా ఉంటారు.
డోర్నకల్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్  నాయకత్వానికి మా పూర్తి మద్దతు. ✊🏽
అభివృద్ధి మాట్లాడుతుంది… అసత్య ప్రచారాలు మౌనమవుతాయి!
    user_జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    జర్నలిస్ట్ యాకయ్య-పుష్ప యాదవ్
    Doctor తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • కురవి మండలం నేరెడ శివారులో అనుమానాస్పదంగా ఉరివేసుకొని రైతు మృతి.. అనుమానాస్పదంగా రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులో చోటు చేసుకుంది.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నేరెడ గ్రామానికి చెందిన మొగిలి రామ చంద్రయ్య (65) కి తన పొలం పక్కన మరో రైతు తో పొలం బాట విషయం లో పంచాయితీ జరుగుతుంది.. ఈ నేపథ్యంలో లో ఈ తెల్లవారు జామున రామ చంద్రయ్య తన పొలం వద్ద చెట్టుకు ఊరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యానా.. ఆత్మహత్య నా అనే కోణం లో దర్యాప్తు ప్రారంభించారు
    3
    కురవి మండలం నేరెడ శివారులో అనుమానాస్పదంగా ఉరివేసుకొని రైతు మృతి..
అనుమానాస్పదంగా రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ శివారులో చోటు చేసుకుంది.. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నేరెడ గ్రామానికి చెందిన మొగిలి రామ చంద్రయ్య (65) కి తన పొలం పక్కన మరో రైతు తో పొలం బాట విషయం లో పంచాయితీ జరుగుతుంది.. ఈ నేపథ్యంలో లో ఈ తెల్లవారు జామున రామ చంద్రయ్య తన పొలం వద్ద చెట్టుకు ఊరువేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు బాధిత కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యానా.. ఆత్మహత్య నా అనే కోణం లో దర్యాప్తు ప్రారంభించారు
    user_కిరణ్ చెల్లమల్ల
    కిరణ్ చెల్లమల్ల
    మరిపెడ, మహబూబాబాద్, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.