నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రభుత్వ అధికారులతో కలిసి అర్హులైన పేద కుటుంబాలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం” అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో దాదాపు 15 సంవత్సరాలుగా అనేక అర్హులైన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన అన్నారు. రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిత్యావసర సరుకుల సబ్సిడీతో పాటు ఇతర సంక్షేమ ప్రయోజనాలను పొందడంలో పేద కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టిందని షబ్బీర్ అలీ తెలిపారు. అర్హత ఉన్న ఏ కుటుంబం కూడా ప్రభుత్వ సంక్షేమానికి దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నూతన రేషన్ కార్డు ద్వారా కుటుంబాలకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సబ్సిడీపై బియ్యం వంటి నిత్యావసర సరుకులు పొందే అవకాశం కలుగుతుందని, అంతేకాకుండా రేషన్ కార్డు అనేక సంక్షేమ పథకాలకు అర్హతను నిర్ధారించే ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను అర్హులకు చేరవేయడంలో రేషన్ కార్డులు కీలకంగా ఉంటాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే, మరోవైపు రాష్ట్రంలో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోందని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, కళ్యాణమస్తు–షాదీ ముబారక్ వంటి సంక్షేమ కార్యక్రమాలతో అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు గృహ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కామారెడ్డి నియోజకవర్గంలో కూడా రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని షబ్బీర్ అలీ తెలిపారు. ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా చివరి అర్హుడి వరకు చేరాలి. పేద కుటుంబం ముఖంలో చిరునవ్వు తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాం అని షబ్బీర్ అలీ అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు, మాచారెడ్డి మాజీ ఎంపీపీ సురేష్ నర్సింగరావు, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాచారెడ్డి సర్పంచ్ సంతోష్, SC సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, ST సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, భిక్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, తిప్పపూర్ సొసైటీ చైర్మన్ భీంరెడ్డి, కామారెడ్డి సొసైటీ చైర్మన్ గూడెం శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మ రెడ్డి, చుక్కపూర్ లక్ష్మి నర్సింహా ఆలయ చైర్మన్ కమలాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, కౌన్సిలర్ మోతిలాల్, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, కామారెడ్డి పట్టణ అధ్యక్షులు సందీప్, మాజీ సొసైటీ చైర్మన్లు పూల్ చంద్, స్వామి గౌడ్, రాజమౌళి, సత్యనారాయణ, బాలరాజు గౌడ్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి, నాయకులు కార్యకర్తలు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్య వర్గ ప్రమాణ స్వీకారము మహోత్సవం స్నేహ బంకెట్ హల్ లో ఏర్పాటు చేయటం జరిగింది. దీనికి అధ్యక్షుడు పిన్నురి రమేష్ ఉపాధ్యక్షుడు కుశల్కంటి మహేష్, జెనరల్. సెక్రటరీ. యశ్వంత్ పవార్, కోశాదికారి రాచర్ల సంతోష్, అధికార ప్రతినిధి. ముస్త్యాల శ్రీధర్, షoబులింగం, సాయిరాంగౌడ్, పోచయ్య, గౌస్, అనిల్ నాయక్, బొల్లారం శ్రీనివాస్, బన్సిలాల్, మంగలి రాజు,ముఖర్రం సాయికుమార్ సోమయాజులు. ప్రమాణ స్వీకారం చేసారు. దీనికి గాను ముఖ్య అతిథి గా ఎల్లారెడ్డి ci రాజారెడ్డి, అడ్వకేట్ పండరి, లీగల్ అడ్వైజర్ గోపాల్ రావు అడ్వకేట్, కామారెడ్డి tuwj జిల్లా అధ్యక్షులు రాజనీకాంత్, కామారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ సెక్రటరీ సుధాకరగౌడ్, చందు, మోయిన్ తదితరులు పాల్గొన్నారు.1
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు.... కామారెడ్డి పట్టణంలోని రాజా నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజయ్య, రాఖీ పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులు సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో రాఖీ పౌర్ణమి ఉత్సవాలను నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్ జ్యోతి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు1
- గుంతల రోడ్డుపై.. నిరసన బాట! డాంబర్ రోడ్డు కోసం 29న పాదయాత్ర.. సన్నాహక సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్ జిల్లా, నిజాంపేట: మూడేళ్లుగా అధ్వానంగా ఉన్న చల్మెడ కమాన్–నందగోకుల్ రహదారికి డాంబర్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని ఫంక్షన్‌హాల్‌లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. ప్రజా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న పాదయాత్రకు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రావు, బాల్‌రెడ్డి, రంజిత్‌గౌడ్, దయాకర్, శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.2
- మున్సిపల్ కార్మికుల సమస్యలపై కౌన్సిల్లో చర్చించి వెంటనే సమస్యలను పరిష్కరించాలి సమస్యలు పరిష్కరించకపోతే పనులు బందు చేసి సమ్మె చేస్తాం సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ , చైర్మన్ లకు వినతిపత్రం అందజేత సిరిసిల్ల మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలను రాబోయే కౌన్సిల్ సమావేశాలలో ఎజెండాగా పెట్టి చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ బుధవారం ఆధ్వర్యంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కమిషనర్ ఖదీర్ పాషాకి మరియు చైర్మన్ జిందం కళా - చక్రపాణి లకు కలిసి సమస్యలను తెలియజేసి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం అనునిత్యం కష్టపడి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ అధికారులు , పాలకవర్గం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇవ్వవలసిన బట్టలు , చెప్పులు , సబ్బులు , నూనెలు , గ్లౌజులు ఇతరత్రా సామాగ్రిని వెంటనే అందించాలని అదేవిధంగా కొంతకాలంగా 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులను పనిలోకి తీసుకోక పోవడం వలన కార్మికులు తగ్గి ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులపై విపరీతంగా పని భారం పెరిగిందని వెంటనే పాలకవర్గంలో చర్చించి అదనంగా కార్మికులను నియమించి కార్మికులకు పని భారం తగ్గించాలని వీరిలో కార్మికుల కుటుంబ సభ్యులకే మొదటి ప్రాధాన్యత కల్పించాలని మరియు సిరిసిల్ల మున్సిపల్ లో కార్మికులకు సంబంధించి 2009 నుండి 2012 వరకు కార్మికుల పెండింగు పిఎఫ్ సమస్యను తొందరగా పరిష్కరించి కార్మికుల వ్యక్తిగత ఖాతాలలో డబ్బులు జమ చేయాలని , ఇంకా కొంతమంది కార్మికులకు సంబంధించినటువంటి పీఎఫ్ సమస్య , ఈఎస్ఐ సమస్యలను పరిష్కరించి కార్మికులందరికీ మున్సిపల్ ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని అన్నారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధిలో భాగస్వాములై పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత పాలకవర్గ సభ్యుల పైన కూడా ఉంటుంది కాబట్టి రాబోయే కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి వెంటనే సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సభ్యులందరూ కృషి చేయాలని అన్నారు.సమస్యలు పరిష్కరించకుంటే కనుక రానున్న రోజుల్లో అవసరమైతే కార్మికులందరూ కూడా పనులు బంద్ చేసి సమ్మెలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసర్ల శంకర్ , పట్టణ అధ్యక్షులు ఏల్పుల బాలయ్య నాయకులు నర్మెట బాబా కిషన్ , బత్తుల దేవరాజు , గడ్డం విజయ , నర్మెట ఉమ , రెడ్డిమల్ల మమత , మారుపాక లక్ష్మి , నక్క ఎల్లవ్వ తదితరులు పాల్గొన్నారు.3
- నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ... నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొళ్ళెం వేసి పక్కింటి కి వెళ్ళి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి, దుస్తులు చిందర వందరగా ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీ.సీ. ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు1
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1
- యూరియా యాప్ రద్దు చేయాలి. ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదంతో రోడ్డెక్కిన రైతులు మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండలం జాతీయ రహదారి నేషనల్ 44 హైవే యూరియా కొత్తవాళ్లను చుట్టుపక్కల గ్రామాల రైతులు గత 20 రోజుల నుండి యూరియా దొరకకపోవడంతో ఆగ్రహంతో గిరిజనులు రైతులు ఇతర గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు ఇదే మీ ప్రభుత్వం ఇదేమి ప్రభుత్వం దొంగ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అనే నినాదాలతో ఒరే ఎత్తించారు దాదాపు సుమారు 400 మంది రైతులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో పోలీసులు చేతులెత్తేశారు యూరియా యాప్ వెంటనే రద్దు చేయాలని డౌన్ డౌన్ అంటూ వ్యవసాయ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని మాకు వద్దు ఈ అధికారి అని డిమాండ్ చేశారు ఏ మండలానికి ఆ మండలానికి రైతులు యూరియా తీసుకోవాలని అందరిని కలపవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు4