logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ శనివారం పుట్టపర్తి కేంద్రంలోని 6, 7వ వార్డు సచివాలయాలను, అలాగే యెనుమలపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR-2026) సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయాల్లోని వివిధ విభాగాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు (BLO) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే రికార్డులను, ఎన్యూమరేషన్ ఫారాలను మరియు ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను ఆయన స్వయంగా తనిఖీ చేసి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా సాగాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అంతా విధిగా కార్యాలయాల్లో ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ సేవలను సకాలంలో అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆదేశించారు. సచివాలయాల పనితీరుపై, సర్వేల పురోగతిపై నిరంతరం నిఘా ఉంటుందని, విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్ గారు హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులు, పుట్టపర్తి ఆర్‌డీఓ సువర్ణ, సచివాలయాల ఈఓలు, బీఎల్‌ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

1 hr ago
user_Saddala Adi
Saddala Adi
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
96bf37e9-8852-454d-921a-671ea4facc5b

శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ శనివారం పుట్టపర్తి కేంద్రంలోని 6, 7వ వార్డు సచివాలయాలను, అలాగే యెనుమలపల్లి గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR-2026) సర్వే పురోగతిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించేందుకు ఆయన ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయాల్లోని వివిధ విభాగాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. బూత్ స్థాయి అధికారులు (BLO) నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే రికార్డులను, ఎన్యూమరేషన్ ఫారాలను మరియు ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియను ఆయన స్వయంగా తనిఖీ చేసి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా సాగాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా బీఎల్‌ఓలు బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అంతా విధిగా కార్యాలయాల్లో ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ సేవలను సకాలంలో అందిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆదేశించారు. సచివాలయాల పనితీరుపై, సర్వేల పురోగతిపై నిరంతరం నిఘా ఉంటుందని, విధుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్ గారు హెచ్చరించారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాసులు, పుట్టపర్తి ఆర్‌డీఓ సువర్ణ, సచివాలయాల ఈఓలు, బీఎల్‌ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    2
    శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి వై జంక్షన్ వరకు నిర్వహించిన ఈ భారీ అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కుటుంబ నియంత్రణ, మాతా–శిశు ఆరోగ్యం, మహిళల సాధికారత, బాలికల విద్య, బాధ్యతాయుతమైన తల్లిదండ్రత్వం మరియు సమతుల్య జనాభా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం సాగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఈ ఏడాది నిర్దేశించిన నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సూచించారు. "పిల్లల మధ్య సరైన ఎడం – ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం", "పిల్లల మధ్య ఎడం పాటిద్దాం – ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం" అనే నినాదాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. జననాల మధ్య సరైన విరామం, మాతా–శిశు సంక్షేమం, మహిళల ఆరోగ్యం మరియు లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తున్న కుటుంబ నియంత్రణ సేవలను దంపతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో ఎన్‌సీడీ–సీడీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, స్టాటిస్టికల్ ఆఫీసర్ కె. కళాధర్, డిపిహెచ్‌ఎన్‌ఓ వీరమ్మ, డిప్యూటీ డెమో సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు వైద్యాధికారులు డాక్టర్ సుమదుర, డాక్టర్ గాయత్రి, సీహెచ్‌ఓ శివరామ్, సూపర్‌వైజర్ రామమోహన్, అలాగే ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ నూతన టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా డీసీసీబీ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డికి సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన వర్గీయులు, అనుచరులు బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా రితేశ్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు మంచూరి సూర్యనారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ఆయన అనుచరులు బద్వేలులో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
    1
    వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ నూతన టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా డీసీసీబీ ఛైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డికి సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయంతో సంతోషంలో మునిగిపోయిన ఆయన వర్గీయులు, అనుచరులు బద్వేల్ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో బాణాసంచా పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

గతంలో ఈ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా రితేశ్ రెడ్డి వ్యవహరించారు. ఇప్పుడు మంచూరి సూర్యనారాయణరెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో ఆయన అనుచరులు బద్వేలులో పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) 75వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
    1
    ఎమ్మిగనూరు పట్టణంలో ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) 75వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఏపీఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
    user_G VENKATESH YADAV
    G VENKATESH YADAV
    Ambulance service ఎస్.మైదుకూరు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం గ్రామంలోని పురాతన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయానికి చెందిన విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆలయంలో ఒకపక్క అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, దేవాదాయ (ఎండోమెంట్) శాఖ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కారణంగా స్వామివారి మాన్యాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే నంబర్ల పరిధిలో ఎకరాల కొద్దీ భూమి కబ్జాకు గురైనట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి. కబ్జాకు గురైన భూముల వివరాల ప్రకారం, శాఖరాజుపల్లిలోని సర్వే నంబర్ 261లో 2 ఎకరాలకు పైగా, నేకనాపురం పరిధిలోని సర్వే నంబర్ 177లో 1 ఎకరా 16 సెంట్లు, సర్వే నంబర్ 36లో 23 సెంట్లు భూమి ఆక్రమణకు గురయ్యాయి. అలాగే వంతాటిపల్లె పరిధిలో సర్వే నంబర్ 157లో 58 సెంట్లు, సర్వే నంబర్ 164లో 38 సెంట్లు, సర్వే నంబర్ 185లో 1 ఎకరా 80 సెంట్లు భూమి అన్యాక్రాంతమైంది. పేర్కొన్న వివరాలే కాకుండా, రంగనాథ స్వామి ఆలయానికి చెందిన మరికొన్ని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నట్లు సమాచారం.
    1
    వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం గ్రామంలోని పురాతన శ్రీదేవి భూదేవి సమేత రంగనాథ స్వామి ఆలయానికి చెందిన విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఆలయంలో ఒకపక్క అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, దేవాదాయ (ఎండోమెంట్) శాఖ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం కారణంగా స్వామివారి మాన్యాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే పలు సర్వే నంబర్ల పరిధిలో ఎకరాల కొద్దీ భూమి కబ్జాకు గురైనట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి.

కబ్జాకు గురైన భూముల వివరాల ప్రకారం, శాఖరాజుపల్లిలోని సర్వే నంబర్ 261లో 2 ఎకరాలకు పైగా, నేకనాపురం పరిధిలోని సర్వే నంబర్ 177లో 1 ఎకరా 16 సెంట్లు, సర్వే నంబర్ 36లో 23 సెంట్లు భూమి ఆక్రమణకు గురయ్యాయి. అలాగే వంతాటిపల్లె పరిధిలో సర్వే నంబర్ 157లో 58 సెంట్లు, సర్వే నంబర్ 164లో 38 సెంట్లు, సర్వే నంబర్ 185లో 1 ఎకరా 80 సెంట్లు భూమి అన్యాక్రాంతమైంది. పేర్కొన్న వివరాలే కాకుండా, రంగనాథ స్వామి ఆలయానికి చెందిన మరికొన్ని భూములు కూడా కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నట్లు సమాచారం.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    4 hrs ago
  • నంద్యాల కోర్టులో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుండి రూ. 3 కోట్ల 50 లక్షల ఆర్థిక సహాయం లభించింది. ఈ సందర్భంగా గౌరవ నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడుపై అభినందనల వర్షం కురుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. న్యాయవాదులు ఎన్నడూ లేని విధంగా కక్షిదారులు రాజీ పడేలా విశేష కృషి చేశారని కొనియాడారు. మోటర్ వెహికల్స్ యాక్సిడెంట్ కేసులు, జిల్లా కోర్టు స్థాయి సివిల్ కేసులు, బ్యాంకు వ్యవహారాలు, లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో పాటు కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహాయంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. బాధితుల పక్షాన నిలబడి అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడికి అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
    3
    నంద్యాల కోర్టులో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీల నుండి రూ. 3 కోట్ల 50 లక్షల ఆర్థిక సహాయం లభించింది. ఈ సందర్భంగా గౌరవ నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజు చేతుల మీదుగా బాధితులకు ఈ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడుపై అభినందనల వర్షం కురుస్తోంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి అమ్మన్న రాజా మాట్లాడుతూ, జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 125 మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. న్యాయవాదులు ఎన్నడూ లేని విధంగా కక్షిదారులు రాజీ పడేలా విశేష కృషి చేశారని కొనియాడారు. మోటర్ వెహికల్స్ యాక్సిడెంట్ కేసులు, జిల్లా కోర్టు స్థాయి సివిల్ కేసులు, బ్యాంకు వ్యవహారాలు, లిటికేషన్ కేసులు కలిపి దాదాపు 300 వరకు పరిష్కారం కానున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించి న్యాయవాది సుబ్బరాయుడు మాట్లాడుతూ, ఇన్సూరెన్స్ కంపెనీల సహకారంతో పాటు కంపెనీల లీగల్ అడ్వైజర్ విజయ శేఖర్ రెడ్డి సహాయంతో 30 నుంచి 40 కేసులకు సంబంధించి రూ. 3 కోట్ల 50 లక్షల విలువైన చెక్కులను బాధితులకు పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. బాధితుల పక్షాన నిలబడి అండగా నిలిచిన వకీల్ సాబ్ సుబ్బరాయుడికి అభినందనలు వ్యక్తమవుతున్నాయి.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    56 min ago
  • అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బొచ్చుపల్లి గ్రామంలో మొహరం వేడుకలు నిర్వహించలేదనే మనస్తాపంతో వన్నూరు స్వామి అనే వ్యక్తి గురువారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మరియు గ్రామ పెద్దలు హుటాహుటిన సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. టవర్ పై ఉన్న వన్నూరు స్వామిని కిందకు దిగి రావాలని వారు పదేపదే విన్నవించినా, అతను వినిపించుకోకుండా మొండిగా అక్కడే ఉండిపోయాడు. దీనివల్ల అక్కడ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది.
    1
    అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బొచ్చుపల్లి గ్రామంలో మొహరం వేడుకలు నిర్వహించలేదనే మనస్తాపంతో వన్నూరు స్వామి అనే వ్యక్తి గురువారం సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు మరియు గ్రామ పెద్దలు హుటాహుటిన సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. టవర్ పై ఉన్న వన్నూరు స్వామిని కిందకు దిగి రావాలని వారు పదేపదే విన్నవించినా, అతను వినిపించుకోకుండా మొండిగా అక్కడే ఉండిపోయాడు. దీనివల్ల అక్కడ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.