బద్వేలు జడ్పిటిసి చిన్నపోలిరెడ్డి అరెస్టుపై స్పందించిన వైసిపి నాయకుడు పోలిరెడ్డి... బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ? మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్ చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు. ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,వారి కుమారుడు రితేష్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు. మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ,యం.పి అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే డా.దాసరి సుధ మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.
బద్వేలు జడ్పిటిసి చిన్నపోలిరెడ్డి అరెస్టుపై స్పందించిన వైసిపి నాయకుడు పోలిరెడ్డి... బద్వేలు:మా సోదరుని పై పెట్టిన అక్రమ కేసు గురించి న్యాయ పోరాటం చేస్తాం అని వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ వంకెల పెద్ద పోలి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారి స్వగృహం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూరెండు రోజుల క్రితం మా సోదరుడు బద్వేలు జడ్.పి.టి.సి చిన్న పోలి రెడ్డి ని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఏది అయితే పోలీస్ లు కేసు నమోదు చేసి న FIR రిపోర్ట్ మరియు రిమాండ్ రిపోర్ట్ లో 2010 మరియు 2011 వ సంవత్సరానికి సంబంధించి మా సోదరుడు సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న కాలం లో ICDP కి సంబంధించి 34 లక్షల రూపాయలు అవినీతి జరిగింది అని పేర్కొనడం జరిగిందని.ప్రదానంగా 2014 నుండి 2019 వరకు తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లో ఉన్నది నిజంగా మేము తప్పు చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం లో చర్యలు ఎందుకు తీసుకోలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నాని.నిజంగా మేము తప్పు చేసి ఉంటే 2019 నుండి 2024 వరకు మా ప్రభుత్వం అధికారం లో ఉన్నది మేము ఏదో ఒకటి మేనేజ్ చేసుకునే వాళ్ళం కదా ? మా మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన ఇప్పటి CEO మహేష్ కుమార్ చేసిన అవకతవకల గుర్తించి మా ప్రభుత్వంలో CEO నుండి క్లర్క్ గా డిమోషన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు.ఈ మహేష్ కుమార్ అనే వ్యక్తిని
తెలుగు దేశం పార్టీ నాయకులు మళ్ళీ నీకు ఉద్యోగం లో ప్రమోషన్ కల్పిస్తామని ఆశ చూపి లొంగ తీసుకొని మా మీద ఒక అక్రమ కంప్లైంట్ ఇప్పించడం జరిగింది అని ధ్వజమెత్తారు. ఒక అవినీతి ఉద్యోగి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం చాలా హాస్యాస్పదమన్నారు.మా రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకమాజీ ఎమ్మెల్యే విజయమ్మ ,వారి కుమారుడు రితేష్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్ర పన్ని మా మీద అక్రమ కేసులు పెట్టించి రిమాండ్ కు తరలించడం జరిగింది అని తెలిపారు. బద్వేలు రూరల్ మరియు మున్సిపాలిటీ పరిధి లో మాకు బలమైన వర్గం,బంధుత్వం ఉన్న కారణంగా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా వచ్చే స్థానిక ఎన్నికల లోపు మా మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అని తెలిపారు. మాకు ఎన్ని ఇబ్బదు లు పెట్టినా మా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ,యం.పి అవినాష్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాథ్ రెడ్డి ,ఎమ్మెల్సీ డి సి గోవింద రెడ్డి ,ఎమ్మెల్యే డా.దాసరి సుధ మరియు మా నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళలా మా కుటుంబానికి అండగా నిలవడం జరిగింది అని తెలిపారు.మాకు కష్ట కాలంలో ఒక ధైర్యాన్ని,భరోసా ను కల్పించినా వీరందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అన్నారు. కచ్చితంగా ఈ అక్రమ కేసు గురించి న్యాయస్థానం ను ఆశ్రయించి న్యాయం జరిగేలా పోరాడతాతం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ జయరాం రెడ్డి,కౌన్సిలర్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు.
- బద్వేలు ,ఏప్రిల్ 14: బద్వేలు స్థానిక సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారు పరోక్షంగా నైనా కుల వివక్షతను సమర్పించడం నేరం అవుతుందని వారు తెలిపారు. మతం మారిన, కులాంతరవివాహం జరిగిన, కులఆధిపత్యం విషయంలో తర్జన, భర్జన జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వేసిన రాజేంద్ర సచార్, రంగనాథ్ మిశ్రా రెండు కమిషన్లు క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధం మతాలలోకి దళితులు స్వచ్ఛందంగా మత మార్పిడి చేసుకున్న కుల వివక్షత కొనసాగుతున్నదని ఇచ్చిన రిపోర్టును సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ఒక నిర్ధారణకు వచ్చి తీర్పు ఇచ్చిందని ఇది తొందరపాటు నిర్ధారణగాళనూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిపారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు గారు ఆకివీడు ఘటనలో హిందూ, క్రిస్టియన్ వివాదం సృష్టించి నేరం చేశారని వారు ఆరోపించారు. హిందూ, క్రైస్తవుల మధ్య వైశ్యామ్యాలు, వైరుధ్యాలు పెంచేందుకు పాలక పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారని విమర్శించారు. మతం పేరుతో దళితుల్ని చీల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. కుల నిర్మూలన కోసం, కుల సంఘాలు పనిచేయాలని కోరారు. కుల నిర్మూలన కోసం సాగే ప్రజాస్వామిక ఉద్యమాలను బలహీనపర్చకూడదని తెలిపారు. సామాజిక ప్రజాస్వామ్యం లేనిదే పాలకులకు రాజకీయ మనుగడ లేదని జోష్యం చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి మార్క్సిస్టు పార్టీ ఒకటేనని తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సభలో పట్టణ కమిటీ సభ్యులు ఎం చిన్ని, పి.చాద్ బాషా, మస్తాన్ షరీఫ్, మోక్షమ్మ, సుబ్బరాయుడు, బద్వేల్ రూరల్ కార్యదర్శి డి.వెంకటేష్, అట్లూరు మండల కార్యదర్శి ఈ.రమణయ్య, సిపిఎం పట్టణ నాయకులు సత్తారు, అన్వర్, మూర ప్రసాద్, వెంకటపతి, వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసులు, బాబయ్య, బాలమ్మ, సుబ్బమ్మ, రాణమ్మ , రత్నమ్మ, రోజమ్మ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.1
- వై.ఎస్.ఆర్ కడప జిల్లా.. వై.ఎస్.ఆర్ కడప జిల్లా పులివెందులలో పోలీసుల మెరుపు దాడి ...15 కిలోల గంజాయి స్వాధీనం.. 👉 18 మంది నిందితుల అరెస్ట్.. 👉 110 లీటర్ల నాటు సారాయి పట్టివేత.. 👉 కదిరి రింగ్ రోడ్ వద్ద గంజాయి రవాణా అడ్డగింత.. 👉 గంజాయి కేసులో 10 మంది అరెస్ట్... 👉 నాటు సారా కేసులో 8 మంది అదుపులోకి.. 👉 ప్రధాన నిందితుడు గొర్ల భారత్ యాదవ్‌కు పాత కేసుల లింక్... 👉 వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ గంజాయి వ్యాపారం .. గంజాయి కొనుగోలుకు రూ.30 వేల పెట్టుబడి... పులివెందుల అర్బన్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్.. ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాలపై దాడులు.. SDPO మురళి ఆధ్వర్యంలో చర్యలు పట్టుబడ్డ వారిని రిమాండ్‌కు తరలింపు... డ్రగ్స్, నాటు సారాయిపై కఠిన చర్యలు కొనసాగుతాయి.. కడప జిల్లాలోని పులివెందులలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. గంజాయి మరియు నాటు సారాయి అక్రమ రవాణాపై దాడులు చేసి మొత్తం 18 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు, పులివెందుల SDPO బి.మురళి ఆధ్వర్యంలో పులివెందుల అర్బన్ పోలీసులు ఈ ప్రత్యేక దాడులు చేపట్టారు. ఉదయం కదిరి రింగ్ రోడ్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.అదే సమయంలో పులివెందుల పట్టణంలో నాటు సారాయి అమ్ముతున్న మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు మంగళవారం మీడియా కు తెలిపారు. పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ గారు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు కేసు వివరాలు వెల్లడించారు. అరెస్టు చేసిన వారి వద్ద నుంచి 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు గొర్ల భరత్ యాదవ్‌కు పాత కేసులు ఉన్నట్లు, జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఈ వ్యాపారంలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, నాటు సారాయి అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు కఠినంగా హెచ్చరించారు. ➡️ వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటాం : ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు వ్యవస్థికృత నేరాలకు( ఆర్గనైజ్డ్ క్రైమ్ )పాల్పడే వారి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గా పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ప్రణాళిక ప్రకారం నేరం చేసి సంపాదించిన వారు, నేరంలో పాల్గొన్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు సీరియస్ గా పరిగణించి కఠిన శిక్ష విధించేలా చట్టంలో పొందు పరిచారన్నారు.1
- Post by Palakattu nagendra1
- అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి... అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత... భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుడు సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళి. చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా.1
- Post by Bondhu Suresh1
- Post by కొప్పాల సూర్యనారాయణ1
- నందికొట్కూరు పట్టణంలో మండల కేంద్రాలలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే జయ సూర్య పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాటం చేశాడని పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని యువత అంబేద్కర్ బాటలో నడవాలని సూచించారు. బజార సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ప్రత్యేక నివాళులర్పించారు.1
- బద్వేలు, మలుపు, ఏప్రిల్ 14:డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 సందర్భంగా సాయి శెట్టి పల్లె గ్రామంలో కేకు కట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను గురించి మేక రవి మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులే మహిళలకు 33% రిజర్వేషన్ కావాలం నీ ఆనాడే తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఇప్పటికే పాలకులు దళితులలో అలజడి సృష్టిస్తున్నారు కులాలు మతాలు రెచ్చగొడుతూ హిందూ ముస్లింలు రెచ్చగొడుతున్నారు రాబోయే కాలంలో దేశంలో అలజడి సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని ముందు జాగ్రత్తగా ప్రజలు ఉండాలి మతాలకు వ్యతిరేకంగా ఉండకూడదు అని చట్టం ముందు అందరు సమానులేని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సగిలి వరప్రసాద్, మాజీ సర్పంచ్ మేక జోసఫ్, యువకులు మేక ప్రవీణ్, ఓబయా, సంటయ్య, సగిలి సుకుమార్, మేక ప్రేమ్ కుమార్, నారిపోగు రమణ,శేఖర్, యోహాను, వర కుమార్, తదితరులు పాల్గొన్నారు.1