Shuru
Apke Nagar Ki App…
మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే కారణంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులో భాగంగా తెల్లవారు జామున ఇళ్ళకెళ్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సాధులక్ష్మి, ఉప సర్పంచ్ పాల గంగాధర్ రెడ్డిలను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శంకుస్థాపన కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్ ను ఆహ్వానించిన విద్యుత్ శాఖ అధికారులైతే, అదే సమయంలో అరెస్టు చేసిన పోలీసులు...
Ramprasad islavath
మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకుంటారనే కారణంగా బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులో భాగంగా తెల్లవారు జామున ఇళ్ళకెళ్లి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ సాధులక్ష్మి, ఉప సర్పంచ్ పాల గంగాధర్ రెడ్డిలను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శంకుస్థాపన కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్ ను ఆహ్వానించిన విద్యుత్ శాఖ అధికారులైతే, అదే సమయంలో అరెస్టు చేసిన పోలీసులు...
More news from తెలంగాణ and nearby areas
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- నర్సంపేట: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా నిలబడి ప్రయాణికులకు జాగ్రత్తలు సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ వినూత్నంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించగా, కారులో ప్రయాణించే డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీటు బెల్ట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజలను ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.2
- Post by Veesachandu1
- గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.1
- నకిరేకల్ నియోజకవర్గం:- ఈ రోజు చందుపట్ల గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అన్ని వర్గాల కోట్లాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.3
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- వరంగల్ జిల్లా లో: ఎన్ఐటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. హనుమకొండ నుంచి కాజీపేట వైపు వెళ్తున్న ఆటో, హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సును వెనుక నుంచి ఢీకొంది. దీంతో డ్రైవర్ ఆటోలోనే ఇరుక్కుపోగా, ఎడమ కాలు విరిగింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి 30 నిమిషాల్లో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.1