*టెక్నాలజీ అనుసంధానంతో రైతుల ఆదాయం పెంపు:జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* ఎమ్మిగనూరు, డిసెంబర్,రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, భూమి సారవంతం పెంపు దిశగా ప్రకృతి వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల రైతు సేవా కేంద్రంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సందర్భంగా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీక్షించి అనంతరం గ్రామ రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతోమాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పంటల ఆరోగ్యం, నేల ప్రాంతీయ జీవ వైవిధ్యాన్ని కాపాడుతుందని తెలిపారు. రసాయనాల వినియోగం తగ్గించే, నేలలో జీవ క్రియాశీలత పెంచే విధానాలను రైతులు అమలు చేస్తే అధిక దిగుబడి సహజంగానే వస్తుందని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వినియోగం గురించి మాట్లాడుతూ…తక్కువ నీటితో అత్యధిక లాభం పొందే మార్గం ఇదేనని, ముఖ్యంగా ఉల్లి, బొప్పాయి, చీనీ, ఉద్యాన పంటల తోటల వంటి పంటల్లో డ్రిప్ సాగు పద్ధతులు రైతులకు మంచి ఆదాయం అందిస్తున్నాయని తెలిపారు. వర్షపాతం అనిశ్చిత పరిస్థితుల్లో డ్రిప్ వ్యవసాయం రైతులకు రక్షణగా నిలుస్తుందని అన్నారు. సాయిల్ హెల్త్ కార్డులు, వాతావరణ సూచనలు, మొబైల్ యాప్స్, డ్రోన్ స్ప్రేయింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వ్యవసాయంతో అనుసంధానించడం వల్ల ఖర్చులు తగ్గి, సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు పడుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాల విధి విధానాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, సబ్సిడీ పరికరాలు, పంటల ఇన్సూరెన్స్, మార్కెట్ లింకేజింగ్ వంటి అంశాలను రైతులకు వివరించి, వారి సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు సూచనలు తెలియజేశారు.జిల్లాలో ఏ పంట వేసినా శాస్త్రీయ పద్ధతులే పాటించాలని, సహజ వనరులను సంరక్షించే విధంగా వ్యవసాయం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి ఖాద్రీ, తహశీల్దార్ శేషఫణి తదితరులు పాల్గొన్నారు.
*టెక్నాలజీ అనుసంధానంతో రైతుల ఆదాయం పెంపు:జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* ఎమ్మిగనూరు, డిసెంబర్,రైతుల ఆదాయం పెంపు, ఖర్చుల తగ్గింపు, భూమి సారవంతం పెంపు దిశగా ప్రకృతి వ్యవసాయం కీలక భూమిక పోషిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల రైతు సేవా కేంద్రంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న సందర్భంగా ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారాన్ని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీక్షించి అనంతరం గ్రామ రైతులతో సంభాషించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతోమాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పంటల ఆరోగ్యం, నేల ప్రాంతీయ జీవ వైవిధ్యాన్ని కాపాడుతుందని తెలిపారు. రసాయనాల వినియోగం తగ్గించే, నేలలో జీవ క్రియాశీలత పెంచే విధానాలను రైతులు అమలు చేస్తే అధిక దిగుబడి సహజంగానే వస్తుందని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వినియోగం గురించి మాట్లాడుతూ…తక్కువ నీటితో అత్యధిక
లాభం పొందే మార్గం ఇదేనని, ముఖ్యంగా ఉల్లి, బొప్పాయి, చీనీ, ఉద్యాన పంటల తోటల వంటి పంటల్లో డ్రిప్ సాగు పద్ధతులు రైతులకు మంచి ఆదాయం అందిస్తున్నాయని తెలిపారు. వర్షపాతం అనిశ్చిత పరిస్థితుల్లో డ్రిప్ వ్యవసాయం రైతులకు రక్షణగా నిలుస్తుందని అన్నారు. సాయిల్ హెల్త్ కార్డులు, వాతావరణ సూచనలు, మొబైల్ యాప్స్, డ్రోన్ స్ప్రేయింగ్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వ్యవసాయంతో అనుసంధానించడం వల్ల ఖర్చులు తగ్గి, సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు పడుతుందని అన్నారు. రైతు సేవా కేంద్రాల విధి విధానాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, సబ్సిడీ పరికరాలు, పంటల ఇన్సూరెన్స్, మార్కెట్ లింకేజింగ్ వంటి అంశాలను రైతులకు వివరించి, వారి సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అధికారులకు సూచనలు తెలియజేశారు.జిల్లాలో ఏ పంట వేసినా శాస్త్రీయ పద్ధతులే పాటించాలని, సహజ వనరులను సంరక్షించే విధంగా వ్యవసాయం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి ఖాద్రీ, తహశీల్దార్ శేషఫణి తదితరులు పాల్గొన్నారు.
- Post by KLakshmi Devi1
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- *పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, గురజాల టౌన్ నందు గురజాల గ్రామదేవత పాతపాటేశ్వరమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా "గురజాల టౌన్ లోని బస్టాండ్" ఎదురుగా ఏర్పాటు చేసిన సభలో గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది*1
- Post by Omnamashivaya S1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1
- Post by Nirmal KR NEWS 3691
- Post by Ravi Poreddy1
- *బ్రేకింగ్ న్యూస్*చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రా ప్రమాదంనలుగురు స్పాట్ లో మృతి.ట్రాక్టర్ ల లోడ్ తో వెళుతున్న కంటైనర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన షిఫ్ట్ కారు.కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు లో నలుగురు స్పాట్లోమృతిగుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న షిఫ్ట్ కారు.* ఇద్దరు ని ఆసుపత్రికి తరలింపు.. వారిలో ఒకరు పరిస్థితి విషమం*1