Shuru
Apke Nagar Ki App…
స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు..ఒకే చోట పెన్షన్ ఇవ్వాలని లబ్ధిదారుల విజ్ఞప్తి జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా పెన్షన్ ఎక్కడ పంపిణీ చేస్తారో స్పష్టత లేక లబ్ధిదారులు పలుచోట్లకు తిరుగుతూ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ కోసం రావడమే కష్టంగా ఉన్న తమను ఇలా తిప్పడం ఇబ్బందిగా ఉందని, ఒకే చోట పెన్షన్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
M D Azizuddin
స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు..ఒకే చోట పెన్షన్ ఇవ్వాలని లబ్ధిదారుల విజ్ఞప్తి జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా పెన్షన్ ఎక్కడ పంపిణీ చేస్తారో స్పష్టత లేక లబ్ధిదారులు పలుచోట్లకు తిరుగుతూ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ కోసం రావడమే కష్టంగా ఉన్న తమను ఇలా తిప్పడం ఇబ్బందిగా ఉందని, ఒకే చోట పెన్షన్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.1
- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.1
- భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో ముసాయిదా ఓటరు జాబితాను ప్రజల పరిశీలన కోసం అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా సిరోలు మండలం చిలుకోడు, గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని ఓటరు నమోదు, సవరణల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ డ్రాప్టు ముసాయిదా లో తమ పేరు సరిగా ఉందో లేదో తెలుసుకొని ఓటును నిర్ధారించుకోవడం కోసం నెల రోజుల సమయం ఉందని, నోటీసులు అందుకున్న ఓటర్లు తమ నిర్ధారణ సర్టిఫికెట్లు అప్లోడ్ చేసి సమర్పించి ఓటు హక్కును భద్రపరుచుకోవాలని తెలిపారు, 18 ఏళ్లు నిండిన అర్హులైన పౌరులు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవాలని, పేరు లేని పక్షంలో వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యవత ఫారమ్-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.ఓటరు కార్డులో పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఫోటో తప్పుగా ఉంటే ఫారమ్-8 ద్వారా సరిచేసుకోవచ్చని మరణించిన వారి లేదా ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించేందుకు ఫారమ్-7 ఉపయోగించవచ్చని తెలిపారు. నేరుగా బి.ఎల్.ఓ లేదా గ్రామ,వార్డు సచివాలయాల వద్ద మాత్రమే కాకుండా, 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని , పిలుపునిచ్చారు. నెలరోజుల సమయం ఉందని నోటీసులు అందుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును సంబంధిత ఫారాల ద్వారా నిర్ధారించుకోవాలని అందుకోసం రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉంటారని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆర్డీవో గణేష్ , తహసిల్దార్ పున్నం చందర్, స్థానిక సర్పంచ్ ఉడుముల వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ తేజవాత్ సుధాకర్, ఎంపీడీవో గౌస్ పాషా, పంచాయతీ సెక్రెటరీ నాగయ్య, బి.ఎల్.ఓలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి: నాయిని హనుమకొండ జిల్లా: తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) హెచ్‌ఎన్‌కే జిల్లా ఆధ్వర్యంలో గురువారం సుబేదారి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఉద్యోగులు, పెన్షనర్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉద్యోగ వర్గాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహాధర్నాలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొన్నారు.1