logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉత్పత్తులకు కొనుగోలు చేసి చేయూత అందించాలి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేస్తున్న వివిధ రకాల ఉత్పత్తులకు కొనుగోలు చేసి చేయూత అందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనుగోలుదారులకు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం తాడిగడప మున్సిపాలిటీ కానూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో" కొనుగోలుదారులు... అమ్మకందారుల సమ్మేళనం' పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో జిల్లాలో పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసి ప్రదర్శనకు ఉంచిన వివిధ అకాల ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, పారిశుద్ధ్య ద్రవ పదార్థాలు, ఆకు పళ్ళెములు తదితర గృహోపకరణ వస్తువులు,సామాగ్రి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. . ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఇంజనీరింగ్ కళాశాలలోని ఆడిటోరియం లో మొత్తం 197 ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయగా, మహిళా వ్యాపారవేత్తలు కొనుగోలుదారులతో కళకళలాడింది. జిల్లా కలెక్టర్ ఎంతో ఓపికగా ప్రతి ప్రదర్శనశాల వద్దకు వెళ్లి మహిళలు తయారు చేసిన వస్తువుల ధరలు, తయారీకి అయ్యే ఖర్చు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వారికి వచ్చే ఆదాయం తదితర వివరాలు, సమ్మేళనంపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయం మేరకు ప్రతి కుటుంబంలో ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదంతో జిల్లాలోని స్వయం సహా సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో నిజంగా జీవితంలో పైకి ఎదగాలనే తపన, కష్టపడే మనస్తత్వం కలిగిన 500 మందిని గుర్తించామని అందులో 300 మందికి ప్రభుత్వ సహకారంతో పాటు పలు పథకాల కింద బ్యాంకు రుణాలు మంజూరు చేయించి వివిధ రకాల యూనిట్లు స్థాపించడానికి తోడ్పాటు అందించామన్నారు ఇదివరకు వారు తయారు చేసిన ఉత్పత్తులు ఎక్కడ అమ్మాలో తెలియక సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు. వారి వ్యాపారం సుస్థిరంగా ఉండాలంటే వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో కొనుగోలుదారులు అమ్మకందారుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామన్నారు. సమ్మేళనం ద్వారా మంచి ఆహార ఉత్పత్తులు సమీపంలో ఎక్కడున్నాయో కొనుగోలుదారులకు తెలిసే అవకాశం లభించిందన్నారు. తక్కువ ధరలో ఉత్పత్తులు రవాణా ఖర్చులు లేకుండా వారికి లభ్యమవుతాయన్నారు. నాణ్యతగా ఉన్న ఆహార ఉత్పత్తులను కొనుగోలుదారులు హోటల్ యజమానులు కొనుగోలు చేయడంతో పాటు వాటి ఫోటో తీసుకుని వారికి తెలిసిన వారందరికీ షేర్ చేస్తూ కూడా విస్తృతంగా తెలియజేయాలన్నారు నాణ్యత విషయంలో గానీ ఇతర ఏమైనా లోటుపాట్లు ఉంటే ఉత్పత్తిదారులకు సూచనలు కూడా ఇవ్వాలన్నారు. జిల్లా యంత్రాంగం పిలుపుమేరకు వచ్చిన కొనుగోలుదారులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో అమృత కృష్ణా పేరుతో ప్లాస్టిక్ ను నివారించే ఉద్దేశంతో గాజు సీసాలతో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎవరైనా సరే అవసరము ఉన్నవారు మంచినీటినీ కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలుదారులను మహిళ వ్యాపారవేత్తలు సంప్రదిస్తే వారికి కావలసిన సహకారం అందించాలన్నారు. పెద్ద పెద్ద కొనుగోలుదారుల నుండి ఏమైనా ఆర్డర్లు వస్తే మహిళా వ్యాపారవేత్తలు వారి శక్తి సామర్థ్యాలకు మించకుండా నాణ్యత లోపం లేకుండా ఉత్పత్తులు సరఫరా చేయాలన్నారు. చెప్పిన సమయానికి నాణ్యత గల ఉత్పత్తులు సరఫరా చేసే విధంగా మహిళా వ్యాపారవేత్తలు సిద్ధంగా ఉండాలన్నారు అనంతరం ఆంధ్ర ప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి మాట్లాడుతూ హోటల్ యజమానులు అందరూ ఐకమత్యంగా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్ తొలిసారిగా ఇటువంటి సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. మహిళా వ్యాపారవేత్తలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రమణ మాట్లాడుతూ హోటల్లలో ఉలవచారు తప్పకుండా వాడతామని సమ్మేళనంలో ఉంచిన ఉలవచారు కూడా గమనించి కొనుగోలు చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకునీ కొనుగోలుదారులకు అమ్మకందారులకు ప్రత్యేకంగా సమ్మేళనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుటుంబం ఒక వ్యాపారవేత్త అనే నినాదానికి తమ వంతు సహకారం తప్పకుండా అందిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కోరిన మీదట తమకు కావలసిన మంచినీటి సీసాలను కృష్ణ కలెక్టరేట్ నుండి కొనుగోలు చేస్తామన్నారు. వాణి స్వీట్స్ అధినేత క్యాటరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు దిలీప్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం రూపొందించిన వివిధ ఉత్పత్తుల ధరల కేటలాగు చాలా బాగుందని ఏదైనా ఒక యాప్ ద్వారా డిజిటల్ చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. మహిళా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యతగా ఉంటే తాము కొనుగోలు చేస్తామని ఆ నాణ్యత నిరంతరం కొనసాగాలన్నారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జిబివి రవికుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సమ్మేళనం ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం అన్నారు. తమ సంఘం భవనంలో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలని చక్కగా వ్యాపారం జరుగుతుందని చెప్పారు. అనంతరం మహిళా వ్యాపారవేత్తలు సత్యవతి, సుష్మ తాము ఎలా వ్యాపారం మొదలు పెట్టి అభివృద్ధి చేశాము మిఠాయిలు ,తినుబండారాలు, ఎంబ్రాయిడరీ, చేనేత వస్త్రాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ కల్పన, డిఆర్ఓ చంద్రశేఖర రావు, ఇండియన్ బ్యాంకు ఆర్ఎం రాజేష్ ఉయ్యూరు ఇన్చార్జ్ ఆర్డిఓ కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, డి ఆర్ డి ఏ పి డి హరిహరనాథ్, డి ఐ సి జి ఎం వెంకటరావు జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు,, మార్కెటింగ్ ఎడి నిత్యానందం, డి టి డబ్ల్యూ ఫణి ధూర్జటి, మార్క్ఫెడ్ డిఎం మురళీ కిషోర్, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, జడ్పీ సీఈవో కన్నమ నాయుడు, జిల్లా ఉద్యాన అధికారి జే.జ్యోతి, ఎల్డిఎం రవీంద్రారెడ్డి, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, ఆహార తనిఖీ అధికారి గోపాలకృష్ణ, జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్, సంయుక్త కార్యదర్శి ఈమని దామోదర్ రావు పలువురు పారిశ్రామికవేత్తలు కొనుగోలుదారులు పాల్గొన్నారు. -------------------------------------------------------------- జిల్లా సమాచార పౌర సంబంధాలఅధికారి, కృష్ణాజిల్లా మచిలీపట్నం

1 day ago
user_Arja Durga Prasad
Arja Durga Prasad
మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
1 day ago
e81419dc-1813-41f5-9d7c-f9add9b53c6d

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్ గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
    1
    L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం : ఫైర్
గుంటూరు:L&T కంపెనీ నిర్లక్ష్యం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని ఫైర్ డీజీపీ వెంకటరమణ అన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. పక్క పొలంలో మంటలు వ్యాపించి ఎండు గడ్డి మీద ఉన్న పైపులకు అంటుకున్నాయని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీ వచ్చిన సమయంలో కూడా ఇదే విధంగా జరిగిందన్నారు. పైపుల స్టాక్ను అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించాలని గుత్తేదారు సంస్థకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    12 hrs ago
  • తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.
    1
    తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని  చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by డాక్టర్ బాబు 7036445113
    1
    Post by డాక్టర్ బాబు 7036445113
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...... 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి నివేదిక లో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో వాటర్ శ్యాంపిల్ లను సేకరించి పరీక్షించారు. వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాలికల వసతి గృహం, పాఠశాలను పరిశీలించి విద్యార్థినీలతో ముచ్చటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్ వాడి కేంద్రాల భవవనాలని పరిశీలించారు. అధికారులను ఎప్పటికప్పుడు 99 రోజుల ప్రణాళికలో పనులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా......
99 రోజుల ప్రజాపాలన - ప్రగతి నివేదిక లో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ చండ్రుగొండ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలోని బెండాలపాడు గ్రామంలో వాటర్ శ్యాంపిల్ లను సేకరించి పరీక్షించారు. వాటర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. బాలికల వసతి గృహం, పాఠశాలను పరిశీలించి విద్యార్థినీలతో ముచ్చటించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, అంగన్ వాడి కేంద్రాల భవవనాలని పరిశీలించారు. అధికారులను ఎప్పటికప్పుడు 99 రోజుల ప్రణాళికలో పనులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    9 min ago
  • మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్‌లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
    1
    మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్‌లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్ గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.
    1
    గుంటూరులో 14 మంది గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్
గుంటూరులో గంజాయి సప్లై చేస్తున్న 14 మందిని నిందితులను నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. చౌడవరం పరిధిలో గంజాయి సప్లై చేస్తున్న 8 మందితో పాటు గంజాయి తీసుకుంటున్న మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. గడిచిన 6 నెలల్లో 51 కేసుల్లో 300 మందిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.