Shuru
Apke Nagar Ki App…
బాలవికాస ఆధ్వర్యంలో అనాథ పిల్లల జన్మదిన వేడుకలు హుస్నాబాద్ పట్టణంలోని వైశ్య భవనంలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో బాలవికాస (అనాథ) పిల్లల జన్మదిన వేడుకలు నిర్వంహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిలుగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి హాజరై మాట్లాడుతూ బాలవికాన సంస్థ గత 30 సంవత్సరాల నుండి దాదాపు 1500 మంది వికాస పిల్లలను బాగోగులు తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుతూ దన్నారు. బాలవికాస రాష్ట్ర అధ్యక్షులు కేడం లింగమూర్తి బాలవికాస ద్వారా వాటర్ ప్లాంట్లు, ఎంతోమంది పిల్లలకు చదివిస్తున్నారని తెలిపారు
వేణు విలేకరి
బాలవికాస ఆధ్వర్యంలో అనాథ పిల్లల జన్మదిన వేడుకలు హుస్నాబాద్ పట్టణంలోని వైశ్య భవనంలో బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో బాలవికాస (అనాథ) పిల్లల జన్మదిన వేడుకలు నిర్వంహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిలుగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి హాజరై మాట్లాడుతూ బాలవికాన సంస్థ గత 30 సంవత్సరాల నుండి దాదాపు 1500 మంది వికాస పిల్లలను బాగోగులు తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం జన్మదిన వేడుకలు జరుపుతూ దన్నారు. బాలవికాస రాష్ట్ర అధ్యక్షులు కేడం లింగమూర్తి బాలవికాస ద్వారా వాటర్ ప్లాంట్లు, ఎంతోమంది పిల్లలకు చదివిస్తున్నారని తెలిపారు
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి పాలన వరకు ప్రతి దశలో ఆయన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు. పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు. వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.1
- తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.2
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట వైపు అడవుల నుంచి వచ్చినట్లు భావిస్తున్న పులి రెండు రోజులుగా సంచరిస్తూ మూడు ఆవు దూడలను బలి తీసుకుంది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, పులిని అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.2
- ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.1
- వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.1
- ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాష్ట్ర స్థాయి 8 వ వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రాబోయే ఒలంపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం క్రీడాజ్యోతి పథకంలో భాగంగా 40 క్రీడల్లో యువతీ, యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో వేములవాడ ప్రాంతంలోని క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వేములవాడలో జరిగే ఈ పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించాలని కోరారు.2