హిందూ ఐక్యతకు పిలుపునిచ్చిన మెట్ పల్లి సమ్మేళనం... మెట్ పల్లి ఏప్రిల్ 19: జగిత్యాల జిల్లా, మెట్ పల్లి లోని హిందూ సమ్మేళనం కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అభయ హస్త హనుమాన్ సమీప దుర్గామాత గ్రౌండ్‌లో నేతాజీ బస్తీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, మహిళలు, యువత భారీగా హాజరై విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక స్వామీజీలు మాట్లాడుతూ హిందూ సమాజంలో ఐక్యత అత్యంత అవసరమని పేర్కొన్నారు. సనాతన ధర్మం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మూలస్తంభమని, హిందూ ధర్మం శాంతి, సహనం, సహజీవనాన్ని బోధిస్తుందని తెలిపారు. కాలక్రమేణా ఈ విలువలు కొంత మేర తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబం పిల్లలకు చిన్ననాటి నుంచే హిందూ సంస్కృతి, ఆచారాలు, ధార్మిక విలువలపై అవగాహన కల్పించాలని సూచించారు.ప్రధాన వక్తగా హాజరైన విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సహ కార్యదర్శి ఆకారపు కేశవరాజు మాట్లాడుతూ హిందూ సమాజం ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. హిందూ ధర్మం ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వం సందేశం ఇచ్చిందని, సమాజంలో ఐక్యతే ప్రధాన బలం అని అన్నారు. పరస్పర సహకారం, సామాజిక బాధ్యతతో ముందుకు సాగితేనే ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హిందువులందరూ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో భక్తి గీతాలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, ధార్మిక ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమం విజయవంతానికి నిర్వాహకులు విశేషంగా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ బస్తీ గౌరవ అధ్యక్షులు బొమ్మేల శంకర్, గోపి, అధ్యక్షులు రఘుపతిరావు, ప్రధాన కార్యదర్శి లక్కం మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు పోలీస్ శ్రీనివాస్, 7వ వార్డు కౌన్సిలర్ ధర్మపురి స్వరూప-వేణుగోపాల్, ఆర్ఎస్ఎస్ నాయకులు గుంటుక గంగాధర్, అల్లె మధు, వేములవాడ రాజశేఖర్, గాజంగి నాగరాజు, పాంపట్టి ఆనంద్, కలర్స్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ ఐక్యతకు పిలుపునిచ్చిన మెట్ పల్లి సమ్మేళనం... మెట్ పల్లి ఏప్రిల్ 19: జగిత్యాల జిల్లా, మెట్ పల్లి లోని హిందూ సమ్మేళనం కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అభయ హస్త హనుమాన్ సమీప దుర్గామాత గ్రౌండ్‌లో నేతాజీ బస్తీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, మహిళలు, యువత భారీగా హాజరై విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు ఆధ్యాత్మిక స్వామీజీలు మాట్లాడుతూ హిందూ సమాజంలో ఐక్యత అత్యంత అవసరమని పేర్కొన్నారు. సనాతన ధర్మం భారతీయ సంస్కృతి, సంప్రదాయాల మూలస్తంభమని, హిందూ ధర్మం శాంతి, సహనం, సహజీవనాన్ని బోధిస్తుందని తెలిపారు. కాలక్రమేణా ఈ విలువలు
కొంత మేర తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతి కుటుంబం పిల్లలకు చిన్ననాటి నుంచే హిందూ సంస్కృతి, ఆచారాలు, ధార్మిక విలువలపై అవగాహన కల్పించాలని సూచించారు.ప్రధాన వక్తగా హాజరైన విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సహ కార్యదర్శి ఆకారపు కేశవరాజు మాట్లాడుతూ హిందూ సమాజం ఐక్యంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. హిందూ ధర్మం ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వం సందేశం ఇచ్చిందని, సమాజంలో ఐక్యతే ప్రధాన బలం అని అన్నారు. పరస్పర సహకారం, సామాజిక బాధ్యతతో ముందుకు సాగితేనే ధర్మ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హిందువులందరూ భేదాభిప్రాయాలను పక్కనబెట్టి ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో భక్తి గీతాలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, ధార్మిక
ప్రసంగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమం విజయవంతానికి నిర్వాహకులు విశేషంగా కృషి చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ బస్తీ గౌరవ అధ్యక్షులు బొమ్మేల శంకర్, గోపి, అధ్యక్షులు రఘుపతిరావు, ప్రధాన కార్యదర్శి లక్కం మల్లేష్ యాదవ్, ఉపాధ్యక్షులు పోలీస్ శ్రీనివాస్, 7వ వార్డు కౌన్సిలర్ ధర్మపురి స్వరూప-వేణుగోపాల్, ఆర్ఎస్ఎస్ నాయకులు గుంటుక గంగాధర్, అల్లె మధు, వేములవాడ రాజశేఖర్, గాజంగి నాగరాజు, పాంపట్టి ఆనంద్, కలర్స్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
- బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వారి ఆధ్వర్యంలో పీఏసీఎస్ బోథ్ ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... రైతులకు న్యాయం జరిగేలా అధికారులు సహకరించాలని, ఎండలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని వీలైనంత త్వరగా పంటలను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.1
- ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼1
- Post by Vodnala thirupthi1
- బాబుకు ఆపరేషన్ గురించి1
- హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉదృతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.1
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి): మండలంలోని గోవిందపూర్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. చన్కపూర్ గౌరుబాయి ఇల్లు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం కాలిపోయి భారీ నష్టం సంభవించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. బాధిత కుటుంబానికి సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.1
- బజార్ హత్నూర్ మండలంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 31 మందికి కళ్యాణలక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చెక్కుల వేరిఫైలను అధికారులు ఆలస్యం చేయొద్దని తన దగ్గరకు వచ్చిన రోజే సంతకం చేసే బాధ్యత తనదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు వృత్తిని దైవకార్యంగా భావించి కష్టపడి పనిచేయటమే నిజమైన దేశభక్తి అని బసవన్న గారి సందేశం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున నిర్వహించిన బసవేశ్వర 893 వ జయంతోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. బసవేశ్వరుడు సాంప్రదాయక సమాజంలో కుల, మత భేదాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక అభ్యుదయ వాది అని తెలిపారు మానవతా విలువలను ఆచరణలో పెట్టడం ద్వారా ఆ మహనీయుడి ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కష్టపడి పని చేయడమే నిజమైన దేశభక్తి అనే బసవన్న గారి సందేశం నేటికీ కాలానుగుణ ఔచిత్యాన్ని చాటి చెబుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ మెదక్ జిల్లా .లింగాయత్ సమాజం అధ్యక్షుడు లింగన్న గారి మల్లప్ప గౌరవ అధ్యక్షులు పి.డి ఆనందం జిల్లా జనరల్ సెక్రెటరీ వీరేశం కోశాధికారి ప్రభు కుమార్ శెట్టి శ్రీకాంత్ తప్ప నత్తటి సందీప్ కుమార్ తదితరులు వీరశైవ లింగాయత్ సభ్యులు పాల్గొన్నారు1