Shuru
Apke Nagar Ki App…
వైద్య బాధ్యత.. కోర్టులో ఎమ్మెల్యే సాక్ష్యం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టులో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ 2017లో జరిగిన విద్యుత్ షాక్ మరణం కేసులో వైద్యురాలిగా మెజిస్ట్రేట్ ఎదుట సాక్ష్యం ఇచ్చారు. అప్పట్లో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిణిగా విధులు నిర్వహించిన ఆమె, కోర్టు సమన్ల మేరకు ఏప్రాన్ ధరించి హాజరై సాక్ష్యం చెప్పారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తూ ఎమ్మెల్యేగా కాకుండా వైద్యురాలి బాధ్యతను నిర్వర్తించడం అభినందనీయమని న్యాయవాదులు పేర్కొన్నారు.
V Ramarao
వైద్య బాధ్యత.. కోర్టులో ఎమ్మెల్యే సాక్ష్యం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టులో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ 2017లో జరిగిన విద్యుత్ షాక్ మరణం కేసులో వైద్యురాలిగా మెజిస్ట్రేట్ ఎదుట సాక్ష్యం ఇచ్చారు. అప్పట్లో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిణిగా విధులు నిర్వహించిన ఆమె, కోర్టు సమన్ల మేరకు ఏప్రాన్ ధరించి హాజరై సాక్ష్యం చెప్పారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తూ ఎమ్మెల్యేగా కాకుండా వైద్యురాలి బాధ్యతను నిర్వర్తించడం అభినందనీయమని న్యాయవాదులు పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.1
- కల్లూరు ప్రజాదర్బార్ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సత్తుపల్లి ప్రజాదర్బార్‌లో 3,500కి పైగా, అలాగే పాలేరు నియోజకవర్గంలో 25,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే అభ్యర్థనలు వస్తున్నాయని, పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇళ్లు మంజూరు చేయడం వల్ల నిర్మాణ వ్యయం అదుపులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంపై 8 లక్షల 21 వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోపిందని పొంగులేటి ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, నిషేధిత జాబితా (22A) భూముల కేటాయింపులపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన 'సిట్' సమగ్ర విచారణ జరుపుతోందని తెలిపారు. త్వరలోనే ధరణి అక్రమాల గుట్టు రట్టు చేసి నివేదికను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్దాలుగా నలుగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సర్వే వేగవంతం చేశామని మంత్రి తెలిపారు. పింక్ కలర్ షర్టు వేసుకున్న పేదవాడైనా సరే... కుల, మత, రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి, అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.1
- భోగాపురంలో 13 వేల మంది గిరిజన బాలికల థింసా నృత్యం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది ఆ సంస్థ ప్రతినిధుల నుంచి గిన్నిస్ అవార్డును గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అందుకుని థింసా నృత్యంలో పాల్గొన్నారు...1
- ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి చేసిన PDSU....ఉద్రిక్తత పరిస్థితి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను విడుదల చేయాలని PDSU ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ని ముట్టడించారు. ముందుగా ప్రదర్శన ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త నెలకొంది. జిల్లా అధ్యక్షుడు జి.మస్తాన్ మాట్లాడుతూ.. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు.1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరంలో కదం తొక్కిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ నాయకులు మైలవరం పంచాయతీ కార్యాలయం నుంచి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ... జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా నిరసన కార్యక్రమం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు ఇవ్వాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు.... జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ నాయకులు3
- శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్ శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్ భద్రాచలం: గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో వరద బ్యాక్‌వాటర్ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలోని అన్నదాన సత్రం వద్దకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 3.48 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా 11,44,645 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.1