చిరుత దాడితో రెండు ఆవులు మృతి రూ.60 వేల నష్టం.. ప్రభుత్వ పరిహారం అందించాలని బాధితుడి విజ్ఞప్తి గండీడ్: గండీడ్ మండలం పెద్ద వార్వాల్ గ్రామంలో చిరుత దాడి కలకలం రేపింది. సోమవారం రాత్రి పొలం వద్ద కట్టేసిన రెండు ఆవులు చిరుత దాడిలో మృతి చెందాయి. గ్రామానికి చెందిన శివ్వని బాలయ్య ఎప్పటిలాగే తన ఆవులను పొలం వద్ద కట్టేసి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో పశువులు పెద్దగా అరుస్తుండటాన్ని గమనించిన సాలార్‌నగర్ గ్రామస్తులు బాలయ్యకు సమాచారం అందించారు.వెంటనే బాలయ్యతో పాటు పలువురు రైతులు పశువులు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి చేరుకునే సరికి రెండు ఆవులు మృతి చెంది కనిపించాయి. పశువులపై చిరుత దాడి చేయడంతోనే అవి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో బాలయ్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. గండీడ్ మండలంలోని పలు గ్రామాల్లో చిరుతల సంచారం పెరిగిందని, తరచూ పశువులపై దాడులు జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుతల దాడుల కారణంగా 10 నుంచి 15 పశువులు మృతి చెందినట్లు తెలిపారు. మనుషులపై దాడి జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు పొలాల వద్ద పశువులను కట్టివేయడానికి భయపడుతున్నారు.మృతి చెందిన రెండు ఆవుల విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని బాధితుడు బాలయ్య తెలిపారు. పశువులే తమ కుటుంబానికి ప్రధాన జీవనాధారమని, వాటి మృతితో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం అందించాలని కోరారు. చిరుతల సంచారాన్ని నియంత్రించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి, గ్రామాల్లో భద్రతా ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
చిరుత దాడితో రెండు ఆవులు మృతి రూ.60 వేల నష్టం.. ప్రభుత్వ పరిహారం అందించాలని బాధితుడి విజ్ఞప్తి గండీడ్: గండీడ్ మండలం పెద్ద వార్వాల్ గ్రామంలో చిరుత దాడి కలకలం రేపింది. సోమవారం రాత్రి పొలం వద్ద కట్టేసిన రెండు ఆవులు చిరుత దాడిలో మృతి చెందాయి. గ్రామానికి చెందిన శివ్వని బాలయ్య ఎప్పటిలాగే తన ఆవులను పొలం వద్ద కట్టేసి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో పశువులు పెద్దగా అరుస్తుండటాన్ని గమనించిన సాలార్‌నగర్ గ్రామస్తులు బాలయ్యకు సమాచారం అందించారు.వెంటనే బాలయ్యతో పాటు పలువురు రైతులు పశువులు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి చేరుకునే సరికి రెండు ఆవులు మృతి చెంది కనిపించాయి. పశువులపై చిరుత దాడి చేయడంతోనే అవి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో బాలయ్య కుటుంబం తీవ్ర విషాదంలో
మునిగిపోయింది. గండీడ్ మండలంలోని పలు గ్రామాల్లో చిరుతల సంచారం పెరిగిందని, తరచూ పశువులపై దాడులు జరుగుతున్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుతల దాడుల కారణంగా 10 నుంచి 15 పశువులు మృతి చెందినట్లు తెలిపారు. మనుషులపై దాడి జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు పొలాల వద్ద పశువులను కట్టివేయడానికి భయపడుతున్నారు.మృతి చెందిన రెండు ఆవుల విలువ సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని బాధితుడు బాలయ్య తెలిపారు. పశువులే తమ కుటుంబానికి ప్రధాన జీవనాధారమని, వాటి మృతితో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం అందించాలని కోరారు. చిరుతల సంచారాన్ని నియంత్రించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి, గ్రామాల్లో భద్రతా ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
- తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడిందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధాన నిబంధనలకు విరుద్ధంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ స్కూల్స్ కొనసాగుతున్నాయన్నారు. కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఉపాధ్యాయుల ప్రమోషన్లు నిలిచిపోవడంతో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందన్నారు.1
- పెండింగ్ జీతాలు చెల్లించడంతో కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలని నిరసన తెలుపడంతో అధికారులు పాలకులు దిగివచ్చి జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేర్ చౌరస్తా వద్ద ఉదయం వేళలో మున్సిపల్ కార్మికులు సమావేశమై పెండింగ్ జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ చైర్మన్కు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు1
- వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా కానీ రెండు రోజులకోసారి నిన్ను కలుస్తాను బయటపడ్డ ఢీ షో డాన్సర్ రాజు ఆడియో కాల్. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా జీవితాంతం నీతో స్నేహితుడిగానే ఉంటాను. నీ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నీ తిరిగి ఇచేస్తానని, తనను వదిలేయాలని వేడుకున్న రాజు. నేను నిన్ను మనస్పూర్తిగా ప్రేమించానని, నిన్ను వదులుకోలేనని, నేను చెప్పినట్టు వింటే రాజా లాగా చూసుకుంటానని రాజుకు చెప్పిన శిరీష.1
- రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం! హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.1
- _మున్సిపల్ చైర్ పర్సన్ చందన రవీందర్, ఇన్స్పెక్టర్ రవికుమార్. గజ్వేల్: ప్రజా తెలంగాణ న్యూస్/ గణేష్ నవరాత్రుల సందర్భంగా పట్టణంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు కోరారు. మంగళవారం గజ్వేల్‌లోని కోల అభిరామ్ గార్డెన్స్‌లో నిర్వహించిన “శాంతి సమావేశం” కార్యక్రమంలో ఆమె పాల్గొని గణేష్ మండపాల నిర్వాహకులు, యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అన్ని మండపాల్లో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో మహిళలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటే యువతలో బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొంటే మద్యం సేవించి రావడం వంటి ఆలోచనలకు దూరంగా ఉంటారని, అందువల్ల ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా నిమజ్జనాల్లో పాల్గొని ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ తరఫున నిమజ్జనాల సందర్భంగా చేపట్టాల్సిన అన్ని ముందస్తు జాగ్రత్తలు, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ సిబ్బందిని చైర్ పర్సన్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్ తదితర అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ఎవరూ అనవసరంగా కేసుల్లో చిక్కుకుని తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని యువతకు సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా, శాంతియుతంగా నిర్వహించి గజ్వేల్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ గారు, ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ గారు, విద్యుత్ శాఖ ఏఈ మారుతి గారు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కళ్యాణ్కర్ పద్మబాయి నర్సింగ్ గారు, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సానిటేషన్ ఇన్‌చార్జి సుధాకర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పరిధిలోని గణేష్ మండపాల యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.4
- ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి: కవిత ఉద్యోగ, ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడమే తెలంగాణ రక్షణ సేన విధానం. వారికి గౌరవం, భద్రత కల్పిస్తూ, ప్రజలకు పథకాల ఫలాలు అందేలా సమర్థవంతమైన సుపరిపాలన అందిస్తాం అన్నారు.1
- నాగర్ కర్నూల్ టి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు ప్రియుడు తో కత్తితో పొడిచిన ప్రియుడు విషయం భార్యకు ప్రియుడు కు అడ్డుగా ఉన్నా డ ని చంపేశారు పోలీసులు ఈ కేసును చే దించారు వీడియో1