కామ్రేడ్ డేగల సుభాష్ వర్ధంతి పలువురు ఘన నివాళులు.. *_కామ్రేడ్ డేగల సుభాష్ 23వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు_* *_@బక్కి వెంకటయ్య-తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్._* *_అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఏసీఎఫ్ అరుణోదయ సాంస్కృతిక సమస్యల కోసం నిరంతరం కృషి చేసిన కామ్రేడ్ డేగల సుభాష్ గారి 23వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు._* *_ఈ సందర్భంగా ఆయన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు._* *_°ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ, కామ్రేడ్ డేగల సుభాష్ గారు సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం మరియు సాంస్కృతిక చైతన్యం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా గుర్తుండిపోతారని అన్నారు._* *_°ఆయన ఆశయాలు, ప్రజా ఉద్యమాల పట్ల ఆయనకున్న నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు._* *_ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చైర్మన్ తెలిపారు. కామ్రేడ్ డేగల సుభాష్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు._* *_కామ్రేడ్ డేగల సుభాష్ గారి 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరులు, స్థానిక ప్రజలు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు._* *_ఈ సందర్భంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు దుబ్బాక పాక్స్ చైర్మన్ కైలాసం, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జీడిపల్లి రవి, బుచ్చయ్య,దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ మూర్తి శ్రీనివాస్,ఎర్రోళ్ల రాజు,ఇతరులు పాల్గొన్నారు._*
కామ్రేడ్ డేగల సుభాష్ వర్ధంతి పలువురు ఘన నివాళులు.. *_కామ్రేడ్ డేగల సుభాష్ 23వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు_* *_@బక్కి వెంకటయ్య-తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్._* *_అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో ఏసీఎఫ్ అరుణోదయ సాంస్కృతిక సమస్యల కోసం నిరంతరం కృషి చేసిన కామ్రేడ్ డేగల సుభాష్ గారి 23వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు._* *_ఈ సందర్భంగా ఆయన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు._* *_°ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ, కామ్రేడ్ డేగల సుభాష్ గారు సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం మరియు సాంస్కృతిక చైతన్యం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా గుర్తుండిపోతారని అన్నారు._* *_°ఆయన ఆశయాలు, ప్రజా ఉద్యమాల పట్ల ఆయనకున్న నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు._* *_ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చైర్మన్ తెలిపారు. కామ్రేడ్ డేగల సుభాష్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు._* *_కామ్రేడ్ డేగల సుభాష్ గారి 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సహచరులు, స్థానిక ప్రజలు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు._* *_ఈ సందర్భంలో చైర్మన్ వెంకటయ్య గారితో పాటు దుబ్బాక పాక్స్ చైర్మన్ కైలాసం, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జీడిపల్లి రవి, బుచ్చయ్య,దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ మూర్తి శ్రీనివాస్,ఎర్రోళ్ల రాజు,ఇతరులు పాల్గొన్నారు._*
- గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాలు 26 వేల రూపాయలు అందించి ఉద్యోగ భద్రత కల్పించాలని , మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని , హెల్త్ కార్డులు అందించి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ప్రతి నెల ఒకటో తేదీన కార్మికుల బ్యాంకు ఖాతాలలో జీతాలు జమ చేయాలని , 60 సంవత్సరాలు పైబడిన మరియు చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు CITU - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి సమస్యలపై అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ , యూనియన్ జిల్లా అధ్యక్షులు బూర శ్రీనివాస్ లు మాట్లాడుతూ గ్రామాలను పచ్చదనం , పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా ఎండనక , వాననక , చలనక అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో కూడా స్థానిక అధికారులు , పాలకవర్గాలు కార్మికులను తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని బడ్జెట్ లేదని సాకుతో కొన్ని గ్రామాలలో నెలల తరబడి కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని స్థానిక సమస్యలపై జిల్లా అధికారులను కలిసిన సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై సంబంధిత అధికారులు , జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే కార్మికులందరూ నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిఐటియు జిల్లా కోశాధికారి అన్నల్దాస్ గణేష్ , యూనియన్ జిల్లా కార్యదర్శి మల్యాల నర్సయ్య యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు లోకిని శ్రీనివాస్ , కంసాని రవీందర్ , నారపురం నర్సయ్య , మహేష్ , శేఖర్ , అనిల్ , కాంతయ్య , లక్ష్మి , పద్మ గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు3
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1
- ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు పరచాలని డిమాండ్ చేస్తూ నిరసన రాష్ట్రంలో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎస్సీ మాలలకు ఉన్న రోస్టర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు నాయకులు నిరసన తెలిపారు. ఈనెల 31న మాలమహానాడు ఆధ్వర్యంలో తలపెట్టిన చలో సెక్రటేరియట్ వాల్ పోస్టర్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. గతంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసిన పార్ట్ 1, 2, 3, 4 విధానంతో మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు నాయకులు ఆరోపించారు. 46% రోస్టర్ విధానంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోస్టర్ విధానాన్ని రద్దుచేసి వాళ్లకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 31న లక్షలాదిమంది మాలలు మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ ను దిగ్బంధనం చేసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.2
- శ్రావణమాసం రెండవ బుధవారం భీమన్న క్షేత్రంలో భక్తుల రద్దీ వేములవాడ భీమన్న క్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శ్రావణమాసం రెండవ బుధవారం సందర్భంగా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులు తలనీలాలు సమర్పించి, స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకున్నారు. అభిషేక ప్రియుడైన స్వామివారికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించగా, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. గండాలు తొలగాలని కోరుకుంటూ గండదీపంలో నూనె పోసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షించారు.1
- కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈu సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.1
- గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.1
- ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మీలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. జామే మజీద్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. పెద్ద సంఖ్యలో యువత ర్యాలీలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి, ప్రధాన ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం జామే మజీద్ నుంచి దర్గా వరకు ముస్లిం సోదరులు పాదయాత్ర నిర్వహించారు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిర్వహించిన ఖీర్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు శాంతి, సోదరభావం, దయ, మానవత్వం, సేవాభావం వంటి విలువలను చాటుతూ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు, యూసుఫ్, ముస్తఫా, సత్తార్, సయ్యద్ సమద్, రఫిక్, మునీర్, సయ్యద్ సోహెల్, సయ్యద్ అక్రమ్, రైస్, మహమూద్, షాదాబ్, అంజద్, చాంద్, మత పెద్దలు పాల్గొన్నారు.2
- మెదక్ : రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేవైఎం నాయకులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేశం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారన్నారు. యాజమాన్యాల సర్టిఫికెట్లను తీసుకోలేని పరిస్థితిలో విద్యార్థులు ఉన్నారని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్లో ఉన్న 1500 కోట్ల రూపాయలు వెంటనే వీడియోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారి డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, రాజు యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు బాబ్లు, బిజెపి బీజేవైఎం నాయకులు సన్నీ, సాయి, సాయి బాబా, ప్రవీణ్, నర్సింగ్, నవీన్, సాయి జగదీష్ సాయి కిరణ్, తదితరులు పాల్గొన్నారు1