ఉల్లాసంగా, ఉత్సాహంగా కలెక్టరేట్ లో ముగ్గుల పోటీలు . కలెక్టరేట్ కు సంక్రాంతి శోభ . ముగ్గుల పోటీలు - పతంగులాటలు . ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ సతీమణి... డాక్టర్: సాయి రాధా మనోహర్ సంక్రాంతికి ముందు నాలుగు రోజుల ముందే మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సంక్రాంతి శోభను సంతరించుకుంది. శుక్రవారం ఇక్కడ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా ఉద్యోగులకు సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించింది. దీనితో, మహిళా ఉద్యోగులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలకు జిల్లా కలెక్టర్ మను చౌదరి సతీమణి డాక్టర్: సాయి రాధా మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటీలను ప్రారంభించారు. పాఠంగులు ఎగురవేసి ఉద్యోగులతో పాటు సంతోషాన్ని పంచుకున్నారు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ముగ్గుల పోటీలలో విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్: సాయి రాధా మనోహర్ మాట్లాడుతూ, ఇక్కడ మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషకరం అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి బింబించేలా నిర్వహించిన ఈ పోటీలలో మహిళా ఉద్యోగులు పాల్గొనడం సంతోషకరమని అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీ.ఆర్.వో హరిప్రియ, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ జి. వినోద్ కుమార్, డీ.ఈ.ఓ విజయ కుమారి, బీ.సీ వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీ రాణి, లా ఆఫీసర్ చంద్రావతి, డీ.ఆర్.డీ.వో సాంబశివరావు, టీజీవోస్ జిలా జనరల్ సెక్రెటరీ కురుమూర్తి, జాయింట్ సెక్రెటరీ ఆనంద్ లు పాల్గొన్నారు.
ఉల్లాసంగా, ఉత్సాహంగా కలెక్టరేట్ లో ముగ్గుల పోటీలు . కలెక్టరేట్ కు సంక్రాంతి శోభ . ముగ్గుల పోటీలు - పతంగులాటలు . ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ సతీమణి... డాక్టర్: సాయి రాధా మనోహర్ సంక్రాంతికి ముందు నాలుగు రోజుల ముందే మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సంక్రాంతి శోభను సంతరించుకుంది. శుక్రవారం ఇక్కడ
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా ఉద్యోగులకు సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించింది. దీనితో, మహిళా ఉద్యోగులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీలకు జిల్లా కలెక్టర్ మను చౌదరి సతీమణి డాక్టర్: సాయి రాధా మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటీలను ప్రారంభించారు.
పాఠంగులు ఎగురవేసి ఉద్యోగులతో పాటు సంతోషాన్ని పంచుకున్నారు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించి ముగ్గుల పోటీలలో విజేతలను ఎంపిక చేశారు. విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్: సాయి రాధా మనోహర్ మాట్లాడుతూ, ఇక్కడ మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషకరం అన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి బింబించేలా నిర్వహించిన ఈ పోటీలలో
మహిళా ఉద్యోగులు పాల్గొనడం సంతోషకరమని అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీ.ఆర్.వో హరిప్రియ, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ జి. వినోద్ కుమార్, డీ.ఈ.ఓ విజయ కుమారి, బీ.సీ వెల్ఫేర్ ఆఫీసర్ ఝాన్సీ రాణి, లా ఆఫీసర్ చంద్రావతి, డీ.ఆర్.డీ.వో సాంబశివరావు, టీజీవోస్ జిలా జనరల్ సెక్రెటరీ కురుమూర్తి, జాయింట్ సెక్రెటరీ ఆనంద్ లు పాల్గొన్నారు.
- 👉గజ్వేల్ జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్ మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ అమ్మ బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్ టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను సమ్మక్క సారలమ్మ జాతరను ఆహ్వానించిన మంత్రులు సీతక్క కొండా సురేఖ తెలంగాణ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతను గజ్వేల్ ఎర్రవెల్లిలోని తననివాసానికి వచ్చిన మహిళా మంత్రులను బీఆర్ఎ ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతించారు. తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ప్రసాదాన్ని అందించి, రాష్ట్ర ప్రభుత్వ తరపున జాతరకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో మంత్రులను సత్కరించారు. తేనీటి విందు అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నప్పుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.1
- VBG- RAMG కొత్త చట్టం ద్వారా తెలంగాణకు ఎంతో మేలు: సంగారెడ్డి లో మీడియాతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి1
- నల్లగొండ బ్రేకింగ్: నల్గొండ జిల్లాలో ఉన్న రైల్వే ఆగిన బస్సులే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ కి చెందిన థార్ గ్యాంగ్ ను నల్గొండ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఆదమరిస్తే అరనిమిషంలో గాయబ్! చేసే థార్ గ్యాంగ్! హైవేలపై బస్సులే టార్గెట్.! ధాబాల వద్ద ఆగి ఉన్న బస్సులో ప్రయాణికుల బంగారం మాయం.. గత నెల చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సు లో భారీ మొత్తం లో బంగారు ఆభరణాల చోరీ సంచలనం... కేసు ను సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.. 15 రోజుల హైటెన్షన్ ఖాకి సినిమా రేంజ్ లో నల్లగొండ పోలీస్ ఆపరేషన్.. మధ్యప్రదేశ్ థార్ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర “థార్ గ్యాంగ్” దొంగ నల్గొండ జిల్లా పోలీసుల వలలో చిక్కాడు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీసీఎస్ బృందాల సైలెంట్ ట్రాక్... చివరికి ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద ముఠా సభ్యుడు (దొంగ) షా అల్లా రఖా పట్టివేత.. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం... ముఠాలో ఐదుగురు… ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పాత నేర చరిత్ర... హోటళ్ల వద్ద ఆగిన బస్సులే టార్గెట్.. క్షణాల్లో చేతివాటం పరారీలో ఉన్న మిగతా నేరస్తుల కోసం వేట కొనసాగింపు... ఇట్టి ముఠా సభ్యులను సిసిఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన, చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ,సి.సి.ఎస్ ఎస్ఐ శివ కుమార్, మరియు సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుల్స్ వెంకటేష్, సాయికుమార్ , జూనేద్ , శివరాజు, మహేశ్, కమల్ కిశోర్. చిన్న బాబు మరియు ఇతర సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎప్.పి ప్రత్యేకంగా అభినందించి రివార్డును ప్రకటించారు.1
- మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ మండల కేంద్రంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గత వారం రోజులుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున హరి, శివ నామ సంకీర్తనతో గ్రామ పురవీధులలో భజన పాటలు ఆలకిస్తూ నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో శివదిక్షాపరులు గ్రామ ప్రజలు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.1
- ములుగు జిల్లా మల్లంపల్లి జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. సమ్మక్క–సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.1
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ, వివేకానంద జయంతి సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొడిమ్యాలలోని వివిధ పాఠశాలల విద్యార్థులు అందంగా, సంక్రాంతి పండుగ ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు జనవరి 12న జరిగే వివేకానంద జయంతి రోజున ప్రధమ, ద్వితీయ ,తృతీయ బహుమతులను పాల్గొన్న వారి అందరికీ కన్సోలేసన్ బహుమతులు అందజేస్తామని వివేకానంద సేవా సమితి సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు ఏనుగు ఆదిరెడ్డి, ముగ్గుల పోటీ న్యాయ నిర్నేతలుగా మహిళా సంఘం అధ్యక్షులు సంద పద్మ, అంగన్వాడి టీచర్ బోయిని సుజాత, వివేకానంద సేవ సమితి అధ్యక్షులు కంచర్ల గంగాచారి ,సభ్యులు మంచాల శ్రీనివాస్, నాంపల్లి రామచంద్రం, బొమ్మ సురేష్, గ్రామస్తులు, యువకులు, మహిళలు ,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.2
- సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న అధికారులు1
- నకిరేకల్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు తాను అహర్నిశలు పనిచేస్తారని కార్యకర్తల శ్రేయస్సును మరువనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం రాత్రి నార్కెట్పల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు అండగా ఉండడంతో పాటు అవసరమైన సమయంలో ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- వరంగల్ నగరంలో చిన్న పిల్లల కిడ్నాపింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఐదుగురు చిన్నారులతో పాటు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను సీపీ అభినందించారు.1