అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు.... సీఎం చంద్రబాబు నాయుడు ఆహార భద్రత కోసమే ప్రజా ప్రభుత్వం కృషి గతంలో అన్నదానాన్ని అడ్డుకున్న గొడ్డలి పార్టీ. ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 62 క్యాంటీన్ల ప్రారంభం. రాష్ట్రంలో 269కి చేరిన అన్న క్యాంటీన్లు అమరావతి పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పలనాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ధరణికోటలో ఏర్పాటు చేసిన రూరల్ అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం రూ.5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతకముందు క్యాంటీన్‌కు వచ్చిన పేదలు, కార్మికులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. లబ్దిదారులతో ముచ్చటిస్తూ అన్న క్యాంటీన్‌లోనే సీఎం ఆహారాన్ని తీసుకున్నారు. అన్న క్యాంటీన్లలో అందిస్తున్న భోజనం రుచి, శుభ్రత, నాణ్యతల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ... "కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి నేను నమ్ముతాను. అందుకే పేదవాడి ఆకలికి తీర్చడానికి ప్రజాప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెచ్చింది. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే నా రాజకీయం అని ఎన్టీఆర్ రూ.2 లకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత పథకానికి నాంది పలికారు. నిత్యాన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు అజరామరం. ఆకలి అన్న వాళ్ల కాదనకుండా అన్నం పెట్టడం మన సంస్కృతిలోనే ఉంది. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతంలోనే ఉంది. నాటి రెండు రూపాయల కిలో బియ్యం నుంచి నేటి అన్నా క్యాంటీన్ల వరకు ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 2024లో అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. ఇవాల్టి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్నక్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పట్టణాల్లో 204, గ్రామాల్లో 65 కలిపి ఈ సంఖ్య 269కి పెరిగింది. త్వరలో మరో 5 క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయని" సీఎం స్పష్టం చేశారు. అక్షయ పాత్రకు అభినందనలు "అన్న క్యాంటీన్లకు నిరంతరం ఆహార సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ను అభినందిస్తున్నాను. 25 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ 500 కోట్ల భోజనాలను సరఫరా చేసింది. అన్న క్యాంటీన్లలో రూ.5కే అందిస్తున్న భోజనం పేద వాళ్లు, ఆటోడ్రైవర్లు, ముఠా కార్మికులు, కూలీలకు ఆసరాగా నిలుస్తోంది. పేదవాళ్లకు వచ్చే కొద్దిపాటి డబ్బులతో బయట హోటల్‌లో తినడం ఆర్ధికంగా ఎంత భారమో నాకు తెలుసు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో వారి డబ్బు ఆదా అయ్యి ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. అన్నక్యాంటీన్లలో సరఫరా చేసే భోజనానికి రుచి, శుభ్రత, నాణ్యతకే ప్రధమ ప్రాధాన్యం. ఉదయం అల్పాహారం, మద్యాహ్నం, రాత్రి భోజనాలతో మూడు పూటలా ఆకలి తీర్చుకునే అవకాశం కల్పించాం. ఒక్కో అన్నా క్యాంటీన్‌లో రోజుకు సగటున 1,013 మంది ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీని నిర్వహణ కోసం రూ.26,250 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. దీనికోసం రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతోంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన 62 గ్రామీణ అన్న కాంటీన్లలో ఆహార సబ్సిడీకి రోజుకు మరో రూ.18 లక్షలు, ఏడాదికి రూ.58 కోట్లు అవుతుంది. కొత్త క్యాంటీన్ల నిర్మాణానికి రూ.43 కోట్ల వ్యయం అయ్యింది. గడచిన 21 నెలల్లో అన్నక్యాంటీన్లలో 8.80 కోట్ల భోజనాలు చేశారు. ఇప్పటి వరకూ అన్నక్యాంటీన్ సబ్సిడీ కోసం రూ.243 కోట్ల మేర ఖర్చు చేశాం" అని ముఖ్యమంత్రి అన్నారు. పేదల పొట్టగొట్టిన గత పాలకులు "గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్న క్యాంటీన్లపైనా దాడులు చేశారు. పేదల కడుపు నింపుతున్న పథకాన్ని నిలిపివేశారు. వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా అన్నదానం చేస్తుంటే దానిలో మట్టి పోసి, దాడులు చేసి అడ్డుకున్నారు. వైసీపీకి కావాల్సింది విధ్వంసం, హింస, కూల్చడం, నరకడం, నాశనం చేయడమే. ఏ రాజకీయపార్టీ అయినా ప్రజలకు ఏం చేస్తామో చెబుతుంది. కానీ వైసీపీ మాత్రం రప్పా రప్పా చేస్తాం, 2029లో విధ్వంసం చూపిస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అందుకే ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీగా మార్చుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత ఆ పార్టీకి లేదు అని "ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రవీణ్, కలెక్టర్ కృతికా శుక్లా, తదితరులు పాల్గొన్నారు.
అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు.... సీఎం చంద్రబాబు నాయుడు ఆహార భద్రత కోసమే ప్రజా ప్రభుత్వం కృషి గతంలో అన్నదానాన్ని అడ్డుకున్న గొడ్డలి పార్టీ. ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 62 క్యాంటీన్ల ప్రారంభం. రాష్ట్రంలో 269కి చేరిన అన్న క్యాంటీన్లు అమరావతి పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పలనాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ధరణికోటలో ఏర్పాటు చేసిన రూరల్ అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం రూ.5 వెచ్చించి టోకెన్ కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి కార్మికులతో కలిసి భోజనం చేశారు. అంతకముందు క్యాంటీన్‌కు వచ్చిన పేదలు, కార్మికులకు ఆయన స్వయంగా భోజనం వడ్డించారు. లబ్దిదారులతో ముచ్చటిస్తూ అన్న క్యాంటీన్‌లోనే సీఎం ఆహారాన్ని తీసుకున్నారు. అన్న క్యాంటీన్లలో అందిస్తున్న భోజనం రుచి, శుభ్రత, నాణ్యతల గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ... "కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి నేను నమ్ముతాను. అందుకే పేదవాడి ఆకలికి తీర్చడానికి ప్రజాప్రభుత్వం అన్న క్యాంటీన్లు తెచ్చింది. పేదవాడికి పట్టెడన్నం పెట్టడమే నా రాజకీయం అని ఎన్టీఆర్ రూ.2 లకే కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత పథకానికి నాంది పలికారు. నిత్యాన్నదాతగా డొక్కా సీతమ్మ పేరు
అజరామరం. ఆకలి అన్న వాళ్ల కాదనకుండా అన్నం పెట్టడం మన సంస్కృతిలోనే ఉంది. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ సిద్దాంతంలోనే ఉంది. నాటి రెండు రూపాయల కిలో బియ్యం నుంచి నేటి అన్నా క్యాంటీన్ల వరకు ఆహార భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. 2024లో అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశాం. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అన్నక్యాంటీన్లు ప్రారంభించాం. ఇవాల్టి నుంచే గ్రామీణ ప్రాంతాల్లో 62 అన్నక్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పట్టణాల్లో 204, గ్రామాల్లో 65 కలిపి ఈ సంఖ్య 269కి పెరిగింది. త్వరలో మరో 5 క్యాంటీన్లు సిద్ధం అవుతున్నాయని" సీఎం స్పష్టం చేశారు. అక్షయ పాత్రకు అభినందనలు "అన్న క్యాంటీన్లకు నిరంతరం ఆహార సరఫరా చేస్తున్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ను అభినందిస్తున్నాను. 25 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ 500 కోట్ల భోజనాలను సరఫరా చేసింది. అన్న క్యాంటీన్లలో రూ.5కే అందిస్తున్న భోజనం పేద వాళ్లు, ఆటోడ్రైవర్లు, ముఠా కార్మికులు, కూలీలకు ఆసరాగా నిలుస్తోంది. పేదవాళ్లకు వచ్చే కొద్దిపాటి డబ్బులతో బయట హోటల్‌లో తినడం ఆర్ధికంగా ఎంత భారమో నాకు తెలుసు. అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో వారి డబ్బు ఆదా అయ్యి ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది. అన్నక్యాంటీన్లలో సరఫరా చేసే భోజనానికి రుచి, శుభ్రత, నాణ్యతకే ప్రధమ ప్రాధాన్యం. ఉదయం అల్పాహారం, మద్యాహ్నం, రాత్రి భోజనాలతో మూడు పూటలా ఆకలి తీర్చుకునే అవకాశం కల్పించాం. ఒక్కో అన్నా క్యాంటీన్‌లో రోజుకు సగటున 1,013 మంది ఆహారాన్ని తీసుకుంటున్నారు. దీని నిర్వహణ
కోసం రూ.26,250 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. దీనికోసం రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతోంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన 62 గ్రామీణ అన్న కాంటీన్లలో ఆహార సబ్సిడీకి రోజుకు మరో రూ.18 లక్షలు, ఏడాదికి రూ.58 కోట్లు అవుతుంది. కొత్త క్యాంటీన్ల నిర్మాణానికి రూ.43 కోట్ల వ్యయం అయ్యింది. గడచిన 21 నెలల్లో అన్నక్యాంటీన్లలో 8.80 కోట్ల భోజనాలు చేశారు. ఇప్పటి వరకూ అన్నక్యాంటీన్ సబ్సిడీ కోసం రూ.243 కోట్ల మేర ఖర్చు చేశాం" అని ముఖ్యమంత్రి అన్నారు. పేదల పొట్టగొట్టిన గత పాలకులు "గత పాలకులు ఆకలి తీర్చే అన్నపూర్ణ వంటి అన్న క్యాంటీన్లపైనా దాడులు చేశారు. పేదల కడుపు నింపుతున్న పథకాన్ని నిలిపివేశారు. వ్యక్తులు, సంస్థలు స్వచ్ఛందంగా అన్నదానం చేస్తుంటే దానిలో మట్టి పోసి, దాడులు చేసి అడ్డుకున్నారు. వైసీపీకి కావాల్సింది విధ్వంసం, హింస, కూల్చడం, నరకడం, నాశనం చేయడమే. ఏ రాజకీయపార్టీ అయినా ప్రజలకు ఏం చేస్తామో చెబుతుంది. కానీ వైసీపీ మాత్రం రప్పా రప్పా చేస్తాం, 2029లో విధ్వంసం చూపిస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అందుకే ఆ పార్టీ పేరు గొడ్డలి పార్టీగా మార్చుకోవాలి. ఒక రాజకీయ పార్టీగా ఉండే అర్హత ఆ పార్టీకి లేదు అని "ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ప్రవీణ్, కలెక్టర్ కృతికా శుక్లా, తదితరులు పాల్గొన్నారు.
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- Post by Veesachandu1
- Post by దాసరి ప్రేమ్1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1
- Post by V Ramarao3
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా పంచాయతీల్లో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని, వారిని ఇబ్బందులకు గురిచేయకూడదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం కాటారం మండలం ధన్వాడలోని తన స్వగృహంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించారు.1