నేత్రదానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్రదాత లక్ష్మీదేవి ధర్మవరం: శాంతినగర్‌కు చెందిన కోప్పల లక్ష్మీదేవి(80) మృతి అనంతరం ఆమె కుటుంబ సభ్యులు చేసిన నేత్రదానం అభినందనీయమని యువర్స్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. లక్ష్మీదేవి మృతి చెందిన విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు ఆమె కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. నేత్రదానం ద్వారా మరణించిన వ్యక్తి కళ్ల కార్నియాలతో ఇద్దరికి చూపు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. కుటుంబ సభ్యులు అంగీకరించడంతో అనంతపురంలోని ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రసాద్ కంటి కార్నియాలను సేకరించారు. నేత్రదానానికి అంగీకరించి సహకరించిన లక్ష్మీదేవి కుమారుడు కొప్పుల నాగేంద్రకు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ పోలా ప్రభాకర్ మాట్లాడుతూ,నేత్రదానం ద్వారా మరణించిన తర్వాత కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. ప్రజలు నేత్రదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
నేత్రదానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్రదాత లక్ష్మీదేవి ధర్మవరం: శాంతినగర్‌కు చెందిన కోప్పల లక్ష్మీదేవి(80) మృతి అనంతరం ఆమె కుటుంబ సభ్యులు చేసిన నేత్రదానం అభినందనీయమని యువర్స్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. లక్ష్మీదేవి మృతి చెందిన విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు ఆమె కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. నేత్రదానం ద్వారా మరణించిన వ్యక్తి కళ్ల కార్నియాలతో ఇద్దరికి చూపు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. కుటుంబ
సభ్యులు అంగీకరించడంతో అనంతపురంలోని ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి టెక్నీషియన్ ప్రసాద్ కంటి కార్నియాలను సేకరించారు. నేత్రదానానికి అంగీకరించి సహకరించిన లక్ష్మీదేవి కుమారుడు కొప్పుల నాగేంద్రకు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ పాస్ట్ ప్రెసిడెంట్ పోలా ప్రభాకర్ మాట్లాడుతూ,నేత్రదానం ద్వారా మరణించిన తర్వాత కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. ప్రజలు నేత్రదానంపై అవగాహన పెంచుకుని ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో యువర్స్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
- గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.1
- పుంగనూరులో ఘనంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు..అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహణ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మదీయులు పట్టణ పురవీధుల్లో జులూస్ ర్యాలీ నిర్వహించారు. కుమ్మర వీధి మక్కాన్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. రాతి మసీదు వీధి, నాగపాళ్యం ముడెప్ప సర్కిల్,గోకుల్ సర్కిల్, ఎంపీటీ రోడ్, తూర్పు మొగసాల మీదుగా తిరిగి కుమ్మర వీధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహమ్మదీయ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు రాతి మసీదు వద్ద ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముస్లిం సోదరులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సోదరభావం,శాంతి,ఐక్యతను చాటుతూ పుంగనూరులో ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా ముగిశాయి.4
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- జాతి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం పుంగనూరు పట్టణంలో సున్ని అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో రాతి మసీదులో మహమ్మద్ ప్రవక్త పేరు మీద ప్రత్యేక ప్రార్థనలు, చదివింపులు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త సూచనలు మత పెద్దలు వివరించారు.1
- అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.1
- నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- *మధ్యప్రదేశ్:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు...1
- పరిమళించిన తల్లి హృదయం. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో వింత ఘటన చోటు చేసుకుంటుంది. ఆకలితో ఉన్న ఒక పంది పిల్ల ఓ గోమాత చెంతకు చేరి పాలు తాగుతూ ఆకలి తీర్చుకున్న వింత ఘటన చోటుచేసుకున్నది. ఆకలితో ఉన్న ఆ పందిపిల్ల పాలు తాగుతున్నా ఆ గోమాత ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా పంది పిల్ల ఆకలి తీర్చింది... అందుకే అంటారు కాబోలు తల్లి ఎక్కడైనా ఎవరైనా తల్లే..... వెల్దుర్తిలో పోలీస్‌స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్డుపై ఘటన1
- ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥ జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.2