logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అయితే రెండు సంవత్సరాల కాలంలో ప్రజల నమ్మకాన్ని, ఆశలను పూర్తిగా వమ్ము చేసిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడంలో ఈ ప్రభుత్వ నాయకులకు ఎవరూ సాటిలేరని విమర్శించారు. ప్రజలు ఆశించిన పాలన కాకుండా, ప్రచారాలు, ఆర్భాటాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని, అన్నదాతల ఆక్రందనలు వినే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను రోడ్డుకు లాగారని, ఇచ్చిన ఒక్క డీఎస్సీలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని, పేదలకు సంక్షేమం అందిస్తామని చెప్పి సంక్షేమ పథకాలకు కోతలు విధించిందని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం అన్ని సంక్షేమ పథకాలను మాఫీ చేశారని, రెండో సంవత్సరం ఇచ్చిన పథకాల్లో కూడా కోతలు పెట్టారని తెలిపారు. 'సూపర్ సిక్స్' పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆ హామీల గురించి మాట్లాడటానికే వెనుకాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఎక్కడ, ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. రైతులకి గతంలో కంటే ఎక్కువ మేలు జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ఇచ్చిన వాటి దగ్గరే ఫోటోలు తీసుకుంటూ పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసిన ఈ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన, ఇంటింటికీ తీసుకెళ్తామని, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదల గొంతుకగా పోరాడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి కంటే అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్షసాధింపు రాజకీయాలకు దిగుతోందని విమర్శించారు. ప్రజలు తాగునీరు, సాగునీరు, ఉపాధి, విద్య, వైద్యం కోసం ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం ప్రచారాలు, ఆర్భాటాలతో ప్రజలకు అన్నీ చేసేశామనే భ్రమను కల్పిస్తోందని అన్నారు. ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదని, ప్రచారం కోసం పనిచేసే ప్రభుత్వమని, హామీల ప్రభుత్వం కాదని, మోసాల ప్రభుత్వమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని ఈ ప్రభుత్వం తన వైఫల్యాలను దాచుకోవడానికి ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అబద్ధాల ప్రచారంతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని హెచ్చరించారు. చంద్రబాబు పాలన అభివృద్ధి పేరుతో ప్రచారం, హామీల పేరుతో మోసం, ప్రజల నమ్మకానికి వెన్నుపోటు పొడిచే పరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, అధికారంలో చేసిన పనులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన ప్రతి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో తీర్పు చెబుతారని హెచ్చరించారు. అన్ని వర్గాల వారికి శఠగోపం పెట్టిన కూటమి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎన్నిక ఏదైనా కూటమికి తిలోదాకాల తర్పణం విడవడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.

4 days ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
4 days ago

బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమంలో భాగంగా రేపల్లె నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అబద్ధపు హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అయితే రెండు సంవత్సరాల కాలంలో ప్రజల నమ్మకాన్ని, ఆశలను పూర్తిగా వమ్ము చేసిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెప్పడంలో ఈ ప్రభుత్వ నాయకులకు ఎవరూ సాటిలేరని విమర్శించారు. ప్రజలు ఆశించిన పాలన కాకుండా, ప్రచారాలు, ఆర్భాటాలతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని, అన్నదాతల ఆక్రందనలు వినే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను రోడ్డుకు లాగారని, ఇచ్చిన ఒక్క డీఎస్సీలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని, పేదలకు సంక్షేమం అందిస్తామని చెప్పి సంక్షేమ పథకాలకు కోతలు విధించిందని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం అన్ని సంక్షేమ పథకాలను మాఫీ చేశారని, రెండో సంవత్సరం ఇచ్చిన పథకాల్లో కూడా కోతలు పెట్టారని తెలిపారు. 'సూపర్ సిక్స్' పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆ హామీల గురించి మాట్లాడటానికే వెనుకాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఎక్కడ, ఎప్పుడు

ఇచ్చిందో చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. రైతులకి గతంలో కంటే ఎక్కువ మేలు జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, ఇచ్చిన వాటి దగ్గరే ఫోటోలు తీసుకుంటూ పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసిన ఈ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ గ్రామాన, ఇంటింటికీ తీసుకెళ్తామని, రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదల గొంతుకగా పోరాడతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని పేర్కొన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో అభివృద్ధి కంటే అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్షసాధింపు రాజకీయాలకు దిగుతోందని విమర్శించారు. ప్రజలు తాగునీరు, సాగునీరు, ఉపాధి, విద్య, వైద్యం కోసం ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం మాత్రం ప్రచారాలు, ఆర్భాటాలతో ప్రజలకు అన్నీ చేసేశామనే భ్రమను కల్పిస్తోందని అన్నారు. ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాదని, ప్రచారం కోసం పనిచేసే ప్రభుత్వమని, హామీల ప్రభుత్వం కాదని, మోసాల ప్రభుత్వమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసానికి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వమని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని ఈ ప్రభుత్వం తన వైఫల్యాలను దాచుకోవడానికి ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అబద్ధాల ప్రచారంతో ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని హెచ్చరించారు. చంద్రబాబు పాలన అభివృద్ధి పేరుతో ప్రచారం, హామీల పేరుతో మోసం, ప్రజల నమ్మకానికి వెన్నుపోటు పొడిచే పరిపాలనకు నిదర్శనమని అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలకు, అధికారంలో చేసిన పనులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసిన ప్రతి ప్రభుత్వానికి ప్రజలే తగిన సమయంలో తీర్పు చెబుతారని హెచ్చరించారు. అన్ని వర్గాల వారికి శఠగోపం పెట్టిన కూటమి పాలనకు రోజులు దగ్గర పడ్డాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎన్నిక ఏదైనా కూటమికి తిలోదాకాల తర్పణం విడవడం ఖాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక పల్లె ప్రకృతి వనం సమీపంలో మంగళవారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన తనిఖీలలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఒడిశా రాష్ట్రం నుండి ములుగు జిల్లాలోని మంగపేట మండలానికి బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌పై గంజాయిని తరలిస్తున్న బడే భరత్ (20 సంవత్సరాలు) మరియు ఉప్పరపల్లి వెంకటేష్ (26 సంవత్సరాలు)ను బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ ములుగు జిల్లా, మంగపేట మండలానికి చెందినవారే. పట్టుబడిన నిందితుల వద్ద నుండి సుమారు రూ.1,05,000 విలువైన 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు, బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ మరియు రెండు మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక పల్లె ప్రకృతి వనం సమీపంలో మంగళవారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన తనిఖీలలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఒడిశా రాష్ట్రం నుండి ములుగు జిల్లాలోని మంగపేట మండలానికి బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్‌పై గంజాయిని తరలిస్తున్న బడే భరత్ (20 సంవత్సరాలు) మరియు ఉప్పరపల్లి వెంకటేష్ (26 సంవత్సరాలు)ను బూర్గంపాడు ఎస్సై ప్రసాద్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ ములుగు జిల్లా, మంగపేట మండలానికి చెందినవారే.

పట్టుబడిన నిందితుల వద్ద నుండి సుమారు రూ.1,05,000 విలువైన 2.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు, బజాజ్ పల్సర్ మోటార్‌సైకిల్ మరియు రెండు మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
  • పోలీసులు ఒక వినూత్న చర్యలో బొమ్మల్లో మాంసం ముద్దలను ఉంచి, ఆపై ఒక కంచెను ఏర్పాటు చేశారు.
    2
    పోలీసులు ఒక వినూత్న చర్యలో బొమ్మల్లో మాంసం ముద్దలను ఉంచి, ఆపై ఒక కంచెను ఏర్పాటు చేశారు.
    user_Pavan Bhaskaruni
    Pavan Bhaskaruni
    భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    17 hrs ago
  • పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై మంగళవారం ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది జగన్ మోహన్ రెడ్డియేనని ఆయన ఆరోపించారు, అందుకే ప్రజలు ఎన్నికల్లో 163 స్థానాల్లో వైసీపీకి కోలుకోలేని విధంగా కత్తిపోటు పొడిచి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నాయకులు కళ్లు మూసుకున్నారా అని వర్మ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చి దమ్ము చాటుకుందని ఆయన వివరించారు. ఇటీవల పిఠాపురంలో వైసీపీ నాయకులు చేసిన బైక్ ర్యాలీ సజావుగా సాగడానికి కూటమి ప్రభుత్వం వేసిన నాణ్యమైన రోడ్లే కారణమని వర్మ ఎద్దేవా చేశారు. గత వైసీపీ హయాంలో గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకునే వారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ప్రజల పొట్ట కొడితే, తాము 'అన్న క్యాంటీన్ల' ద్వారా ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. వైసీపీలా కాకుండా, కూటమి ప్రభుత్వంలో 'తల్లికి వందనం' పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, 2029లో కూటమి మళ్లీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని, అప్పుడు వైసీపీకి ఈ 11 సీట్లు కూడా దక్కవని వర్మ హెచ్చరించారు.
    1
    పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై మంగళవారం ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది జగన్ మోహన్ రెడ్డియేనని ఆయన ఆరోపించారు, అందుకే ప్రజలు ఎన్నికల్లో 163 స్థానాల్లో వైసీపీకి కోలుకోలేని విధంగా కత్తిపోటు పొడిచి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నాయకులు కళ్లు మూసుకున్నారా అని వర్మ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చి దమ్ము చాటుకుందని ఆయన వివరించారు. ఇటీవల పిఠాపురంలో వైసీపీ నాయకులు చేసిన బైక్ ర్యాలీ సజావుగా సాగడానికి కూటమి ప్రభుత్వం వేసిన నాణ్యమైన రోడ్లే కారణమని వర్మ ఎద్దేవా చేశారు. గత వైసీపీ హయాంలో గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకునే వారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ప్రజల పొట్ట కొడితే, తాము 'అన్న క్యాంటీన్ల' ద్వారా ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. వైసీపీలా కాకుండా, కూటమి ప్రభుత్వంలో 'తల్లికి వందనం' పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు.

మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, 2029లో కూటమి మళ్లీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని, అప్పుడు వైసీపీకి ఈ 11 సీట్లు కూడా దక్కవని వర్మ హెచ్చరించారు.
    user_MANIKANTA SUVARNAM
    MANIKANTA SUVARNAM
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానం, ఇది నిత్యం వాకర్లు మరియు క్రీడాకారులతో సందడిగా ఉండే ప్రాంతం, ప్రస్తుతం పశువులకు ఆవాసంగా మారింది. పశువుల పెంపకం దారులు తమ జంతువులను ఇష్టారాజ్యంగా వదిలివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. మైదానం అంతా పేడతో నిండిపోయి, దుర్వాసన వెదజల్లుతోందని వాకర్లు మరియు సీనియర్ సిటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, కళాశాల ఆవరణలోకి పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    1
    నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానం, ఇది నిత్యం వాకర్లు మరియు క్రీడాకారులతో సందడిగా ఉండే ప్రాంతం, ప్రస్తుతం పశువులకు ఆవాసంగా మారింది. పశువుల పెంపకం దారులు తమ జంతువులను ఇష్టారాజ్యంగా వదిలివేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.

మైదానం అంతా పేడతో నిండిపోయి, దుర్వాసన వెదజల్లుతోందని వాకర్లు మరియు సీనియర్ సిటిజన్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, కళాశాల ఆవరణలోకి పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    జర్నలిస్ట్ Nalgonda, Telangana•
    1 hr ago
  • సిరిసిల్ల ఎమ్మెల్యే చేసిన ప్రకటన ప్రకారం, తాను ఐదు సార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచినా, ఓటు కోసం ఎన్నడూ రూపాయి నోటు ఇవ్వలేదని, అలాగే మందు కూడా పంచలేదని తెలిపారు. ఇది తన గొప్పతనం కాదని, తమ సిరిసిల్ల ప్రజలకు తనపై ఉన్న నమ్మకం, వారితో తనకున్న అనుబంధం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.
    1
    సిరిసిల్ల ఎమ్మెల్యే చేసిన ప్రకటన ప్రకారం, తాను ఐదు సార్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచినా, ఓటు కోసం ఎన్నడూ రూపాయి నోటు ఇవ్వలేదని, అలాగే మందు కూడా పంచలేదని తెలిపారు. ఇది తన గొప్పతనం కాదని, తమ సిరిసిల్ల ప్రజలకు తనపై ఉన్న నమ్మకం, వారితో తనకున్న అనుబంధం వల్లనే ఇది సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
  • తెలుగు ఉపాధ్యాయుడు మరియు సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని కొత్త, పాత బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఒక వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో, డ్రగ్స్, గంజాయి, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్పరిణామాలు, అలాగే రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత మత్తు మహమ్మారికి బానిస కాకుండా ఉండేందుకు ఆయన గత కొన్ని రోజులుగా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
    1
    తెలుగు ఉపాధ్యాయుడు మరియు సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని కొత్త, పాత బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఒక వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో, డ్రగ్స్, గంజాయి, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే దుష్పరిణామాలు, అలాగే రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువత మత్తు మహమ్మారికి బానిస కాకుండా ఉండేందుకు ఆయన గత కొన్ని రోజులుగా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, రాంచందర్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ 'అపరిచితుడు'లోని డ్రామాచారి వేషం వేసి అందరిని భయపెట్టినట్టుగా, రాంచందర్ రావు కూడా భయపెట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను ఏమీ అననప్పటికీ తమను బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి 'డ్రామాచారి వేషంతో భయపెడుతున్నారు' అంటూ చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి.
    1
    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు, రాంచందర్ రావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛత్రపతి సినిమాలో వేణుమాధవ్ 'అపరిచితుడు'లోని డ్రామాచారి వేషం వేసి అందరిని భయపెట్టినట్టుగా, రాంచందర్ రావు కూడా భయపెట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.

తాను ఏమీ అననప్పటికీ తమను బెదిరిస్తున్నారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ రెడ్డి 'డ్రామాచారి వేషంతో భయపెడుతున్నారు' అంటూ చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    14 hrs ago
  • దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు మరోసారి రోడ్లపైకి వచ్చి పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపారు. కేవలం 5 వేల పోస్టులు కాకుండా, 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. డప్పు చప్పుళ్లతో ఆందోళన చేపట్టిన నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
    1
    దిల్‌సుఖ్‌నగర్‌లో నిరుద్యోగులు మరోసారి రోడ్లపైకి వచ్చి పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపారు. కేవలం 5 వేల పోస్టులు కాకుండా, 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. డప్పు చప్పుళ్లతో ఆందోళన చేపట్టిన నిరుద్యోగులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.