logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*29న అమీన్‌పూర్‌లో భారీ నిరసన..* *22ఎ జాబితా నుంచి భూములను తొలగించాలి: తుమ్మల పాండురంగారెడ్డి* *22ఎ జాబితాతో నిలిచిన భూముల క్రయవిక్రయాలు* *600 ఎకరాల భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి* *హెచ్‌ఎండిఎ లేఅవుట్ల భూములపైనా 22ఎ ప్రభావం* *పెళ్లిళ్లు, అత్యవసర అవసరాలకు ఆస్తులు అమ్ముకోలేని పరిస్థితి* *21 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్లు.. ఇప్పుడు నిషేధిత జాబితాలోనా?* *నవ్యనగర్ చౌరస్తాలో 29న భారీ నిరసన, హాజరు కానున్న 15 వేల మంది* *ప్రతి కాలనీ నుంచి ప్రజలు స్వచ్చందంగా  తరలిరావాలి* *రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేపడతాం* *అధికారులు రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలి* *22ఏ ఎత్తివేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష* *ఎంఆర్‌ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి హెచ్చరిక* *భూ హక్కుదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం* అమీన్‌పూర్ పరిధిలో 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి, అర్హులైన భూ హక్కుదారులకు న్యాయం చేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 22ఎ జాబితా కారణంగా భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్‌పూర్‌లోని హెచ్‌ఎండిఎ లేఅవుట్లు, ఇంద్రక్రిశాట్ కాలనీ, మోడీ బిల్డర్స్, చక్రపురికాలని లకు సంబంధించిన భూములు సైతం 22ఎ జాబితాలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అమీన్‌పూర్ పరిధిలో సుమారు 600 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుస్తోందని, ఏ ప్రాతిపదికన ఈ భూములను జాబితాలో చేర్చారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 22ఎ జాబితా వల్ల అత్యవసర అవసరాల కోసం సొంత భూములు, ఇళ్లను విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందని పాండురంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు, ఇతర కుటుంబ అవసరాల కోసం ఆస్తులు విక్రయించాలన్నా రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బ్యాంకులు రుణాలు ఇచ్చి, గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని విమర్శించారు. 22ఎ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 29న అమీన్‌పూర్‌లోని నవ్యనగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పాండురంగారెడ్డి తెలిపారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కార్యక్రమానికి హాజరుకానున్నట్లు చెప్పారు. ప్రతి కాలనీ నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 22ఎ నిబంధనను ఎత్తివేయాలని, అర్హులైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఎంఆర్‌ఓ, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. పిఎస్‌ఆర్‌ కాలనీలో సుమారు 21 ఏళ్ల క్రితమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేశాయని పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత అదే భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో భూములను చేర్చడానికి సంబంధించిన రికార్డులు, ఆధారాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. 22ఎ జాబితాలో అమీన్‌పూర్ భూములను చేర్చిన అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, పాత రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, భూ హక్కులను పరిశీలించాలని పాండురంగారెడ్డి కోరారు. నిషేధిత జాబితాలో అర్హత లేని భూములు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 22ఎ నిబంధనను ఎత్తివేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ఆయన హెచ్చరించారు. అమీన్‌పూర్‌లోని అన్ని కాలనీల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భూ హక్కుదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తుమ్మల పాండురంగారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ క్రిష్ణ, ఉపేందర్ రెడ్డి, పి ఎస్ ఆర్ కాలనీ అధ్యక్షుడు అవంస శ్రీనివాసరావు, యూనుస్, ఆమీన్పూర్ మాజీ ఇంచార్జ్ సర్పంచ్ మంజుల చంద్రశేఖర్, బి ఆర్ ఎస్ కార్యకర్తలు, ఆయాకాలనీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

6 hrs ago
user_MUKKAGALLA YADANNA
MUKKAGALLA YADANNA
Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
6 hrs ago
31a9dba3-f4e1-4bdc-b224-cf665b4d95a7

*29న అమీన్‌పూర్‌లో భారీ నిరసన..* *22ఎ జాబితా నుంచి భూములను తొలగించాలి: తుమ్మల పాండురంగారెడ్డి* *22ఎ జాబితాతో నిలిచిన భూముల క్రయవిక్రయాలు* *600 ఎకరాల భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి* *హెచ్‌ఎండిఎ లేఅవుట్ల భూములపైనా 22ఎ ప్రభావం* *పెళ్లిళ్లు, అత్యవసర అవసరాలకు ఆస్తులు అమ్ముకోలేని పరిస్థితి* *21 ఏళ్ల క్రితం రిజిస్ట్రేషన్లు.. ఇప్పుడు నిషేధిత జాబితాలోనా?* *నవ్యనగర్ చౌరస్తాలో 29న భారీ నిరసన, హాజరు కానున్న 15 వేల మంది* *ప్రతి కాలనీ నుంచి ప్రజలు స్వచ్చందంగా  తరలిరావాలి* *రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేపడతాం* *అధికారులు రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలి* *22ఏ ఎత్తివేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష* *ఎంఆర్‌ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి హెచ్చరిక* *భూ హక్కుదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం* అమీన్‌పూర్ పరిధిలో 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి, అర్హులైన భూ హక్కుదారులకు న్యాయం చేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 22ఎ జాబితా కారణంగా భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్‌పూర్‌లోని హెచ్‌ఎండిఎ లేఅవుట్లు, ఇంద్రక్రిశాట్ కాలనీ, మోడీ బిల్డర్స్, చక్రపురికాలని లకు సంబంధించిన భూములు సైతం 22ఎ జాబితాలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అమీన్‌పూర్ పరిధిలో సుమారు 600 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుస్తోందని, ఏ ప్రాతిపదికన ఈ భూములను జాబితాలో చేర్చారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 22ఎ జాబితా వల్ల అత్యవసర అవసరాల కోసం సొంత భూములు, ఇళ్లను విక్రయించుకోలేని పరిస్థితి ఏర్పడిందని పాండురంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు, ఇతర కుటుంబ అవసరాల కోసం ఆస్తులు విక్రయించాలన్నా రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. బ్యాంకులు రుణాలు ఇచ్చి, గతంలో రిజిస్ట్రేషన్లు జరిగిన భూములను ఇప్పుడు నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని విమర్శించారు. 22ఎ సమస్య పరిష్కారం కోసం ఈ నెల 29న అమీన్‌పూర్‌లోని

94b0f663-8182-4043-99ab-01d5ccf7ff1e

నవ్యనగర్ చౌరస్తాలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పాండురంగారెడ్డి తెలిపారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కార్యక్రమానికి హాజరుకానున్నట్లు చెప్పారు. ప్రతి కాలనీ నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 22ఎ నిబంధనను ఎత్తివేయాలని, అర్హులైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఎంఆర్‌ఓ, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాల వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. పిఎస్‌ఆర్‌ కాలనీలో సుమారు 21 ఏళ్ల క్రితమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేశాయని పాండురంగారెడ్డి పేర్కొన్నారు. ఇన్నేళ్ల తర్వాత అదే భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో భూములను చేర్చడానికి సంబంధించిన రికార్డులు, ఆధారాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. 22ఎ జాబితాలో అమీన్‌పూర్ భూములను చేర్చిన అంశంపై అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, పాత రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, భూ హక్కులను పరిశీలించాలని పాండురంగారెడ్డి కోరారు. నిషేధిత జాబితాలో అర్హత లేని భూములు ఉంటే వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. 22ఎ నిబంధనను ఎత్తివేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ఆయన హెచ్చరించారు. అమీన్‌పూర్‌లోని అన్ని కాలనీల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భూ హక్కుదారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తుమ్మల పాండురంగారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ క్రిష్ణ, ఉపేందర్ రెడ్డి, పి ఎస్ ఆర్ కాలనీ అధ్యక్షుడు అవంస శ్రీనివాసరావు, యూనుస్, ఆమీన్పూర్ మాజీ ఇంచార్జ్ సర్పంచ్ మంజుల చంద్రశేఖర్, బి ఆర్ ఎస్ కార్యకర్తలు, ఆయాకాలనీల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    3
    *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?*


*ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన*


*తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు*


*కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు*


*రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు*


*అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న*


*తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు*


*భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు*


*రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు*


*కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు*


తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని  బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపణ 
యూరియా కోసం వెళ్లిన రైతులకు అదనపు ఎరువుల భారం తప్పడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ చేసుకున్న యూరియాతో పాటు మరో ఎరువును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని డీలర్లు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిప్పలతుర్తిలో ఓ దుకాణదారుడు రైతులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినట్లు తెలిపారు. అంతేకాకుండా, “ఏ అధికారికి చెప్పుకుంటావో చెప్పుకో” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. రైతుల ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ డీఏ, ఎంఓలు స్పందించారు. యూరియాతో పాటు ఇతర ఎరువులను బలవంతంగా అంటగట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    1
    ABN ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సోదరా ABN రాధాకృష్ణ  మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా
కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది
ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది
మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు
మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది
ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ
కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా
ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    8 hrs ago
  • మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.
    1
    మల్కాజ్‌గిరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా
మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా, స్వామివారి దర్శనానికి స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    11 hrs ago
  • బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.
    1
    బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కార్యాలయం ఎదుట బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. షామీర్‌పేట్ నివాసంలో దేశపాండేను కలిసిన ఈటల, బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు అందించాలని కోరారు. పేద బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు.
    user_FOCUS MEDIA
    FOCUS MEDIA
    Content Creator (YouTuber) కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    15 hrs ago
  • మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. మరోవైపు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు డీలర్లు టోకెన్ల విధానాన్ని అనుసరిస్తూ లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కోటా కావడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగింది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించి, అందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
    1
    మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు
మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి తీసుకునేందుకు లబ్ధిదారులు చౌకధరల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తుండటంతో రేషన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. మరోవైపు సర్వర్ సక్రమంగా పనిచేయకపోవడంతో పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొందరు డీలర్లు టోకెన్ల విధానాన్ని అనుసరిస్తూ లబ్ధిదారులకు బియ్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. మూడు నెలల కోటా కావడంతో రేషన్ దుకాణాల వద్ద రద్దీ మరింత పెరిగింది. సర్వర్ సమస్యను త్వరగా పరిష్కరించి, అందరికీ ఇబ్బందులు లేకుండా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    1
    హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఘోర బస్సు ప్రమాదం... ఐదుగురి మృతి
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్(ఫ్రెష్ బస్) బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ DCM ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
    user_Journalist Anil kumar
    Journalist Anil kumar
    Local News Reporter Medipally, Medchal Malkajgiri•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.