కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం *స్వర్ణ గ్రామ కార్యాలయాలు ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే* *ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ, త్రాగునీటి పరిస్థితి పరిశీలన* మోపిదేవి: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం మోపిదేవి, రావివారిపాలెం, వెంకటాపురం స్వర్ణ గ్రామ కార్యాలయాలు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ పరిశీలించారు. త్రాగునీటి సౌకర్యాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలించారు. రావివారిపాలెం స్వర్ణ గ్రామ కార్యాలయ ఆవరణలో నిరుపయోగంగా పడి ఉన్న ట్రాక్టర్, యంత్రం పరిశీలించి వాటిని వినియోగంలోకి తేవాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబుకు సూచించారు. వెంకటాపురం గ్రామ కార్యాలయంలో సిబ్బందికి ఇబ్బందిగా ఉన్న వ్యర్థములను తొలగించాలని సూచించారు. ఫౌండేషన్ స్థాయిలో నిలిచిన గ్రామ పంచాయతీ కార్యాలయం పరిశీలించారు. ఆయన వెంట జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు, తహసీల్దార్ భవాని, మోపిదేవి ప్రత్యేక అధికారి ముప్పిరిశెట్టి హరనాధ్, ఎంపీడీఓ స్వర్ణ భారతి ఉన్నారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం *స్వర్ణ గ్రామ కార్యాలయాలు ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే* *ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ, త్రాగునీటి పరిస్థితి పరిశీలన* మోపిదేవి: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం మోపిదేవి, రావివారిపాలెం, వెంకటాపురం స్వర్ణ గ్రామ కార్యాలయాలు ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో సిబ్బంది హాజరు, ఎన్టీఆర్ భరోసా పింఛన్ దరఖాస్తుల నమోదు ప్రక్రియ పరిశీలించారు. త్రాగునీటి సౌకర్యాలు, క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలించారు. రావివారిపాలెం స్వర్ణ గ్రామ కార్యాలయ ఆవరణలో నిరుపయోగంగా పడి ఉన్న ట్రాక్టర్, యంత్రం పరిశీలించి వాటిని వినియోగంలోకి తేవాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబుకు సూచించారు. వెంకటాపురం గ్రామ కార్యాలయంలో సిబ్బందికి ఇబ్బందిగా ఉన్న వ్యర్థములను తొలగించాలని సూచించారు. ఫౌండేషన్ స్థాయిలో నిలిచిన గ్రామ పంచాయతీ కార్యాలయం పరిశీలించారు. ఆయన వెంట జడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు, తహసీల్దార్ భవాని, మోపిదేవి ప్రత్యేక అధికారి ముప్పిరిశెట్టి హరనాధ్, ఎంపీడీఓ స్వర్ణ భారతి ఉన్నారు.
- 22 అడుగుల ఎత్తు గల వినాయక విగ్రహం రేపల్లె ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో ఏర్పడిన గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి ప్రాంగణంలో గత 22 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 14 నుండి ప్రారంభమైన గణేష్ మహోత్సవాలు 7 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య యువత అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు లలిత సహస్రనామ పారాయణం సంపత్ గణపతి గానామృతం సౌందర్యలహరి పారాయణం పంచ హారతులు తీర్థప్రసాదాలు వినియోగము జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, 20వ తేదీ అన్న ప్రసాద వితరణ స్వామి వారి లడ్డు వేలం పాట సాయంత్రం 4 గంటలకు వినాయక నిమర్జనం ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కేరళ వారిచే అందకాసురుడు, రోబోటిక్ ప్రోగ్రాం, సరస్వతీ నాదస్వర బృందం, పామరు వారిచే క్లాసికల్ సన్నాయి మేళం లతో గణేష్ నిమజ్జనాన్ని రేపల్లె పెనుమూడి కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.2
- సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడు, సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడుకి మహిళలు పూజా కార్యక్రమం చేసి పిల్లలచే ఆటపాటలు చేయించుచున్న కమిటీ వారికి ధన్యవాదాలు.2
- డౌన్.. డౌన్.. గొట్టిపాటి రవికుమార్ నారా లోకేష్ వస్తాడో.. చంద్రబాబు వస్తాడో.. రవికుమార్ వస్తాడో రండి.. వినాయక నిమజ్జనంలో డీజేకి పర్మిషన్ ఇవ్వలేదని టీడీపీ శ్రేణుల ఆందోళన అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో టీడీపీ ఆందోళన నిమజ్జనంలో డీజే పర్మిషన్ ఇవ్వలేదని తిరగబడిన సొంత పార్టీ నేతలు1
- దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ , ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ఎన్‌డీఏ కూటమి నాయకులు, బిజెపి ఇన్చార్జ్, ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ ప్రగతి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయిన నుంచి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోది అన్నారు. అటువంటి వ్యక్తి బాగుండాలని భారతీయులందరూ బాగుంటారని పేర్కొన్నారు మన దేశాన్ని మతాన్ని గౌరవించాలని పేర్కొన్నారు వికసిప్ భారత్ సంకల్పంలో భాగంగా 2047వ సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఉద్యోగం ఉండాలని భారతీయులందరూ సంపన్నులు అవ్వాలని ఆలోచించి దేశం కోసం నిరంతరం శ్రమిస్తు ,కృషి చేస్తున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు.2
- పెనుగొండలో వీఆర్ఏల కదంతొక్కిన ర్యాలీ డిమాండ్ల పరిష్కారానికి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఏపీ వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (VRA JAC) పిలుపు మేరకు వీఆర్ఏలు రెండో రోజు గురువారం పెనుగొండలో ర్యాలీ నిర్వహించారు. నరసాపురం డివిజన్ వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దనున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు వెన్నుదన్నుగా పనిచేస్తున్న వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా వేతనాలు, ఉద్యోగ భద్రత, పదోన్నతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయడంతో పాటు నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంలో వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్‌ఓ, అటెండర్, నైట్‌వాచ్‌మన్ పోస్టుల్లో వీఆర్ఏలకు ఉన్న పదోన్నతి కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేయాలని నాగరాజు కోరారు. ర్యాలీలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వీఆర్ఏలు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.1
- అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.1
- మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సిట్ అధికారులు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకోచ్చారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు'లో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు.పీటీ వారెంట్‌పై కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడకు తరలింపు.మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ అధికారులు.1
- జమ్వాసు గ్రామంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన భూ వివాదం భూ వివాదం నేపథ్యంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన సంఘటన మహారాష్ట్రలోని జమ్వాసు గ్రామంలో జరిగింది. భూ వివాదం ఓ వృద్దురాలి ప్రాణం తీసింది. ప్రత్యర్థులు ముసలావిడ ఉంటున్న ఇంటిని బొలెరో వాహనంతో 4-5 సార్లు గుద్దారు. దీంతో 75 ఏళ్ల సోనాబాయి మఖారం జాదవ్ స్పాట్‌లోనే చనిపోయింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.1