జనగామ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన మల్లన్న.... ఆడబిడ్డల సొమ్ము దొంగతనం.. 74 కోట్లు ఏమైనట్టు?* గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన శానిటైజేషన్ స్కీమ్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించిందని మల్లన్న మండిపడ్డారు.ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయించిన 74 కోట్ల రూపాయలను దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారని ధ్వజమెత్తారు. స్కాలర్‌షిప్ నిధుల దారి మళ్ళింపు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన 1900 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధులలో కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసి, మిగిలిన సొమ్మును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర పనులకు దారి మళ్లించిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.శుక్రవారం జిల్లా కేంద్రమైన జనగామ నగరంలో బీసీ బహుజన విద్యార్థి యువ చైతన్య సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలోని ఒక్కో కుక్క ఆహారం కోసం నెలకు 16 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం హాస్టల్‌లో ఉండి చదువుకునే పేద బిడ్డలకు కనీసం 2 వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు.కుక్కకు ఉన్న విలువ కూడా విద్యార్థులకు లేదా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.శ్రీ చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాల విద్యార్థుల ర్యాంకులను తమవిగా చూపించుకుంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు దక్కాల్సిన 25 శాతం ఉచిత సీట్ల గురించి ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని, ఆ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు.భారతదేశంలో విద్య కోసం అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, దీనివల్ల రాష్ట్ర విద్యా వ్యవస్థ దేశంలోనే 18వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం కార్పొరేట్ కాలేజీల్లో సీట్లు నింపడం కోసమే పదవ తరగతిలో అందరినీ పాస్ చేస్తున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ఆయన పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి మనవడు అమెరికాలో చదువుకుంటుంటే, పేద విద్యార్థులు మాత్రం కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనగామ నియోజకవర్గంలో రాజకీయం విద్యా వ్యాపారవేత్తల చేతుల్లో బందీ అయిందన్నారు.ఒకవైపు అనురాగ్ యూనివర్సిటీ యజమాని పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరోవైపు కొమ్మూరి ఇన్స్టిట్యూట్ అధినేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విద్యను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని ధ్వజమెత్తారు.1,26,000 బీసీ ఓట్లున్న జనగామలో కేవలం 11,000 ఓట్లున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీళ్ళే ఎందుకు ఏలాలి? ఈ విద్యా వ్యాపారుల నుంచి జనగామను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున జనగామ నియోజకవర్గ మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతిని తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు.20 ఏళ్ల పాటు సైన్యంలో దేశానికి సేవ చేసి వచ్చిన ముదిరాజ్ బిడ్డ భిక్షపతిని గెలిపించుకోవాలని, అప్పుడే జనగామలో పేద బిడ్డలకు ఉచిత విద్య, మెరుగైన భవిష్యత్తు అందుతుందని తెలిపారు.సమావేశం అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థానిక 5 మరియు 13వ వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు మల్లన్న గారికి ఘన స్వాగతం పలికారు. ప్రజలను ఉద్దేశించి మల్లన్న మాట్లాడుతూ,తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జనగామ తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన మల్లన్న.... ఆడబిడ్డల సొమ్ము దొంగతనం.. 74 కోట్లు ఏమైనట్టు?* గత కేసీఆర్ ప్రభుత్వం తొమ్మిది, పదో తరగతి చదువుతున్న ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన శానిటైజేషన్ స్కీమ్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించిందని మల్లన్న మండిపడ్డారు.ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయించిన 74 కోట్ల రూపాయలను దొంగతనంగా ఎత్తుకపోయి తిన్నారని ధ్వజమెత్తారు. స్కాలర్‌షిప్ నిధుల దారి మళ్ళింపు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన 1900 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్ నిధులలో కేవలం 300 కోట్లు మాత్రమే విడుదల చేసి, మిగిలిన సొమ్మును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇతర పనులకు దారి మళ్లించిందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.శుక్రవారం జిల్లా కేంద్రమైన జనగామ నగరంలో బీసీ బహుజన విద్యార్థి యువ చైతన్య సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలోని ఒక్కో కుక్క ఆహారం కోసం నెలకు 16 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం హాస్టల్‌లో ఉండి చదువుకునే పేద బిడ్డలకు కనీసం 2 వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు.కుక్కకు ఉన్న విలువ కూడా విద్యార్థులకు లేదా?" అని ఆయన
సూటిగా ప్రశ్నించారు.శ్రీ చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థలు ఇతర రాష్ట్రాల విద్యార్థుల ర్యాంకులను తమవిగా చూపించుకుంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు దక్కాల్సిన 25 శాతం ఉచిత సీట్ల గురించి ప్రభుత్వం ప్రజలకు చెప్పడం లేదని, ఆ చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు.భారతదేశంలో విద్య కోసం అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, దీనివల్ల రాష్ట్ర విద్యా వ్యవస్థ దేశంలోనే 18వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.కేవలం కార్పొరేట్ కాలేజీల్లో సీట్లు నింపడం కోసమే పదవ తరగతిలో అందరినీ పాస్ చేస్తున్నారని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడటమేనని ఆయన పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రి మనవడు అమెరికాలో చదువుకుంటుంటే, పేద విద్యార్థులు మాత్రం కూలిపోయే స్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ జనగామ నియోజకవర్గంలో రాజకీయం విద్యా వ్యాపారవేత్తల చేతుల్లో బందీ అయిందన్నారు.ఒకవైపు అనురాగ్ యూనివర్సిటీ యజమాని
పల్లా రాజేశ్వర్ రెడ్డి, మరోవైపు కొమ్మూరి ఇన్స్టిట్యూట్ అధినేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విద్యను అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారని ధ్వజమెత్తారు.1,26,000 బీసీ ఓట్లున్న జనగామలో కేవలం 11,000 ఓట్లున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వీళ్ళే ఎందుకు ఏలాలి? ఈ విద్యా వ్యాపారుల నుంచి జనగామను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున జనగామ నియోజకవర్గ మొట్టమొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ భిక్షపతిని తీన్మార్ మల్లన్న అధికారికంగా ప్రకటించారు.20 ఏళ్ల పాటు సైన్యంలో దేశానికి సేవ చేసి వచ్చిన ముదిరాజ్ బిడ్డ భిక్షపతిని గెలిపించుకోవాలని, అప్పుడే జనగామలో పేద బిడ్డలకు ఉచిత విద్య, మెరుగైన భవిష్యత్తు అందుతుందని తెలిపారు.సమావేశం అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్థానిక 5 మరియు 13వ వార్డుల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు మల్లన్న గారికి ఘన స్వాగతం పలికారు. ప్రజలను ఉద్దేశించి మల్లన్న మాట్లాడుతూ,తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
- తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ.. అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటది : టిఆర్ఎస్ ఛీఫ్ కవిత హైదరాబాద్ : ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే అదే కార్మికుల శ్రమను దోపిడీ చేస్తుందని తెలంగాణ రక్షణ సేన ఛీఫ్ కవిత అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ పార్టీ కార్యాలయంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. అనంతరం తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్లమీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదు.2
- సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న జనగామ నాయకులు.... ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో పార్టీలతో ప్రమేయం లేకుండా పలువురు ప్రజాప్రతినిధులు,పలు పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శుక్రవారం తన స్వంత గ్రామమైన నల్లబెల్లి లో నిర్వహించిన ఈ అంతిమ యాత్రలో జనగామ జిల్లా నుండి జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యే లు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ అంతిమయాత్రలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరయ్యారు.1
- భారత దేశంలో 5 శక్తి పీఠాలలో ఒకటిగా మన ఆలేరు నియోజకవర్గం లోని కొలనుపాక కోటిలింగాల శివుడు భారతదేశంలోనే ఐదు శివశక్తి పీఠాలు అందులో ఒకటిగా మన భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కొలనుపాక లో ఉన్న కోటిలింగాల శివుడు ని దర్శించుకున్న వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షణలో హరినామ సంకీర్తన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కొండ చుట్టూ శనివారం ఉదయం గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, ఆలయ సిబ్బంది, అధికారులు హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి, భువనగిరి అంజయ్య, కిరణ్, సత్తిరెడ్డి, సాయిబాబా, మహిళా భక్తులు, భజన బృందాలు పాల్గొన్నారు.1
- రాజాపేట మండలంలో భూ సర్వే పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ రాజాపేట మండలంలోని బసంతపురం, కాల్వపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూ సర్వే పనులను జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకా రెడ్డి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో కొనసాగుతున్న సర్వే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు తగు సూచనలు చేశారు. సర్వేలో ఖచ్చితత్వం పాటిస్తూ రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు భూ రికార్డులను నమోదు చేసి, వివాదాలకు తావులేకుండా సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.1
- మోత్కూర్ పాటిమట్ల ఎక్స్ రోడ్డులో 6 బెల్ట్ షాపులపై ఏకకాలంలో తనిఖీలు – భారీగా అక్రమ మద్యం స్వాధీనం1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గొప్ప వ్యక్తిత్వాన్ని ఆయన విశాల హృదయంతో ఈ వీడియో నిదర్శనం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి గొప్ప వ్యక్తిత్వానికి, ఆయన విశాల హృదయానికి నిదర్శనం ఈ వీడియో! ఢిల్లీ ఆందోళనల్లో కొందరు యువతులు తనను, తన కన్నతల్లిని అత్యంత అసభ్యకరంగా దూషించినప్పటికీ... వారిపై ఏమాత్రం కోపగించుకోకుండా ఒక తండ్రిలా ఆయన స్పందించిన తీరు అద్భుతం. "యువత చిన్నతనంలో తప్పులు చేయడం సహజం, వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత పెద్దలదే" అని మోదీ గారు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. "పిల్లలూ... రండి, దేశం కోసం అందరం కలిసి పనిచేద్దాం" అంటూ దారి తప్పిన యువతకు ఆయన ఇచ్చిన పిలుపు ఎంతో స్ఫూర్తిదాయకం.1