*మూలాపేట DSR హైస్కూల్‌లో నారాయణ ఉచిత వైద్య శిబిరం* * నారాయణ నేత్ర జ్యోతి, దంత సురక్ష శిబిరాలకు విశేష స్పందన * మంత్రి నారాయణ సేవలు అభినందనీయం..డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ * DSR హైస్కూల్‌లో 200 మంది విద్యార్థులకు కంటి, దంత పరీక్షలు * విద్యార్థులకు త్వరలోనే ఉచితంగా కళ్లద్దాల పంపిణీ: అన్నంగి ప్రసాద్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రజల శ్రేయస్సు, ముఖ్యంగా నిరుపేదల ఆరోగ్యం మరియు విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా అనేక బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నారు.ప్రజాసేవే పరమావధిగా భావించే మంత్రి నారాయణ, సొంత నిధులతో నారాయణ నేత్ర జ్యోతి మరియు నారాయణ దంత సురక్ష పేరిట ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ వేలాది మందికి కంటి చూపును, మెరుగైన దంత ఆరోగ్యాన్ని అందిస్తున్నారు.కేవలం వైద్య సేవలతోనే ఆగకుండా, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆధునీకరించి, విద్యార్థుల సౌకర్యార్థం వేలాది ఉచిత సైకిళ్లను పంపిణీ చేసి విద్యా వికాసానికి ఎనలేని కృషి చేస్తున్నారు.ఈ క్రమంలోనే, నెల్లూరు నగరం మూలాపేటలోని 39వ డివిజన్‌లో ఉన్న DSR హైస్కూల్‌లో శనివారం నారాయణ నేత్ర జ్యోతి,నారాయణ దంత సురక్ష ఉచిత వైద్య శిబిరాన్ని వైభవంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, 39 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ అన్నంగి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై, పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ గారి సేవా కార్యక్రమాలను విశేషంగా కొనియాడారు...నారాయణ నేత్ర జ్యోతి ద్వారా ఇప్పటివరకు 12,000 మందికి కంటి పరీక్షలు పూర్తి చేసి, 7,000 మందికి ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేయడంతో పాటు 200 మందికి ఉచిత శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారని, అలాగే నారాయణ దంత సురక్ష ద్వారా 6,900 మందికి దంత పరీక్షలు నిర్వహించి, సంచార బస్సులోనే 1,000 మందికి పైగా అక్కడికక్కడే ఉచితంగా చికిత్స అందించి మిగతా వారిని ఆస్పత్రికి రిఫర్ చేశారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు నగరం మూలాపేటలోని 39వ డివిజన్ DSR హైస్కూల్‌లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం ప్రారంభించి, తొలిరోజే 200 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించరు...ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి, ఇటీవల 7,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేసిన బాటలోనే, పేద విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా సొంత నిధులతో ప్రజాసేవ అందిస్తున్న మంత్రి నారాయణ గారికి ఆశీస్సులు తెలియజేస్తూ, హెడ్ మాస్టర్లు, తల్లిదండ్రులు, వైద్యులతో సమన్వయం చేస్తూ ఈ శిబిరాన్ని విజయవంతం చేస్తున్న క్లస్టర్ ఇన్‌ఛార్జ్ అన్నంగి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు...అనంతరం *క్లస్టర్ ఇంచార్జ్ అన్నంగి ప్రసాద్ మాట్లాడారు* DSR పాఠశాలలో ఇప్పటివరకు సుమారు 200 మంది పేద విద్యార్థులు ఈ కంటి మరియు దంత పరీక్షల సేవలను వినియోగించుకున్నారని. ఈ పరీక్షల్లో కళ్ళద్దాలు అవసరమని తేలిన పిల్లలకి, ఎల్లుండి అదే పాఠశాలలో వైద్యుల ద్వారా ఉచితంగా కళ్ళద్దాలను పంపిణీ చేయనున్నారని తెలిపారు. ఈ డివిజన్‌లో ప్రజల కోసం ఇప్పటివరకు 4 మెడికల్ క్యాంపులు నిర్వహించామన్నారు.. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణ ప్రియ, డెంటల్ ప్రొఫెసర్ రాహుల్, AO ఆఫీసర్ సుధీర్, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- From the Coast to Bhogapuram Airport. ✈️ Where Vision Meets Reality. Thank You, YS Jagan!❤️ From the Coast to Bhogapuram Airport. ✈️ Where Vision Meets Reality. Thank You, YS1
- తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్ తిరుపతిలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ బైరాగిపట్టేడలో బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు.బిర్యానీ ఫ్యాక్టరీ రెస్టారెంట్ సీజ్ చేసిన కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్వేష్.ట్రేడ్ లైసెన్స్ లేదు, ఫుడ్ సేఫ్టీ మేజర్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్న డాక్టర్ అన్వేష్1
- అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు. అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం: మోదీ AP: అల్లూరి సీతారామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. ఇక్కడ కొత్త ఎయిర్పోర్టు ప్రారంభంతో ఈ ప్రాంత ప్రగతికి బాట పడుతుందని చెప్పారు. 'ఇవాళ అభివృద్ధి, థింసా నృత్యంతో చరిత్ర సృష్టించాం. ఒకేసారి 13వేల మందికి పైగా గిరిజనులు థింసా నృత్యం చేయడం అద్భుతం. ఈ నృత్యంలో మన తరతరాల వారసత్వం కనిపించింది. ఇందుకు కారణమైన చంద్రబాబు విజన్కు అభినందనలు' అని పేర్కొన్నారు.1
- అక్రమ మద్యం. ఇసుక అక్రమాలను అరికట్టాలి.. ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి. ముఖేష్ కుమార్ మీనా అక్రమ మద్యం, ఇసుక అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి: ముఖేష్ కుమార్ మీనా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎక్సైజ్), పరిశ్రమలు & వాణిజ్యం (గనులు) శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, బహిరంగ మద్యపానాన్ని కట్టడి చేసి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇసుక సరఫరా సజావుగా ఉండేలా, ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనింగ్ లీజులు, ఖనిజ ఆదాయం, నాన్-వర్కింగ్ లీజులపై సమీక్ష నిర్వహించి పారదర్శకంగా పనులు చేపట్టాలని సూచించారు. వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల కోసం గుర్తించిన భూములకు అవసరమైన అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.1
- వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని అలిపిరి మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కలికిరి నేస్తం న్యూస్.. పీలేరు: 31జూలై 2026: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో, ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి శుక్రవారం అలిపిరి మెట్ల మార్గంలో మొకాళ్లపై నడిచి తిరుమల చేరుకుని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మనస్ఫూర్తిగా ప్రార్థించారు. ఈ సందర్భంగా బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వై.ఎస్. షర్మిల సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని, మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కలకడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ భాష, రాష్ట్ర లీగల్ సెల్ సభ్యుడు రవి, మంగునాయక్, శ్రీనివాస్, అనిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు షర్మిల అభిమానులు పాల్గొని వై.ఎస్. షర్మిల త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.1
- పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి, సెప్టెంబర్ 1 నాటికి నీటిని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం: జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని నేడు పరిశీలించడం జరిగిందని, వేగంగా పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎమ్. విజయ సునీత పేర్కొన్నారు. ఈ పరిశీలనలో భాగంగా ప్రత్యేక వాహనాల్లో జంట సొరంగాల్లోకి వెళ్లి ముందుగా టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ బీ ఎం ) పనులను పరిశీలించి, పురోగతి సంబంధిత వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ: టన్నెల్-2 లైనింగ్ పనుల్లో పురోగతి: వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్-2 లో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దాదాపు నెల రోజుల క్రితం 2,000 మీటర్లకు పైగా బ్యాలెన్స్ ఉన్నటువంటి లైనింగ్ పనిని, ప్రస్తుతం దాదాపు 460 మీటర్ల వరకు తీసుకురావడం జరిగిందని తెలియజేశారు.15 రోజుల్లో మిగిలిన పనుల పూర్తి: మిగిలిన 460 మీటర్ల లైనింగ్ పనిని కూడా ప్రణాళికాబద్ధంగా (Plan of Action), వీలైనంత వేగంగా, ఆగష్టు 15 లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కాలనీల (R&R) అభివృద్ధి: ముంపునకు గురవుతున్న (Submergence) 11 గ్రామాలకు సంబంధించిన పునరావాస కాలనీల్లో ప్రాథమిక సౌకర్యాలు (Basic Amenities), మౌలిక సదుపాయాలు / ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అత్యంత వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నిర్వాసితుల తరలింపు ఏర్పాట్లు: సత్వరమే పనులన్నీ పూర్తి చేసి, ఇప్పటికే పరిహారం అందుకున్న నిర్వాసితులను ఆయా కాలనీలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సెప్టెంబర్ 1 నాటికి నీటి విడుదల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, సెప్టెంబర్ 1వ తేదీ కల్లా ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల పనులను పూర్తి చేసి, నీటిని విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, ఇతర జిల్లా అధికారులు, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- మా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో మేము చేసింది ఎక్కువ... చెప్పుకుంది తక్కువ! 🥺💔 The Real Story of Bhogapuram International Airport! ✈️ Every stage—from approvals and environmental clearances to land acquisition and construction—was driven forward during YS Jagan's government. This project didn't happen overnight. The data tells the మా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ హయాంలో మేము చేసింది ఎక్కువ... చెప్పుకుంది తక్కువ! 🥺💔 The Real Story of Bhogapuram International Airport! ✈️ Every stage—from approvals and environmental clearances to land acquisition and construction—was driven forward during YS Jagan's government. This project didn't happen overnight. The data tells the real story. Thank you, Jagananna, for making the vision a reality! #BhogapuramAirportByJagan1
- కాణిపాకంలో టిడిపి వైసిపి నాయకుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఐరాల మండలం కాణిపాకంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య నినాదాలతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్య ప్రమాణ కార్యక్రమం సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ నాయకులను ఉద్దేశించి నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.1