కట్టంగూర్‌లో కాంగ్రెస్ నేతల నివాళి – ఎరుకల పార్వతమ్మకు ఘనంగా శ్రద్ధాంజలి.. నకిరేకల్ నియోజకవర్గం:- కట్టంగూర్ మండలం: కట్టంగూర్ మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గౌడ యువజన సంఘం అధ్యక్షుడు ఎరుకల లక్ష్మణ్ గౌడ్ గారి నాయనమ్మ ఎరుకల పార్వతమ్మ మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపార్టీ రవీందర్ రెడ్డి, కట్టంగూర్ మండల మాజీ ఎంపీపీ రెడ్డిపళ్లి సాగర్, కట్టంగూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, అలాగే లింగయ్య, శీను, నాగరాజు, రాజశేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపగా, నాయకులు పార్వతమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కట్టంగూర్‌లో కాంగ్రెస్ నేతల నివాళి – ఎరుకల పార్వతమ్మకు ఘనంగా శ్రద్ధాంజలి.. నకిరేకల్ నియోజకవర్గం:- కట్టంగూర్ మండలం: కట్టంగూర్ మండలానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గౌడ యువజన సంఘం అధ్యక్షుడు ఎరుకల లక్ష్మణ్ గౌడ్ గారి నాయనమ్మ ఎరుకల పార్వతమ్మ మరణం పట్ల కాంగ్రెస్
నాయకులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ గారు మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి దుఃఖంలో భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గార్లపార్టీ రవీందర్ రెడ్డి, కట్టంగూర్
మండల మాజీ ఎంపీపీ రెడ్డిపళ్లి సాగర్, కట్టంగూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, అలాగే లింగయ్య, శీను, నాగరాజు, రాజశేఖర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఈ ఘటన విషాదాన్ని నింపగా, నాయకులు పార్వతమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
- వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన రిటైర్డ్ టీచర్ నిమ్మని రాజేశ్వర్ రావు మరణం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. గురువారం ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.1
- డీలిమిటేషన్ సెగ.. అగ్గిరాజేసిన సీఎం స్టాలిన్! బిల్లు ప్రతులను తగలబెట్టి నిరసన. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నేడు పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, డీలిమిటేషన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు స్టాలిన్ స్వయంగా ఆ బిల్లు ప్రతులను తగలబెట్టారు.1
- Post by నీరటి మహేందర్1
- Post by JADI RAJU1
- విద్యార్థుల వినూత్న కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం రేపాయి నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రోడ్డు భద్రత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పట్టణంలోని ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు రోడ్డు వెంట మానవహారంగా ఏర్పడి ప్రయాణికులకు రోడ్డు భద్రత యొక్క ప్రాముఖ్యతను వివరించారు. “హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి”, “సీట్ బెల్ట్ తప్పనిసరి”, “జాగ్రత్తగా నడిపితేనే సురక్షిత ప్రయాణం” వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఆకర్షణగా, హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారులకు విద్యార్థులు గులాబీ పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని వినూత్నంగా తెలియజేశారు. అలాగే కార్లలో ప్రయాణిస్తున్న డ్రైవర్లకు గులాబీ పువ్వులు ఇచ్చి సీట్ బెల్ట్ ధరించాలని కోరడం అక్కడి ప్రజలను ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఐ. రామకృష్ణ గారు మాట్లాడుతూ, “రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఈ అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు తగ్గుతాయి” అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.3
- మంగళవారాన్ని పురస్కరించుకుని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేకంగా యంబ నరసింహులు గారు తన కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకుని, సర్వలోక క్షేమం కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొని భక్తి భావంతో సేవలు సమర్పించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.4
- Papa Mujhe Bhi Bachao 😢 | Helmet Sirf Aapke Liye? | Hyderabad Traffic Police Awareness Program #HyderabadTrafficPolice #RoadSafety #ArriveAlive #DefensiveDriving #HelmetSafety #SaveLives #TrafficAwareness #HyderabadNews #SchoolAwareness #SafetyFirst #RoadAccident #PoliceAwareness #TelanganaPolice #ViralNews #EmotionalStory #BreakingNews #IndiaNews #HelmetAwareness #SafeDriving #PublicAwareness1
- హన్మకొండ జిల్లాలో టీజీ ఆర్టీసీ వరంగల్ రీజియన్ పరిధిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తరచూ మొరాయిస్తున్నాయి. గురువారం హన్మకొండ–హైదరాబాద్ రూట్‌లో నడుస్తున్న బస్సు సాంకేతిక లోపాలతో రోడ్లపై ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని నిట్ సమీపంలో ఓ ఈవీ బస్సు మొరాయించడంతో ప్రయాణికులు మధ్యలోనే దిగిపోయి ప్రత్యామ్నాయ వాహనాలు ఆశ్రయించారు.1