logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లొసివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం, మే 30న ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై, కార్మిక హక్కుల సాధనే సీఐటీయూ ధ్యేయమని స్పష్టం చేశారు. కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, మే 30, 1970న కలకత్తా నగరంలో 'కార్మికుల ఐక్యత - పోరాటం' అనే నినాదంతో సీఐటీయూ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం, దోపిడీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు చేస్తోందని కొనియాడారు. దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తింపు పొందిన సీఐటీయూ, దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ సమస్యలపై, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై పోరాడటంలో ముందుందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల పని గంటలు పెంచే ప్రయత్నాలు వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచీ జరుగుతున్నాయని, మోడీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ ప్రయత్నాలు జరిగాయని, అయితే సీఐటీయూ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్వహించడం వల్లే ఇన్ని రోజులు ఆగడం సాధ్యమైందని తెలిపారు. అలాగే, 2019లో వేతన కోడ్ బిల్లు తెచ్చిన మోడీ ప్రభుత్వం, దేశవ్యాప్త కార్మిక వర్గం నిర్వహిస్తున్న సమ్మెల ప్రభావం వల్లే దానిని అమలు చేయకుండా నిలిపివేసిందని మల్లేశం విమర్శించారు. స్వాతంత్ర్యం తర్వాత ఇప్పటివరకు 17 సమ్మెలు జరిగాయని, వాటిలో 7 జాతీయ సమ్మెలు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయని ఆయన వివరించారు. లేబర్ కోడ్లు తెచ్చినప్పటికీ మోడీ మొదట భయపడి ఆగిపోయారని, అయితే బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘనవిజయం సాధించడంతో లేబర్ కోడ్ల అమలుకు నోటిఫికేషన్ ఇచ్చారని, ఇప్పుడు బెంగాల్ ఎన్నికలలో ఘనవిజయం సాధించడంతో లేబర్ కోడ్లకు నియమ నిబంధనలు రూపొందించారని ఆయన ఆరోపించారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఐటీయూ జెండాను సీనియర్ కామ్రేడ్స్ బీమగాని సోములు, యండి ఉస్మాన్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రీమియర్ ఎక్స్ ప్లొసివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సి హెచ్ రమేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బూరు సత్యనారాణ, బోడ వెంకటయ్య, పుప్పాల గణేష్, జాగిలాపురం వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, పాండు, శ్రీను, అన్నపూర్ణ, లలిత, పద్మజ, సురేష్, నగేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

7 hrs ago
user_@ANUNEWS143
@ANUNEWS143
Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
7 hrs ago
8610d414-9663-48b9-b91b-7be122531d49

యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లొసివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం, మే 30న ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై, కార్మిక హక్కుల సాధనే సీఐటీయూ ధ్యేయమని స్పష్టం చేశారు. కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, మే 30, 1970న కలకత్తా నగరంలో 'కార్మికుల ఐక్యత - పోరాటం' అనే నినాదంతో సీఐటీయూ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. అప్పటి నుండి దేశవ్యాప్తంగా కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం, దోపిడీకి వ్యతిరేకంగా రాజీలేని పోరాటాలు చేస్తోందని కొనియాడారు. దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా గుర్తింపు పొందిన సీఐటీయూ, దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్స్ సమస్యలపై, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై పోరాడటంలో ముందుందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల పని గంటలు పెంచే ప్రయత్నాలు వాజపేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచీ జరుగుతున్నాయని, మోడీ అధికారంలోకి వచ్చాక కూడా ఈ ప్రయత్నాలు జరిగాయని, అయితే సీఐటీయూ అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్వహించడం వల్లే ఇన్ని

రోజులు ఆగడం సాధ్యమైందని తెలిపారు. అలాగే, 2019లో వేతన కోడ్ బిల్లు తెచ్చిన మోడీ ప్రభుత్వం, దేశవ్యాప్త కార్మిక వర్గం నిర్వహిస్తున్న సమ్మెల ప్రభావం వల్లే దానిని అమలు చేయకుండా నిలిపివేసిందని మల్లేశం విమర్శించారు. స్వాతంత్ర్యం తర్వాత ఇప్పటివరకు 17 సమ్మెలు జరిగాయని, వాటిలో 7 జాతీయ సమ్మెలు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగాయని ఆయన వివరించారు. లేబర్ కోడ్లు తెచ్చినప్పటికీ మోడీ మొదట భయపడి ఆగిపోయారని, అయితే బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘనవిజయం సాధించడంతో లేబర్ కోడ్ల అమలుకు నోటిఫికేషన్ ఇచ్చారని, ఇప్పుడు బెంగాల్ ఎన్నికలలో ఘనవిజయం సాధించడంతో లేబర్ కోడ్లకు నియమ నిబంధనలు రూపొందించారని ఆయన ఆరోపించారు. సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఐటీయూ జెండాను సీనియర్ కామ్రేడ్స్ బీమగాని సోములు, యండి ఉస్మాన్ లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రీమియర్ ఎక్స్ ప్లొసివ్స్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సి హెచ్ రమేష్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బూరు సత్యనారాణ, బోడ వెంకటయ్య, పుప్పాల గణేష్, జాగిలాపురం వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, పాండు, శ్రీను, అన్నపూర్ణ, లలిత, పద్మజ, సురేష్, నగేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై గాంధీ భవన్‌లో ఒక విస్తృత స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభావంతో ఎస్‌ఐఆర్ విధానాన్ని ఎలా అమలు చేసిందో, ఆ ప్రక్రియ వల్ల అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడిందో తాము స్పష్టంగా గమనించామని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎన్నికల కమిషన్ విధానాలు ఏమిటి, ఓటరు జాబితా సవరణలకు అవసరమైన పత్రాలు ఏవి, వాటిని సమయానికి ఎలా సమర్పించాలి, అలాగే బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) నిర్వహించాల్సిన బాధ్యతలు, వారి పాత్ర వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.
    1
    తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియపై గాంధీ భవన్‌లో ఒక విస్తృత స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు.

పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ బీజేపీ ప్రభావంతో ఎస్‌ఐఆర్ విధానాన్ని ఎలా అమలు చేసిందో, ఆ ప్రక్రియ వల్ల అక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడిందో తాము స్పష్టంగా గమనించామని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎన్నికల కమిషన్ విధానాలు ఏమిటి, ఓటరు జాబితా సవరణలకు అవసరమైన పత్రాలు ఏవి, వాటిని సమయానికి ఎలా సమర్పించాలి, అలాగే బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) నిర్వహించాల్సిన బాధ్యతలు, వారి పాత్ర వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.
    user_@ANUNEWS143
    @ANUNEWS143
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    5 hrs ago
  • మాసబ్ ట్యాంక్‌లో హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కుటుంబాన్ని కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
    1
    మాసబ్ ట్యాంక్‌లో హత్యకు గురైన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కుటుంబాన్ని కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    7 hrs ago
  • ప్రతి భారతీయుడికి తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిన ఒక శక్తివంతమైన చట్టపరమైన హక్కుగా E-FIRను ప్రముఖంగా పేర్కొంటున్నారు. దీని ద్వారా కేవలం ఒకే క్లిక్‌తో చట్టపరమైన చర్యలు ప్రారంభమవుతాయని స్పష్టం అవుతోంది, ఇది పౌరులకు గల గొప్ప అధికారం. E-FIR సౌలభ్యం కారణంగా, ఇప్పుడు ప్రజల ఫోనే డిజిటల్ పోలీస్ స్టేషన్‌గా మారగలదు. ఇది భారతీయ చట్టం పట్ల ప్రజలలో అవగాహన కల్పించి, డిజిటల్ ఇండియా లక్ష్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
    1
    ప్రతి భారతీయుడికి తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిన ఒక శక్తివంతమైన చట్టపరమైన హక్కుగా E-FIRను ప్రముఖంగా పేర్కొంటున్నారు. దీని ద్వారా కేవలం ఒకే క్లిక్‌తో చట్టపరమైన చర్యలు ప్రారంభమవుతాయని స్పష్టం అవుతోంది, ఇది పౌరులకు గల గొప్ప అధికారం. 

E-FIR సౌలభ్యం కారణంగా, ఇప్పుడు ప్రజల ఫోనే డిజిటల్ పోలీస్ స్టేషన్‌గా మారగలదు. ఇది భారతీయ చట్టం పట్ల ప్రజలలో అవగాహన కల్పించి, డిజిటల్ ఇండియా లక్ష్యాలను బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన అడుగు.
    user_Aslam Parvez
    Aslam Parvez
    Lawyer అమీర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ యువ నాయకుడు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా యువజన అధ్యక్షులు ఎన్.సి. సంతోష్, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపించే విధంగా ఉండటం బాధాకరమని సంతోష్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుందని, అలాంటి రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి హోదాను అనుభవిస్తున్న రేవంత్ రెడ్డికి ఇది సబబు కాదని సంతోష్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మహాత్ముడి పట్ల సీఎం చూపిన నిబద్ధత అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి 'గాంధీ భవన్' అనే పేరు ఎలా వచ్చిందో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే త్వరలో గాంధీ భవన్‌ను 'సీబీఎన్ భవన్'గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, గాంధీజీ ఆశయాలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కి మాట్లాడుతున్నారని సంతోష్ ఆరోపించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్రను తక్కువ చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. పదవినిచ్చి కూర్చోబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గాంధేయవాదులు రేవంత్ రెడ్డి విధానాన్ని ఖండించాలని సంతోష్ కోరారు.
    2
    సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ యువ నాయకుడు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా యువజన అధ్యక్షులు ఎన్.సి. సంతోష్, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీ గురించి మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపించే విధంగా ఉండటం బాధాకరమని సంతోష్ పేర్కొన్నారు.

భారత రాజ్యాంగం గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుందని, అలాంటి రాజ్యాంగం ద్వారా ముఖ్యమంత్రి హోదాను అనుభవిస్తున్న రేవంత్ రెడ్డికి ఇది సబబు కాదని సంతోష్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మహాత్ముడి పట్ల సీఎం చూపిన నిబద్ధత అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి 'గాంధీ భవన్' అనే పేరు ఎలా వచ్చిందో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వైఖరి చూస్తుంటే త్వరలో గాంధీ భవన్‌ను 'సీబీఎన్ భవన్'గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని అనుమానం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, గాంధీజీ ఆశయాలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కి మాట్లాడుతున్నారని సంతోష్ ఆరోపించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్రను తక్కువ చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. పదవినిచ్చి కూర్చోబెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గాంధేయవాదులు రేవంత్ రెడ్డి విధానాన్ని ఖండించాలని సంతోష్ కోరారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, మహిళా సంక్షేమ వారోత్సవాల కింద సిరిసిల్లలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహ (సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్ మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడో లేస్సెంట్) సంఘాల సభ్యులు ఈ మాక్ పార్లమెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పాల్గొన్నారు. ఈ మాక్ పార్లమెంట్‌లో స్నేహ సంఘాల విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా ఏర్పడి, స్పీకర్ సమక్షంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికల హక్కులు, విద్య, వివిధ సామాజిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, అందరికీ ఆయా అంశాలపై అవగాహన కల్పించేలా చక్కగా వివరించారు. కార్యక్రమం ప్రారంభంలో జయ జయహే తెలంగాణ పాటను ఆలపించారు. అమ్మకు అక్షరమాల పథకం కింద చదువు నేర్చుకున్న వారిని ఈ సందర్భంగా సన్మానించారు. మాక్ పార్లమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతితో పాటు షీల్డును అందజేసి అభినందనలు తెలియజేశారు.
    4
    ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, మహిళా సంక్షేమ వారోత్సవాల కింద సిరిసిల్లలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహ (సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్ మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడో లేస్సెంట్) సంఘాల సభ్యులు ఈ మాక్ పార్లమెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పాల్గొన్నారు.

ఈ మాక్ పార్లమెంట్‌లో స్నేహ సంఘాల విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా ఏర్పడి, స్పీకర్ సమక్షంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికల హక్కులు, విద్య, వివిధ సామాజిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, అందరికీ ఆయా అంశాలపై అవగాహన కల్పించేలా చక్కగా వివరించారు. కార్యక్రమం ప్రారంభంలో జయ జయహే తెలంగాణ పాటను ఆలపించారు.

అమ్మకు అక్షరమాల పథకం కింద చదువు నేర్చుకున్న వారిని ఈ సందర్భంగా సన్మానించారు. మాక్ పార్లమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతితో పాటు షీల్డును అందజేసి అభినందనలు తెలియజేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • శుక్రవారం అర్ధరాత్రి భువనేశ్వర్‌లోని హైవేపై ఒక లారీ బీభత్సం సృష్టించింది. సైడ్ ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్, ఒక కారును ఢీకొట్టి సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. పలాసునీ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ భయానక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తెకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో, ప్రాణాపాయం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    శుక్రవారం అర్ధరాత్రి భువనేశ్వర్‌లోని హైవేపై ఒక లారీ బీభత్సం సృష్టించింది. సైడ్ ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్, ఒక కారును ఢీకొట్టి సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. పలాసునీ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ భయానక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.

ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తెకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో, ప్రాణాపాయం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Reporter Gaddam Kiran
    Reporter Gaddam Kiran
    ఖాజీపేట, హనుమకొండ, తెలంగాణ•
    42 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.