జగిత్యాల రాజకీయ ఉద్యమ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండేలా బహిరంగ సభ నిర్వహిస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.
జగిత్యాల రాజకీయ ఉద్యమ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండేలా బహిరంగ సభ నిర్వహిస్తాం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం
కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.
- అది ఒక ప్రశాంతమైన గ్రామం.. కానీ ఇప్పుడు అక్కడ అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే మరణం వెంటాడుతోంది. జన్నారం మండలంలోని చింతలపల్లి, పోన్కల్, కిష్టాపూర్ గ్రామాల్లో ప్రస్తుతం "కుక్కల రాజ్యమే" నడుస్తోంది. ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు వర్ణనాతీతం. రక్తసిక్తమైన గ్రామాలు: బాధితుల ఆర్తనాదాలు గర్భిణీ అని కూడా చూడకుండా మెట్టుపల్లి గంగజలపై కుక్క దాడి చేయడం స్థానికులను కలిచివేస్తోంది. ఇంటి ముందు ఊడుస్తున్న జయవ్వ, తన మనవడిని కాపాడబోయిన వృద్ధుడు రాజన్న, అలాగే శ్రీరామ్, పుష్పలత.. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, వరుస దాడులతో ఆసుపత్రుల పాలవుతున్నారు. మూగజీవాలైన ఆవులు, బర్రెలపై కూడా దాడులు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. "మమ్మల్ని చంపేయండి.. కానీ కుక్కను మాత్రం ఏమీ అనకండి" ప్రస్తుతం జన్నారంలో వినిపిస్తున్న వ్యంగ్యాస్త్రం ఇది. గ్రామంలోని సర్పంచ్ పంజాల సురేష్, ఇతర వార్డ్ మెంబర్లు, సెక్రెటరీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రజలేమో "మమ్మల్ని కాపాడండి" అని వారిని వేడుకుంటున్నారు. కానీ పాలకవర్గం మాత్రం "మేమేం చేయాలి?" అని నిస్సహాయంగా తలలు పట్టుకుంటున్నారు.3
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులోని రోడ్డు పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీని అరికట్టాలని ప్రజలు కోరారు. ఆ వార్డులోని ఎంపీడీవో, తాసిల్దార్, రిజిస్ట్రేషన్ వెళ్లే రహదారి పక్కన 5 రోజులుగా పైప్ లైన్ లీకేజీ అయ్యి నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై నీటి ప్రవాహం ఉండడంతో చిన్నారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించాలని కోరారు.1
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి లో ఈనెల 26న నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు దేవరాజు పిలుపునిచ్చారు. గొల్లపల్లి గ్రామంలోని హనుమాన్ ఆలయ ఆవరణలో సమ్మేళనం హిందూ సమ్మేళనం పోస్టర్ ను లక్ష్మీదేవిపల్లి, నేదునూర్ , గొల్లపల్లి సర్పంచులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు, గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదం ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఈ నెల 26 న గొల్లపల్లిలో జరిగే హిందూ సమ్మేళన సభను ఏడు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని తెలిపారు.1
- సిరిసిల్ల లో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో పై దాడి కి యత్నించారు. సిరిసిల్ల లో తహశిల్దార్ మహేశ్‌పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ తోలో దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరార్ అయ్యారు. ప్రమాదం నుంచి తృటిలో తహశీల్దార్ తప్పించుకున్నారు. పోలీసులకు తహశిల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎమ్మార్వో కు రాశారు.2
- Post by Anandrao4
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలన లక్ష్యాల పురోగతిపై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. సేవలను ప్రజలకు మరింత వేగంగా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుధాకర్, ఏఎస్ఐ జానీ పాషా, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకోవాలని నియోజకవర్గ సాధన కమిటీ కన్వీనర్ చుంచు రాజ్ కిరణ్ అన్నారు. లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీలో ఇంటర్ పరీక్షలో టాపర్గా నిలిచిన అక్కల సాయి త్రినితను ఆయన కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కానగంటి మధు, మాజీ ఎంపీటీసీ తోట మోహన్, వల్లంబట్ల శ్రీనివాస్ బిళ్ళకూరి రమేష్ చుంచు గిరిధర్, గొల్ల రాయమల్లు, అంకతి గంగాధర్, చెలిగంటి మల్లేష్, గూడెం, గ్రామస్తులు పాల్గొన్నారు..1