Shuru
Apke Nagar Ki App…
బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
GB MAHENDAR
బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- hello India khelo Sai khelo India ne Ek press conference rakhkar Logon Ko Jagruk Kiya1
- శేర్లింగంపల్లి బోనాల వేడుకల్లో పాల్గొన్న నందమూరి దీపిక జానకిరామ్ లింగంపల్లిలో గ్రామస్తులు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నందమూరి దీపిక జానకిరామ్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.3
- యూరియా బుకింగ్‌లో సాంకేతిక సమస్యలు.. రైతులకు తప్పని ఇబ్బందులు నర్సాపూర్ మండలంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నప్పటికీ, సాంకేతిక సమస్యల కారణంగా యాప్ సరిగా పనిచేయకపోవడంతో బుకింగ్ ప్రక్రియ నిలిచిపోతోందని రైతులు వాపోతున్నారు. దీంతో పంటలకు అవసరమైన సమయంలో యూరియా అందకపోవడంతో దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల కీలక దశలో యూరియా అందకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి యాప్ సమస్యను వెంటనే పరిష్కరించి ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.1
- పెరిగిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ తో పాటు ఆదాయం కూడా పెరిగింది. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.14.42 లక్షలు, VIP దర్శనాలతో రూ.5.68 లక్షలు, కార్ పార్కింగ్ తో రూ.7 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3.63 లక్షలు, ప్రధాన బుకింగ్తో రూ.1.82 లక్షలు. తదితర విభాగాల నుంచి మొత్తం రూ.44,71,561 ఆదాయం వచ్చినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- లోక కల్యాణార్థం రామకోటి లిఖిత మహాయజ్ఞం రాంసాగర్‌లో భద్రాచల రామకోటి పుస్తకాల పంపిణీ చేసిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు* లోకకల్యాణమే లక్ష్యంగా, శ్రీరామ నామమే శక్తిగా శ్రావణమాసంలో 10 కోట్ల శ్రీరామ నామ లిఖిత మహా సంకల్పానికి శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టిందని సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు తెలిపారు. ఆదివారం రాయిపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని రామాలయంలో భద్రాచలం నుంచి వచ్చిన నూతన రామకోటి పుస్తకాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ రామనామం పలికే, లిఖించే ప్రతి హృదయం పవిత్రమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీరామ నామాన్ని స్మరిస్తూ, లిఖిస్తూ ఈ మహా సంకల్పంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 10 కోట్ల లిఖిత శ్రీరామ నామాలను పూర్తి చేసి భద్రాచలానికి సమర్పించడమే మహా సంకల్పమని, ఇది కేవలం లిఖిత యజ్ఞం మాత్రమే కాకుండా భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లో మరింతగా పెంపొందించే మహోద్యమమని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా భక్తులను అధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నామని తెలిపారు. రామాలయ అధ్యక్షులు ఎనిశెట్టి వెంకటేశం మాట్లాడుతూ తమ గ్రామ భక్తులకు ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించిన రామకోటి రామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయిని ఆదిరెడ్డి, బిక్కుమల్ల నాగేష్, శ్రావణ్, బిక్షపతి, మెట్టయ్య, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.2
- పదవి విరమణ పొందిన వీఆర్వో వీఆర్ఏలకు పెన్షన్ మంజూరు చేయాలి ప్రజావాణిలో వినతి సమర్పించిన వీఆర్వో వీఆర్ఏలు పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలకు పెన్షన్ మంజూరు చేయాలి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులకు పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో 1965 నుంచి 1984 వరకు పటేల్–పట్వారీలుగా, 1992 నుంచి 2002 వరకు వీఏఓలుగా, 2002 నుంచి 2007 వరకు పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందినప్పటికీ తమకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పదవీ విరమణ పెన్షన్ అందడం లేదని వారు తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు విన్నవించినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ సమస్యపై స్పందించి, సంబంధిత సర్వీస్ రికార్డులను పరిశీలించి నివేదిక పంపాలని భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ (CCLA)కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల వివరాలతో జాబితా రూపొందించి నివేదిక పంపాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తమకు తెలిసిందన్నారు. కావున జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని CCLA ఆదేశాల మేరకు జిల్లాలో పదవీ విరమణ పొందిన వీఏఓలు, వీఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, సహాయ పంచాయతీ కార్యదర్శుల వివరాలతో జాబితా రూపొందించి CCLAకు పంపించాలని కోరారు. తమకు రావాల్సిన పదవీ విరమణ పెన్షన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.1
- narayanpura Malabar gold and diamond Bhavya udghatan Hyderabad Telangana1
- రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్! Conversation with Gemini ALL TIME RECORD: 1st Sunday 2nd Shows - All Areas - All Theaters FULLS... 1st Time in the HISTORY of TFI. #IRUMUDI 🙏🔥 @RaviTeja_offl Rajamouli movies #RRRMovie #Baahubali2 valla kuda kaledu ee Record. నభూతో నభవిష్యతి. 🙏 తెలుగులో 60 అక్షరాలలో హెడ్ లైన్ 350 అక్షరాలలో షార్ట్ న్యూస్ రవితేజ సరికొత్త రికార్డ్: టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని థియేటర్లలో హౌస్‌ఫుల్! రవితేజ నటించిన తాజా చిత్రం టాలీవుడ్ (TFI) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. సినిమా విడుదలై మొదటి ఆదివారం నాడు, రెండవ ప్రదర్శనలకు (2nd Shows) తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలు మరియు అన్ని థియేటర్లలో ప్రేక్షకులు పోటెత్తడంతో బుకింగ్స్ అన్నీ 'హౌస్‌ఫుల్' అయ్యాయి. టాలీవుడ్ చరిత్రలో ఏ పెద్ద స్టార్ సినిమాకు కూడా ఇలాంటి అపూర్వ రికార్డ్ ఇంతకుముందు సాధ్యం కాలేదు. టాలీవుడ్ దిగ్గజ దర్శకులు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 మరియు ఆర్.ఆర్.ఆర్ (RRR) వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలకు సైతం ఈ ఫీట్ సాధ్యపడలేదు. రవితేజ సినిమాకు దక్కిన ఈ ఊహించని స్పందన చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఇది 'నభూతో నభవిష్యతి' అన్నట్లుగా ఒక అరుదైన మరియు నిలకడైన సువర్ణావకాశంగా నిలిచిందని చెప్పవచ్చు.1
- పాపన్నపేట యువత బీజేపీలోకి.. కండువాలు కప్పిన జిల్లా అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై యువత బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ అన్నారు. పాపన్నపేట మండలానికి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు వడ్ల సంతోష్‌చారి, యువమోర్చా అధ్యక్షుడు జగదీశ్ ఆధ్వర్యంలో యువకులు నర్సాపూర్‌లో మల్లేష్ గౌడ్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు అభినందనలు తెలిపారు.1