రైతుల నుండి సుమారు 10 లక్షల దాకా వసూలు చేసిన లైన్మెన్ కృష్ణ కాంత్:లైన్మెన్ కృష్ణ కాంత్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు డిమాండ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని ఎమ్మిగనూరు మండల పరిధి లోని కడివెల్ల గ్రామంలో రైతులను మోసం చేసి లైన్మాన్ కృష్ణ కాంత్ సుమారుగా 10 లక్షల దాకా వసూలు చేసినట్లు సమాచారం వివరాల్లోకి వెళితే కడవెల్ల గ్రామంలోని అమాయకులైన, నిరుపేదలైన రైతులకు పొలానికి కరెంట్ ట్రాన్స్ఫార్మర్ లైన్ లను వేస్తానని అబద్ధపు మాటలు చెప్పి ఒక రైతు కడివెల్ల మద్దిలేటి దగ్గర నుండి 56000.రూ వసూలు చేశాడు.మరో రైతు దగ్గర నుండి 61000.రూ మరో రైతు నుండి 48000 రూ వసూలు చేశాడు.ఇలా చెప్పుకుంటూ పోతే గ్రామంలోని రైతుల దగ్గర నుండి సుమారుగా కొన్ని లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు ప్రాథమిక సమాచారం.కడివెల్ల గ్రామ రైతులు ఏపీ ఎమ్మార్పీఎస్ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీనిగా నాగేష్ మాదిగ ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుల గుండు పోగుల నేపాల్ ను కలసి లైన్మాన్ చేసిన మోసాలను వివరించి వారి ఆవేదనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుండు పోగుల నేపాల్ మాట్లాడుతూ కరెంట్ ఉన్నత అధికారులు కడవెల్ల గ్రామాన్ని సందర్శించి కడివెల్ల గ్రామంలోని రైతుల దగ్గర నుండి అక్రమంగా లక్షల రూపాయలు వసూలు చేసి పని చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని లైన్మెన్ కృష్ణ కాంత్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అమాయకులైన రైతుల దగ్గర నుండి వసూలు చేసిన డబ్బులు తిరిగి రైతులకు ఇప్పించి రైతులకు తగు న్యాయం చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి కడివెల్ల గ్రామన్నీ సందర్శించి రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏపీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల కన్వీనర్ రవి, ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు సోమన్న , హరి, నవీన్,పెద్దయ్య, విజయ్,యేసుబు తదితరులు పాల్గొన్నారు.

- కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు... సంక్రాంతి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి ... ధర్మవరం డిఎస్పి.. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడైనా కోడిపందాలు, టెంకాయ ఆటలు తదితర జూదాలు నిర్వహించిన పాల్గొన్న ప్రోత్సహించిన అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మవరం డిఎస్పి హేమంత్ కుమార్ గారు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆటోల ద్వారా మైకు ప్రచారం నిర్వహిస్తూ, రాబోవు సంక్రాంతి పండుగను సందర్భంగా ప్రజలకు కోడి పందాలు, టెంకాయ ఆట వంటి జూదల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన చేపట్టారు. డిఎస్పి గారు మాట్లాడుతూ, కోడి పందాలు టెంకాయ ఆటలు వంటి వాటికి దూరంగా ఉండాలని కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు తెలిస్తే అటువంటి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. కోడిపందాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డి.ఎస్.పి గారు సూచించారు. సంక్రాంతి పండుగను సంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా జరుపుకోవాలని, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- 1008 అరటిపండ్ల అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి గోపవరం మండలం వల్లేరా వారి పల్లె గ్రామంలో స్వయంభు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పుష్యమాసం ప్రారంభం మూడవ శనివారం సందర్భంగా హోమం అభిషేక పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామి అమ్మవారు1008 అరటి పండ్లతో ప్రత్యేక అలంకరణ చేశారు. దీంతో వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.1
- VBG- RAMG కొత్త చట్టం ద్వారా తెలంగాణకు ఎంతో మేలు: సంగారెడ్డి లో మీడియాతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి1
- *రాబోయే రోజుల్లో డబ్బు తీసుకొని ఓటు వేయకపోతే ఓడిన అభ్యర్థులు ఇలాగే చేస్తారేమో. ఆలోచనాత్మక వీడియో*1
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ యోగి వేమన జయంతి రాష్ట్ర పండుగల చేయాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు వీటిలో భాగంగానే ఎంపీడీవో ఎమ్మార్వో అధికారులు జయంతి ఏర్పాట్లను శనివారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. జనవరి 19వ తేదీన వేమన జయంతి నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.1
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా నిలిచిన సీఎంచంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ , గత అరాచక వైచిపి పాలనలో కోవిడ్ సమయంలో వైద్యులకు సంబంధించి వారికి కావలసిన రక్షణ పరికరాలు అందించాలని అడిగిన పాపానికి దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్ ను ఎంతో దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి మండుటెండలో నడి రోడ్డుపై దొర్లించి ఆయన మరణానికి కారణమైన సైకో జగన్ అకృత్యానికి బలైన సుధాకర్ కుటుంబంలో కుమారుడు లలిత్ ప్రసాద్ కు డిప్యూటీ తహసిల్దార్ గా పదోన్నతి కల్పించటం తో పాటు ,కోటి రూపాయలు కుటుంబానికి అందించడం కోసం నిర్ణయం తీసుకోవడం ఎంతో హర్షించ తగ్గ విషయమని,అలాగే తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం కల్పించడం, అలాగే సైకో ప్రభుత్వంలో ఉద్యోగం కోల్పోయిన ఎ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కు ఉద్యోగవకాశం కల్పించడం పట్ల , టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ బాబు గారికి బాధితుల పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తుందని కాబట్టి దళిత, బడుగు ,బలహీనవర్గ సామాజిక వర్గాలు ఎప్పుడు టిడిపికి వెన్ను దన్నుగా ఉండాలని, ఉంటామని కూడా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మీడియా కోఆర్డినేటర్ కేశగాళ్ల శ్రీనివాసులు, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రామాంజినేయులు,బుక్కపట్నం శ్రీనివాసులు, నారాయణస్వామి, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు1
- సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న అధికారులు1
- *కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్...* *బస్టాండ్ లో చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు ఆధ్వర్యంలో పోలీసుల అవగాహన* *విశాలంగా మారిన బస్టాండ్ ప్రాంగణం *ట్రాఫిక్ పోలీసులతో* కలిసి స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న *కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ కమిటీల సమాఖ్య CCS ప్రతినిధులు.* ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, మధు, పోలీస్ సిబ్బంది, కాలనీ కమిటీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లిపద్మా రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, నాగార్జున నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు యావపురం రవి, వెంకులు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.2