రైలు ఏసీ బోగీ వాష్ రూంలో జడ్జి భార్య శవం..!!తెలియకుండా రైలు దిగేసిన జడ్జి. రైలు ఏసీ బోగీ వాష్ రూంలో జడ్జి భార్య శవం..!! తెలియకుండా రైలు దిగేసిన జడ్జి. 150 కిలోమీటర్ల దూరంలో తలుపులు పగులకొట్టి తీసిన రైల్వే పోలీసులు.. రాజస్థాన్ కు చెందిన అడిషనల్ జడ్జి రాజ్ కుమార్ చౌహాన్ తన భార్య ఉషతో కలిసి కాచిగూడ, బగత్ కీ కోటి ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు. ఇద్దరికీ విడివిడిగా బెర్త్ లు వచ్చాయి. నిమ్బెహర అనే స్టేషన్ లో దిగాల్సింది. ట్రైన్ ఆగేముందు ఆమె వాష్ రూమ్ కి వెళుతున్నానని చెప్పి వెళ్ళింది. జడ్జి లగేజీతో దిగేసాడు. భార్య తన కంటే ముందే దిగిందని చూసాడు. ట్రైన్ కదిలి పోయింది. స్టేషన్లో కాసేపు చూసిన తరువాత పోలీసులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించి ఆమె రైలు దిగలేదని నిర్ధారించుకున్నారు. దీంతో అవతల స్టేషన్ లకు సమాచారం ఇచ్చారు. 150 కిలోమీటర్ల దూరంలోని జవోర స్టేషన్లో ట్రైన్ ఆపి వాష్ రూం తలుపు పగులకొట్టి చూస్తే ఆమె అచేతనంగా ఉంది. హాస్పిటల్ కి తరలిస్తే, గుండె పోటు అని తేల్చారు.. విధి ఎంత క్రూరమైందో చూడండి.. ఒకే బోగీలో భార్యాభర్తలు ప్రయాణం చేస్తుంటే భార్య చనిపోయిన సంగతి తెలియక భర్త దిగేసాడు.. అప్పటికే ఆమె చనిపోయి ఉంది.. జీవిత ప్రయాణం, రైలు ప్రయాణంలో ఇలా విషాదంగా ముగిసింది..!!

- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.1
- Post by Gift maker1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ మేయర్ గణేష్ నగరంలోని 35, 44వ డివిజన్ల పరిధిలో విస్తృతంగా పర్యటించారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతాల్లో మేయర్ పర్యటించి, స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మేడికుంట చెరువు కబ్జాకు గురవుతోందని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. చెరువు పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దీనిపై స్పందించిన మేయర్ గణేష్, మేడికుంట చెరువును పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిసరాలను వెంటనే శుభ్రం చేయాలని, ఆక్రమణలను అడ్డుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మేయర్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో మేయర్ వెంట సిపిఐ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిపిఐ నాయకులు మరియు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.1
- తాను మాట్లాడుతున్న సందర్భంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ ను అంకుల్ అంటూ సంబోధించిన బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ తేజస్విని...* *ఎమ్మెల్యే ను సభలో అంకుల్ అంటారా..!! రిలేషన్ ఉంటే బయట ఇక్కడ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు...* *నేను అంత తప్పేం మాట్లాడానంటూ ప్రతివాదనకు దిగిన కౌన్సిలర్ తేజస్విని, మద్దతుగా గొంతుకలిపిన బిఆర్ఎస్ కౌన్సిలర్ లు...* సభ్యుల అరుపులతో రసాభాస.., వేడి పుట్టించిన "అంకుల్" సంబోధన..!!* పరిస్థితి మరింత గోల..గోలగా మారకుండా..!! ఇరువర్గాలకు సర్దిచెప్పి కూర్చోబెట్టిన సిపిఐ మున్సిపల్ ప్లోర్ లీడర్ అజయ్ సారధి....*1
- पेट्रोल पंप पर बिजली का झटका लगने से दो लोगों की मौत मंचेरियल जिले के दांडेपल्ली मंडल के मेदारीपेट में एक बड़ा हादसा हुआ। सोमवार सुबह एक इंडियन पेट्रोल स्टेशन पर बिजली का झटका लगने से दो लोगों की मौके पर ही मौत हो गई। स्थानीय लोगों के अनुसार, पेट्रोल स्टेशन से एक लंबा लोहे का स्टैंड ले जाते समय मेन लाइन के बिजली के तार स्टैंड से टकराने से दो लोगों की बिजली का झटका लगने से मौत हो गई। मरने वालों की पहचान माधापुर के चल्ला लक्ष्मीनारायण (45) और वेलगानूर के चंदनगिरी नागराजू (40) के रूप में हुई है। दोनों स्थानीय स्तर पर मजदूरी करते हैं। दोनों की मौत से परिवार वाले दुखी हैं। मरने वालों के परिवार वालों ने चिंता जताई है कि यह हादसा बैंक मैनेजमेंट की लापरवाही के कारण हुआ है और उन्होंने मुआवजे की मांग की है। सब-इंस्पेक्टर तहसीनुद्दीन मौके पर पहुंचे, केस दर्ज किया और जानकारी इकट्ठा की।1
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1