భగభగ మండే ఎండలో కొండపల్లి హైవేపై ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని వినాయకుడి గుడి ఎదురుగా ఉన్న కంఫర్ట్ ఫర్నిచర్స్ అధినేత బి. భాస్కర్ రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎండ వేడిమికి తాళలేక అలమటిస్తున్న బాటసారులు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్ల దాహార్తిని తీర్చేందుకు ఆయన మే 29, శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ చొరవను స్థానికులు, వాహనదారులు ప్రశంసిస్తున్నారు. వేసవి తీవ్రత తగ్గేవరకు ప్రతిరోజూ మధ్యాహ్నం వేళ హైవేపై వెళ్లే ప్రయాణికులకు మజ్జిగ, చల్లని నీరు అందిస్తామని భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. కష్టపడి జీవించేవారికి కాస్త ఊరట ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం చేసినట్లు ఆయన తెలిపారు. మజ్జిగ తాగి ఉపశమనం పొందిన వాహనదారులు బి. భాస్కర్ రెడ్డి సేవా గుణాన్ని మనసారా అభినందించారు. ఈ ఎండలో ఇంత మంచి పని చేస్తున్నందుకు స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Post by SHOT NEWS1
- తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి, రూరల్ మండలాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కుసుమంచి మండలంలోని గణపేశ్వర ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, అలాగే కొండాపురం నుంచి పొన్నెకల్లు వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సర్పంచులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి, వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని క్యాంపు కార్యాలయం ఇంచార్జ్ కోరారు.1
- తల్లాడ మండల కేంద్రంలో గత 9 రోజులుగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOA) చేస్తున్న దీక్షా శిబిరాన్ని AITUC ఖమ్మం జిల్లా నాయకులు మంకెన కృష్ణ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం VOAల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. VOAలకు నెలకు రూ.26,000 వేతనం, పీఎఫ్ సౌకర్యం, అలాగే రూ.20 లక్షల ప్రమాద బీమా కల్పించాలని మంకెన కృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో మండల VOA అధ్యక్షురాలు సుజాతతో పాటు భానుశ్రీ, కళావతి మరియు ఇతర VOA నాయకులు పాల్గొన్నారు.1
- పని ఒత్తిడి, ఆందోళనల కారణంగా తన ఐటీ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసి, ప్రస్తుతం ఆటో డ్రైవర్‍గా జీవనం సాగిస్తున్న ఓ మహిళ గురించి లేడీ ఎంట్రప్రెన్యూయర్ మిథ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా వెల్లడించారు. మిథ్లాజ్ స్వయంగా ఆ మహిళ ఆటో ఎక్కి ఆమెతో మాట్లాడినప్పుడు ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ఐటీ మేనేజర్‍గా పని చేసిన తర్వాత ఒత్తిడి తట్టుకోలేక ఆ ఉద్యోగం మానేసినట్లు ఆ మహిళ చెప్పినట్లు మిథ్లాజ్ తెలిపారు. ప్రస్తుతం ఆమె నెలకు రూ.60 వేలు సంపాదిస్తున్నారని, అన్నిటికంటే ముఖ్యంగా, ఆటో డ్రైవర్‍గా ఆమె చాలా సంతోషంగా ఉన్నారని వీడియోలో పేర్కొన్నారు. అయితే, ఆ మహిళ ఎక్కడ ఆటో నడుపుతున్నారనే వివరాలను మాత్రం ఆ వీడియోలో చెప్పలేదు.1
- సత్తుపల్లి పట్టణంలోని 18వ వార్డులో ఉన్న డాల్ఫిన్స్ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన స్విమ్మింగ్ పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.2
- కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.1