ఆనందాన్ని పంచిపెట్టడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా రాదు: చీఫ్ విప్ జీవీ జీవితంలో సాటివారికి ఆనందాలను పంచిపెట్టడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా రాదనీ ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. అందుకనే కష్టాల నుంచి సుఖాల వైపు, అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు, అశాంతితో ఉన్నవారికి శాంతి, దుఃఖంలో ఉన్నవారికి ఆనందాన్ని పంచిపెట్టేలా ప్రభు సందేశాన్ని విస్తృతం చేసే వారిని ఎప్పుడూ అభినందిస్తానన్నారు . వినుకొండ వెల్లటూరు రోడ్డులోని ఎంపీసీ ఫంక్షన్ హాల్లో రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సమైక్య క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. దైవ ప్రసంగీకులు హాజరై క్రీస్తు సందేశమిచ్చారు. పలువురు క్రైస్తవ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు అందరికీ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మాట్లాడిన చీఫ్ విప్ జీవీ దేవుడి సేవలో గడపడం, ప్రజలకు క్రీస్తు బోధనల సందేశం చెప్పడంలో ఉండే మంచి అనుభూతిని మాటలతో వర్ణించలేమన్నారు. క్రిస్మస్ పండగను అంతా ఘనంగా జరుపుకోవాలని, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని, ప్రభువు అందరినీ దీవించి మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అలానే అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం తరఫున పింఛన్లు అందిస్తామని తెలిపారు. ఇళ్లు లేని పేదలందరికీ ఏడాదికి కొంతమం ది చొప్పున ఇళ్లు ఇస్తూ ముందుకెళ్తామని చెప్పారు. క్రైస్తవులు, పాస్టర్లూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులేనని, మొన్న జరిగిన ఎన్నికల్లో తనను గెలిపించడంలో చాలాపాత్ర వారికి ఉందన్నారు. ఆ విషయాన్ని జీవితాంతం తాను గుర్తుపెట్టుకుంటా అన్నారు. తనతో పాటు తన భార్య కూడా క్రిస్టియన్ పాఠశాలలోనే చదువుకుందని చెప్పారు. భవిష్యత్తులో అర్హత ఉన్న పాస్టర్లు అందరికీ ఇళ్లు ఇచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

- కోనసీమ చప్పిడి చేపల కూర ...👌😋1
- అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ లక్ష్మి నరసింహుని ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు1
- నేను పుట్టాక మొట్టమొదటిసారి ఈ గుడికి వెళ్ళాము కోనసీమ తిరుపతిచాలాబాగుందండి వాడపల్లి అని కూడా అంటారు 🙏1
- కోనసీమ చేపల పులుసు 🔥🐟 how to add konaseema chepala pulusu1
- లెమల్లే గ్రామం అమరావతి పల్నాడు జిల్లా #shorts srinivasasivapresad1
- కోనసీమ లో అగ్ని ప్రమాదం1
- గోపాలం శివ సాగర్ చౌదరి గారు* గోపాల వారి పాలెం గ్రామం పల్నాడు జిల్లా1
- నలుగురు దొంగలు అరెస్ట్.. ఎందుకంటే | Palnadu District | Prime9 News1