రాజ్యసభలో ఖర్గే ఆవేదన, ఆగ్రహం - "నన్ను అంటరానివాడిగా చూస్తున్నారా?" రాజ్యసభలో ఖర్గే ఆవేదన, ఆగ్రహం - "నన్ను అంటరానివాడిగా చూస్తున్నారా?" న్యూఢిల్లీ: రాజ్యసభలో శుక్రవారం ఆవేదన, ఆగ్రహం కలగలిసిన దృశ్యం కనిపించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్ హల్ద్వానీ ఘటనను ప్రస్తావిస్తూ తీవ్రంగా చలించిపోయారు. ఇది నాకు జరిగిన అవమానం కాదు, ఈ దేశ రాజ్యాంగానికి జరిగిన అవమానం" అంటూ ఖర్గే గొంతులో బాధ, కోపం కలగలిసిపోయాయి. ఆగస్టు 8న హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో తాను ప్రసంగించిన వేదికను తాను వెళ్లిన వెంటనే కొందరు దుండగులు గంగాజలంతో "శుద్ధి" చేశారన్న వార్తలను ఆయన సభ ముందు ఉంచారు. నా ప్రసంగం తర్వాత వేదికను శుద్ధి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను అంటరానివాడినా? నా నీడ పడితే మైల పడుతుందా?" అని ఖర్గే ప్రశ్నించిన తీరు సభను ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి నెట్టింది. 80 ఏళ్లు దాటిన నాకు, ఈ దేశ ప్రతిపక్ష నేతగా ఉన్న నాకే ఈ పరిస్థితి ఎదురైతే, ఈ దేశంలో కోట్లాది మంది సామాన్య దళితుల పరిస్థితి ఏమిటి? స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లయినా ఇంకా మనం మనుషులను కులం పేరుతో అపవిత్రంగా చూస్తామా? ఇది ఎంతటి సిగ్గుచేటు!" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత అవమానం కాదని, ఈ దేశంలో ఇంకా బతికే ఉన్న కుల అహంకారానికి, మనువాద వివక్షకు పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై సభలో తీవ్ర వాగ్వాదం చెలరేగింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ, బీజేపీ ఇటువంటి నీచమైన చర్యలను ఎన్నటికీ సమర్థించదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. రాజ్యసభ ఛైర్మన్ కూడా ఈ చర్యను ఖండించారు, ఇది ప్రజాస్వామ్యానికి, మానవత్వానికి మచ్చ అని వ్యాఖ్యానిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంగ్రెస్ వర్గాలు అంటున్నట్లు ఇది ఒక రాజకీయ వివాదం కాదు, మన ఆత్మను ప్రశ్నించుకోవాల్సిన సమయం. రాజ్యాంగం అందరికీ సమానత్వాన్ని ఇచ్చిన దేశంలో, ఒక దళిత నాయకుడు కూర్చున్న కుర్చీని, నిలబడిన వేదికను శుద్ధి చేసే దుర్మార్గపు ఆలోచన ఇంకా ఎలా బతికి ఉంది? రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు, విమర్శలు ఉండొచ్చు. కానీ ఒక మనిషి పుట్టుకను, సామాజిక నేపథ్యాన్ని అవమానించడం ప్రజాస్వామ్య విలువలపై దాడి చేయడమే. ప్రభుత్వం ఇప్పుడు విచారణకు హామీ ఇచ్చింది. నిజానిజాలు తేలాల్సి ఉంది. కానీ ఖర్గే సభలో లేవనెత్తిన ప్రశ్న మాత్రం ప్రతి భారతీయుడిని వెంటాడుతోంది - రాజ్యాంగం సమానత్వం ఇచ్చినా, మన మనసుల్లోని అంటరానితనపు మైల ఎప్పుడు వదులుతుంది?

- అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.1
- నూతన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ జిల్లా వెంకట్రాంరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో సుధాకర్ రెడ్డి,లాలు భాష ఆహ్వానం మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ జిల్లా వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన పెట్రోల్ బంకును ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- ఆరాధన మహోత్సవములు 29, 30, 31 నాడు జరుగును. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ॥ జోగుళాంబ గద్వాల జిల్లా, తెలంగాణ జగద్గురు శ్రీమన్ మధ్వాచార్య మూల మహా సంస్థానము మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారి 355 వ ఆరాధన మహోత్సవములు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి పరమపూజ్య 1008 వ శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీ పాదులవారి ఆజ్ఞానుసారముగా సమస్త భగవద్భక్తులకు ఆహ్వానం. స్థానిక శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠం, షేరేల్లివీధి యందుశ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవములు ఈ నెల 29, 30, 31. తారీకు వరకు విశేషంగా నిర్వహించబడును శ్రీ రాఘవేంద్రస్వామి మఠం|| దుర్వాది ధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే ।శ్రీ రాఘవేంద్ర గురవే నమః అత్యంత దయాలవే ॥. శ్రీ రాఘవేంద్రస్వామి వారు సశరీరముగా బృందావన ప్రవేశము చేసి నేటికి 355 సం||లు అయినది. ఇప్పటికి కూడ భక్తుల సర్వాభీష్టములు తీర్చుతూ భక్తుల పాలిటి కలియుగ కల్పతరువు కామధేనువై విరాజిల్లుచున్నారు. కావున సమస్త భగవద్ భక్తులు శ్రీ స్వామి వారి ఆరాధనా మహోత్సవములందు పాల్గొని తను, మన, ధనములతో సేవలు గావించి తీర్థప్రసాదములు స్వీకరించి, శ్రీ స్వామి విశేషానుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్ధన.శ్రీ శేషదాస మరియు శ్రీ రాఘవేంద్ర భజనమండలీ గద్వాల వారిచే భజన కార్యక్రమములు.తేది 26-08-2026 బుధవారము ఉ॥ 9-00 గం॥లకు ఋగ్వేద నిత్య నూతన ఉపాకర్మతేది 28-08-2026 శుక్రవారము10-00యజుర్వేద నిత్యనూతన ఉపాకర్మసామూహిక శ్రీ సత్యనారాయణస్వామి పూజసా॥ 6-00 గం॥లకుగోపూజ, ధ్వజారోహణం, లక్ష్మీపూజ,ధాన్యపూజ మొ॥నవి జరుగును.తేది 29-08-2026 నుండి 31-08-2026 వరకు జరుగు రోజువారి కార్యక్రమములుఉ॥5-00 గం॥లకు,ఉ 8-00 గంలకు10-30,ఉ॥ 11-00 గం॥లకుఉ॥ 11-30 గం॥లకుమ॥ 12-30 గం॥లకుసుప్రభాతం, నిర్మాల్య విసర్జనంమహా పంచామృత అభిషేకంప్రహ్లాదుల వారి పాదుపూజ, అష్టోత్తర పారాయణం సహితంతులసీ అర్చనఅలంకార సేవహస్తోదకం తీర్థప్రసాదముల వితరణ,29-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము30-08-2026సా|| 7-00 గం||లకు రథోత్సవము31-08-2026 | 09 పురవీధులగుండా ప్రహ్లాదరాయల రధోత్సవ కార్యక్రమము జరుగును.2
- *మధ్యప్రదేశ్:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు...1
- చిన్నకడబూరులో శివాలయ దేవాలయంకు వైభవంగా నూతన ధ్వజస్తంభం మహోత్సవం వేడుకలు పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ఉన్న శ్రీ అంజినేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయ దేవాలయంకు నూతన ధ్వజస్తంభంను బుధవారం వైభవంగా జరిగింది.ఈ నూతన ద్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ధనుర్లగ్న శుభ ముహూర్తమున పండితులు వేద మంత్రాలు పఠిస్తుండంగా ఆలయ ధర్మకర్త గౌళ్ళ నల్లారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఆలయ,గ్రామ పెద్దల సమక్షంలో అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ,కమిటీ పెద్దలు బుధవారం తెలిపారు.ప్రత్యేకంగా హోమం ద్వారా శివాలయ దేవాలయం నందు భ్రమరాంబిక,గణపతి,కుమారస్వామి, విగ్రహాలకు అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలను గౌరవించారు.వేద పండితులు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం కాల్చిన అనంతరం శివాలయ దేవాలయముకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు వచ్చిన భక్తాదులు ప్రత్యేక పూజలు గావించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయులు, మల్లికార్జున,ఆలయ పెద్దలు గౌళ్ళ నల్లారెడ్డి,తయాన్న,నారాయణస్వామి,ముత్తన్న,కోడిగుడ్ల లక్ష్మన్న, వీరారెడ్డి,ఎల్లన్న ,గిడ్డయ్య,సొసైటీ డైరెక్టర్ యం.జి నరసన్న,కోస్గి డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న,బుసిరెడ్డి, జనసేన నాయకులు మహదేవ, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,శివాలయం స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.2
- ବିଜେପି କେତେ ନୀଳଜା ଅଛି1
- ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.1