ఆషాఢ మాసం సందర్భంగా సుంకులమ్మ అమ్మవారికి ఘనంగా సారె సమర్పణ ఆలూరు: సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆలూరులో సుంకులమ్మ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారె సమర్పించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళ ఆంజనేయస్వామి ఆలయం నుంచి కోటవీధిలో వెలసిన సుంకులమ్మ అమ్మవారి ఆలయం వరకు కుమేళాలు, తాళాలు, భక్తి గీతాల మధ్య మహిళలు శోభాయాత్రగా చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం వల్ల కుటుంబాలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం ఉందన్నారు. అలాగే చిన్నారులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సిద్ధేశ్వర స్వామి ప్రసంగిస్తూ మహిళల పాత్ర, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల మహిళా కన్వీనర్ అనంతలక్ష్మి, సహ కన్వీనర్లు లీలావతి, నందిని, గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా సుంకులమ్మ అమ్మవారికి ఘనంగా సారె సమర్పణ ఆలూరు: సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆలూరులో సుంకులమ్మ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారె సమర్పించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళ ఆంజనేయస్వామి ఆలయం నుంచి కోటవీధిలో వెలసిన సుంకులమ్మ అమ్మవారి ఆలయం వరకు కుమేళాలు, తాళాలు, భక్తి గీతాల మధ్య మహిళలు శోభాయాత్రగా చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో అమ్మవారికి సారె సమర్పించడం వల్ల కుటుంబాలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం ఉందన్నారు. అలాగే చిన్నారులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిచయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సిద్ధేశ్వర స్వామి ప్రసంగిస్తూ మహిళల పాత్ర, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ మండల మహిళా కన్వీనర్ అనంతలక్ష్మి, సహ కన్వీనర్లు లీలావతి, నందిని, గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- రాయదుర్గం నియోజకవర్గంలో 29,764 ఓట్లు తొలగింపు... అభ్యంతరాలు ఉంటే మరోసారి దరఖాస్తు చేసుకోండి రాయదుర్గంలో 29,764 ఓట్ల తొలగింపు రాయదుర్గం నియోజకవర్గంలో 29,764 ఓట్లు తొలగించేందుకు డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో ప్రతిపాదించారు. జాబితాలో మెత్తం 2,36,579 ఓట్లు ఉండగా పురుష ఓటర్లు 1,17,518 కాగా మహిళా ఓటర్లు 1,19,019 ఉన్నాయి. ఇతరులు 42 మంది ఉన్నారు. వివరాలను ERO రవిశంకర్ రెడ్డి శుక్రవారం వెల్లడించారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో తప్పులు, సవరణలు, అభ్యంతరాలపై నెల రోజుల్లోపు సంబంధిత BLOలకు పిర్యాదు చేయవచ్చన్నారు.1
- జూరాలకు భారీ వరద.. 17 గేట్లు ఎత్తివేత దిగినన్న శ్రీశైలం ప్రాజెక్టు విడుదల గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 1,04,375 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 17 గేట్లను ఎత్తి 67,235 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 317.59 మీటర్లు (1,041.962 అడుగులు) గా నమోదైంది. ప్రాజెక్టు స్థూల సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.817 టీఎంసీల నీటి నిల్వ ఉంది. లైవ్ స్టోరేజ్ 4.11 టీఎంసీలుగా నమోదైంది. జూరాల జలవిద్యుత్ కేంద్రం ద్వారా 37,906 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్–1కు 1,300, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కులు, ఎల్‌ఎంసీకి 870, ఆర్‌ఎంసీకి 500, ప్యారలల్ కెనాల్‌కు 600, భీమా లిఫ్ట్–2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి 1,09,519 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.1
- నంద్యాలలో దస్తావేజు లేఖరుల సమ్మెకు తాత్కాలిక విరామం : దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం చేపట్టిన పెన్‌డౌన్ సమ్మె శుక్రవారంతో 12వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖరులు సమ్మెలో పాల్గొన్నారు. జీఓ ఎంఎస్ నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జూలై 31న తాత్కాలిక విరామం ప్రకటించినట్లు సంఘం నాయకులు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వల్ల ప్రజల ఆస్తుల భద్రతతో పాటు దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని, జీఓ ఎంఎస్ నెం.396పై న్యాయస్థానాన్ని కూడా2
- నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న స్తంభాలు తొలగించాలి నందికొట్కూరులో శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్తంభాలు తొలగించాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు వార్డులలో పర్యటించి శిథిలావస్థకు చేరిన స్తంభాలను తొలగించాలన్నారు. వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1
- రణ్బీర్ కపూర్ సాయి పల్లవి నటించిన రామాయణం ట్రైలర్ పై మిశ్రమస్తు స్పందన మొన్న విడుదల చేసిన రామాయణం పార్ట్ వన్ ట్రైలర్ మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు రణబీర్ కపూర్ కన్నా యాష్ యాక్టింగ్ డామినేషన్ చేశాడని రావణాసురుడి పాత్రలలో పలువురు కామెంట్ చేశారు సీత పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోయిందని కొందరు సరిగ్గా సెట్ కాలేదని కొందరుకామెంట్ చేస్తున్నారు టైలర్లో హనుమంతుడు కనిపించకపోవడంతో ట్రైలర్ ఇన్ కంప్లీట్ గా ఉందని విస్మయం చెందుతున్నారు బిఎఫ్ ఎక్స్ మ్యూజిక్ బాగుంది అని అంటున్నారు1
- శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం డిప్యూటీ MRO శ్రీ గస్తీ నారాయణస్వామి గారి ఆత్మీయ పదవీ విరమణ మరియు సన్మాన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సోమల ప్రకాష్ నాయుడు గారు.. సోమల ప్రకాష్ నాయుడు గారు మాట్లాడుతూ డిప్యూటీ MRO నారాయణ స్వామి గారి గురించి ఆయన ముదిగుబ్బ మండలానికి చేసిన మంచి గురించి ప్రజలకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కిసాన్ మోర్చా నాయకులు పసుపులేటి వెంకటేష్ గారు పీవీ శివకుమార్ గారు దేశు నారాయణ గారు ఆర్వేటి గంగప్ప గారు నాగభూషణ గారు జనార్ధన గారు రాములు గారు2
- సీపీ శంఖబ్రత బాగ్చి కీలక చర్యలు..! ప్రధాని పర్యటనకు భారీ భద్రత..! విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. వీఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. మూడు ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు.. అవసరమైన ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు చేపట్టనున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఏఆర్, హోంగార్డ్స్ విభాగాలకు చెందిన పోలీసు సిబ్బందిని భారీగా మోహరించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో గ్రీన్ కారిడార్, వీఐపీ పార్కింగ్, సభా ప్రాంగణ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆగస్టు 1 ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేయనున్నారు. అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి వచ్చే భారీ, గూడ్స్ వాహనాలను విశాఖ నగరంలోకి అనుమతించబోమని పోలీసులు తెలిపారు. సభకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక బస్సు మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సీపీ శంఖబ్రత బాగ్చి విజ్ఞప్తి చేశారు.1
- దేవుడిలా వచ్చి భక్తుణ్ని కాపాడిన జవాన్..జవాన్పై ప్రశంసలు.. గంగా నదిలో కొట్టుకుపోతున్న భక్తుణ్ని జవాన్ ప్రాణాలకు తెగించి రక్షించారు. నోయిడా(UP)కు చెందిన శివభక్తుడు హరిద్వార్లోని కాంగ్రా ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు.గమనించిన SDRF జవాన్ వెంటనే నదిలోకి దూకి అతడిని పట్టుకున్నారు. వరద కిందికి లాక్కెళ్తున్నా ఈదుతూ అతణ్ని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ వీడియోను ఉత్తరాఖండ్ పోలీస్ Xలో షేర్ చేయగా జవాన్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.....1