logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్........ లక్షెట్టిపేట మండలంలోని దౌడపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రాఖి పండుగను ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యార్థినిలు రాఖీలు కట్టారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమని పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న మొక్కలకు కూడా విద్యార్థులు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు వేణుగోపాల్ ,సతీష్ పాల్గొన్నారు

2 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
2 hrs ago
e76b96e7-1295-40f7-9fa4-bdd8f1406684

దౌడేపల్లి ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు రక్షాబంధన్........ లక్షెట్టిపేట మండలంలోని దౌడపల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు రాఖి పండుగను ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు విద్యార్థినిలు రాఖీలు కట్టారు. అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల బంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమని పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న మొక్కలకు కూడా విద్యార్థులు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గిరిధర్, ఉపాధ్యాయులు వేణుగోపాల్ ,సతీష్ పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేటలో బిజెపి నాయకుల ఆందోళన, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్
విద్యార్థుల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ లక్షేట్టిపేట పట్టణంలో బిజెపి నాయకులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా వారు గురువారం పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తా ప్రధాన రహదారిపై ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులకు, పోలీసులకు మధ్య పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోరుట్లలో డా. రఘు టీఆర్ఎస్ నాయకుల ఆందోళన.
    1
    స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కోరుట్లలో డా. రఘు టీఆర్ఎస్ నాయకుల ఆందోళన.
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్‌ వర్మ నాయకత్వంలో ముందడుగు మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్‌ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్‌ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్‌ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
    1
    మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్‌ వర్మ నాయకత్వంలో ముందడుగు
మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్‌ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్‌ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్‌ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Mancherial, Telangana•
    5 hrs ago
  • పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా* * రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా*
* రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి.
ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.
ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు.
ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు.
సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు.
ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    22 hrs ago
  • హలో విద్యార్థి చలో హైదరాబాద్ అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది.. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది.. సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది.. అధ్యక్షులుగా గుడిసె సందీప్ అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..
    1
    హలో విద్యార్థి చలో హైదరాబాద్ 
అక్టోబర్ 6న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయండి..చెంచల నవీన్ మాదిగ 
MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి పిలుపునిచ్చారు
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ  ఆదేశాల మేరకు MSF నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా నేడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఎలగందుల బిక్షపతి మాదిగ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయగా MSF మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కనకం గంగ నరేష్ మాదిగ సమన్వయం చేయడం జరిగింది..
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MSF ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో ఇంచార్జి చెంచల నవీన్ మాదిగ హాజరై మాట్లాడుతూ.. సమాజంలో సబ్బండ వర్గాలకు పోరాటం చేసి సేవలు అందించిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు ఉంది ఆరోగ్యశ్రీ పథకం వృద్ధులు వితంతువుల పెన్షన్ తెల్ల రేషన్ కార్డ్ బియ్యం కోట పెంపు ఇలా చూసుకుంటే ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి జాతీయస్థాయిలో మాదిగ కులానికి పేరు తెచ్చిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న నాయకత్వంలో విద్యార్థి విద్యార్థినిలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరిగింది..
సమావేశం అనంతరం కళాశాల నూతన కమిటీ వేయడం జరిగింది..
అధ్యక్షులుగా గుడిసె సందీప్ 
అధికార ప్రతినిధిగా బడుగు చరణ్ చందర్ ఉపాధ్యక్షులుగా బడుగు సుశాంత్ ప్రధాన కార్యదర్శిగా నౌండ్ల శ్రీనిథ్ సహాయ కార్యదర్శిగా బడుగు హర్షవర్ధన్ కార్యవర్గ సభ్యులుగా 
కే అభినయ్ కార్తీక్ మనీ రామ్ చరణ్ తదితరున ఎన్నుకోవడం జరిగింది..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • Germany is rethinking its place in a rapidly changing world, from defence and energy to its dependence on China and its relationships with Europe and the US. And in that rethink, India is moving from the margins to the centre. Berlin’s “Focus on India” strategy calls India its most important partner in the region. Chancellor Friedrich Merz’s January 2026 visit to India further strengthened this shift, with both sides discussing deeper defence cooperation and joint weapons production. From a strategic partnership to defence manufacturing and a potential mega submarine deal, India and Germany are taking their relationship to a new level. • Watch as German MP and CDU/CSU foreign policy spokesperson Jürgen Hardt sheds light on the growing strategic ties between India and Germany. 🇮🇳🇩🇪
    1
    Germany is rethinking its place in a rapidly changing world, from defence and energy to its dependence on China and its relationships with Europe and the US.
And in that rethink, India is moving from the margins to the centre.
Berlin’s “Focus on India” strategy calls India its most important partner in the region. Chancellor Friedrich Merz’s January 2026 visit to India further strengthened this shift, with both sides discussing deeper defence cooperation and joint weapons production.
From a strategic partnership to defence manufacturing and a potential mega submarine deal, India and Germany are taking their relationship to a new level.
• Watch as German MP and CDU/CSU foreign policy spokesperson Jürgen Hardt sheds light on the growing strategic ties between India and Germany. 🇮🇳🇩🇪
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి... ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కొమరం భీమ్ చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
    1
    ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి...
ADB: రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని కొమరం భీమ్ చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప స్వామి దేవాలయం, పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    1
    ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం
దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 
అనంతరం దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప స్వామి దేవాలయం, పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం  సంతరించుకుంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.