జనగామ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో పీడీఎస్ బియ్యం పట్టివేత నమ్మదగిన సమాచారం మేరకు గురువారం జనగామ జిల్లా పాలకుర్తి ఎస్సై మరియు పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించగా సుమారు 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం రెండు వాహనాల్లో తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు.పట్టుబడిన వాహనాల వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం టీఎస్ 07 యు ఎన్ 5612 – అశోక్ లేలాండ్ వాహనంలో సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను మాలోతు మోహన్, యాదాద్రి భువనగిరి జిల్లా రాజుపేట కు చెందిన మాలోతు మోహన్,టీఎస్ 08 యు బి 9032 వాహనంలో సుమారు 10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంను యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి కి చెందిన భూల్య నామా లు తరలిస్తుండగా అదుపులోకి తీసుకుని బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో ఇరువురు గ్రామస్థుల వద్ద నుంచి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి తరలిస్తున్నట్లు వెల్లడైందని వీరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.

- లారీ బోల్తాపడి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్........... జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తాపడిన సంఘటన చోటుచేసుకుంది.గురువారం జరిగిన ఈ ఆకస్మిక సంఘటనలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పై లారీ పడడంతో పైప్ లైన్ పగిలిపోయినట్లు స్థానికులు తెలిపారు.దీంతో కొడకండ్ల,పెద్దవంగర మండలాల గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వివరించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- మార్పులు ప్రధాన కారణం హిమాలయాల్లో భూతాపం తినడం వల్ల మంచు గడ్డలు వేగంగా కరిగి పెద్ద సరస్సుగా మారుతాయి టిబెట్,నేపాల్ ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన తీవ్రమైన వరదలు మరియు కొండచరియలు విరిగిపడటానికి గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్స్ (GLOFs)తీవ్రమైన మేఘావృత్త వర్షాలు (Cloudbursts)మరియు వాతావరణ మార్పులు (Climate Change)ప్రధాన కారణాలు.* వరదలకు మరియు తీవ్ర వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు *గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ (GLOF):* హిమాలయాల్లో భూతాపం పెరగడం వల్ల మంచు గడ్డలు (Glaciers) వేగంగా కరిగి పెద్ద సరస్సులుగా మారుతున్నాయి. ఈ సరస్సుల గట్లు తీవ్రమైన వర్షాలకు లేదా భూకంపాలకు ఒక్కసారిగా తెగిపోయినప్పుడు 'గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్' జరిగి గియిరోంగ్ పోర్ట్ (Gyirong Port) వంటి సరిహద్దు ప్రాంతాలపైకి సునామీలా బురద వరదలు విరుచుకుపడతాయి. *గ్లోబల్ వార్మింగ్ (భూతాపం పెరగడం):*ప్రపంచ సగటు ఉష్ణోగ్రతల కంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల వాతావరణంలో తేమను పట్టి ఉంచే సామర్థ్యం పెరిగి,అనుకోని సమయంలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. *వర్షాకాలంలో మార్పులు :* అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో భారీ వర్షం ప1
- సోదరభావానికి, ఆధ్యాత్మిక రక్షణకు ప్రతీక రాఖీ పండుగ: ఎమ్మెల్యే కడియం శ్రీహరి పవిత్రమైన రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మకుమారీల ప్రతినిధులు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీ సోదరీమణులు ఆయనకు మిఠాయిలు తినిపించి, ఈశ్వరీయ ఆశీస్సులు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్ల అనురాగానికి సూచిక మాత్రమే కాదు, సమాజంలో సోదరభావాన్ని, పరస్పర రక్షణ భావనను పెంపొందించే అత్యంత పవిత్రమైన పండుగని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు రక్షణగా నిలవాలని, ప్రేమాభిమానాలతో జీవించాలని ఈ పండుగ మనకు సందేశాన్నిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేకంగా కొనియాడారు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో, మానసిక ప్రశాంతతను అందించడంలో బ్రహ్మకుమారీ సంస్థ పాత్ర ప్రశంసనీయమని తెలిపారు. మానవత్వ విలువలు, శాంతి, సద్భావన వ్యాప్తికి ఈ సంస్థ చేస్తున్న కృషి సమాజానికి ఎంతో అవసరం అని వెల్లడించారు. తన వద్దకు వచ్చి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీ ప్రతినిధులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.2
- గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.1
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ప్రేమ వ్యవహారంలో విచారణ పేరుతో ఎస్సై శ్రీనివాసరావు అవంచకు చెందిన మహేందర్‌ను తీవ్రంగా కొట్టాడని ఆరోపణలు వచ్చాయి. దాహంగా ఉందని నీళ్లు అడిగిన బాధితుడిపై ఎస్సై మూత్ర విసర్జన చేశాడని మహేందర్ ఆరోపించాడు. ఈ ఘటనపై బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. నాగర్‌కర్నూల్ సీఐ అశోక్ రెడ్డికి డీఎస్పీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు.1
- రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రసాభస...కాంగ్రెస్ బిజేపి కార్యకర్తలు మద్య తోపులాట ఉద్రిక్తత రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కాంగ్రెస్ బిజెపి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి రసాభాసగా మారింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోడీ ఫోటో లేదని బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను నిలదీశారు. దీంతో బిజెపి పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలు బిజేపి నాయకుల్ని నిలదీశారు. దీంతో కాంగ్రెస్ బిజెపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరుపార్టీల నాయకుల తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.4