కట్టుబడిపాలెంగ్రామానికి కి చెందిన ప్రముఖ ఇంద్రజాలకులు"రాంజీ"కి అక్కినేని పురస్కారం...... బుచ్చిరెడ్డిపాలెం మండలం కట్టుబడిపాలెం గ్రామం కి చెందిన ప్రముఖ ఇంద్రజాలకులు, కళాకారులు గంజి రాంజీ అక్కినేని పురస్కారానికి ఎంపికయ్యారు. రసమయి సాంస్కృతిక సాహితీ సంస్థ 59వ వార్షికోత్సవం, ప్రముఖ నటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు 102 వ జయంతోత్సవం సందర్భంగా19 వ తేదీ శనివారం హైదరాబాద్ త్యాగరాయగాన సభలో జరిగే కార్యక్రమంలో ఆయనకు హిమాచల ప్రదేశ్ పూర్వ గవర్నర్ కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు ప్రముఖులు ఆయనకు అందజేయనున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కట్టుబడిపాలెంలో జన్మించిన గంజి రాంజీ వందలాది ఇంద్రజాల ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో రికార్డ్స్, అవార్డ్స్ అందుకున్నారు. గంజి రాంజీకి అక్కినేని పురస్కారం దక్కడం అభినందనీయమని, జిల్లా నుండి ఆయన ఒక్కరే ఎంపిక కావడం పట్ల ఆయన సన్నిహితులు,శ్రేయోభిలాషులు, బంధువులు ఆనంద వ్యక్తం చేశారు.
కట్టుబడిపాలెంగ్రామానికి కి చెందిన ప్రముఖ ఇంద్రజాలకులు"రాంజీ"కి అక్కినేని పురస్కారం...... బుచ్చిరెడ్డిపాలెం మండలం కట్టుబడిపాలెం గ్రామం కి చెందిన ప్రముఖ ఇంద్రజాలకులు, కళాకారులు గంజి రాంజీ అక్కినేని పురస్కారానికి ఎంపికయ్యారు. రసమయి సాంస్కృతిక సాహితీ సంస్థ 59వ వార్షికోత్సవం, ప్రముఖ నటులు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు 102 వ జయంతోత్సవం సందర్భంగా19 వ తేదీ శనివారం హైదరాబాద్ త్యాగరాయగాన సభలో జరిగే కార్యక్రమంలో ఆయనకు హిమాచల
ప్రదేశ్ పూర్వ గవర్నర్ కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు ప్రముఖులు ఆయనకు అందజేయనున్నారు. బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కట్టుబడిపాలెంలో జన్మించిన గంజి రాంజీ వందలాది ఇంద్రజాల ప్రదర్శనలు, కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో రికార్డ్స్, అవార్డ్స్ అందుకున్నారు. గంజి రాంజీకి అక్కినేని పురస్కారం దక్కడం అభినందనీయమని, జిల్లా నుండి ఆయన ఒక్కరే ఎంపిక కావడం పట్ల ఆయన సన్నిహితులు,శ్రేయోభిలాషులు, బంధువులు ఆనంద వ్యక్తం చేశారు.
- కృష్ణా జలాలతో నిండిపోయిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాలు నిండిపోయాయి. అధికారులు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించిన విషయం తెలిసినదే. దీంతో మునిగిపోయిన తమ గ్రామాలను చూడడానికి నిర్వాసితులు ఆసక్తి కనపరిచారు.1
- కలికిరి మండలంలో కోలాహలంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు దండాలయ్య ఉండ్రాళ్లయ్య సాంగ్ కు అందరినీ ఆకట్టుకున్న కళాకారుల నృత్యం కలికిరి నేస్తం న్యూస్..కలికిరి:16సెప్టెంబర్2026:కలికిరి మండలం కలికిరి పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కోలాహలంగా జరిగాయి. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలకు మూడు రోజుల ప్రత్యేక పూజలు అనంతరం బుధవారం సాయంత్రం నుంచి డి జే లు కోలాటాల మధ్య ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించి అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇదిలా ఉండగా కలికిరి మండలం కలికిరి పట్టణం రాజువారి పల్లి లో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అధిరోహించి దేవుని డిజె పాటలతో కళాకారుల నృత్యాలు మధ్య కలికిరి పట్టణంలో ఊరేగింపు అనంతరం వినాయక నిమజ్జనం చేశారు. అయితే రాజువారిపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంతో పాటు వారు ఏర్పాటు చేసిన కళాకారుల నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వినాయక నిమజ్జనం, ఊరేగింపు కార్యక్రమాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ ఎస్.అనిల్ కుమార్ బందోబస్తు నిర్వహించారు. ఈ బందోబస్తు కార్యక్రమంలో ఎస్ఐ రహీం, ఏఎస్ఐ నరసింహులు, హెడ్ కానిస్టేబుల్ రామచంద్ర, కానిస్టేబుల్ విజయ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా పుంగనూరులో అన్నదాన కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా గురువారం పుంగనూరు పట్టణంలోని గోకుల్ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం మరియు మిఠాయిల పంపిణీ చేశారు. అనంతరం పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 25 సంవత్సరాల నిరంతర రాజకీయ జీవితంలో అనేక మార్పులు చూసామని. ప్రపంచ స్థాయిలో భారత్ ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా మోడీ నిరంతర కృషి చూశారన్నారు. నేటి సాయంకాలం ఏడు గంటలకు పుంగనూరు పట్టణంలోని కోనేరు వద్ద ఆశీర్వాద దీపం పేరుతో దీపం వెలిగిస్తున్నట్లు అలాగే ప్రజలందరూ కూడా మోడీ పేరుతో ఒక దీపం వెలిగించాలని ఆ దేవదేవుడు ఆయనకి ఆశీర్వాదం ఇవ్వాలని తెలిపారు2
- ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుడికి దీపాల హారతులు వేంపల్లెలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా బుధవారం వినాయకుడికి సాంప్రదాయ దుస్తులతో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల దీపాల హారతులు ఇచ్చారు. పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో 32 రకాల దీపాల హారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.1
- పుంగనూరు నియోజకవర్గ జనసేనా పార్టీ – కీలక సమావేశం సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) అన్నమయ్య జిల్లా. పుంగనూరు. పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి కీలక సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పార్టీలో ప్రస్తుత పరిస్థితులపై చర్చ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ కూటమి పార్టీలతో సమన్వయం జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, జనసైనికులకు ప్రాధాన్యత కల్పించే అంశాలపై చర్చించారు పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మండల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జావిద్ భాష జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ ఆవుల చైతన్య పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్ రూరల్ అధ్యక్షులు విరూపాక్ష చౌడేపల్లి మండల నాయకులు చరణ్ రాయల్, మురళి, కాలేషా సోమల మండల అధ్యక్షులు నాగభూషణ్, సదువు మండల నాయకులు శ్రీకాంత్, ఆనంద్ రొంపిచర్ల మండల అధ్యక్షులు రెడ్డి శేఖర్ , మరియు నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు జై జనసేన! జై హింద్! ఇట్లు, సిరివేలు గంగాధర్ (చిన్నా రాయల్) ఇంచార్జి, పుంగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ2
- పుంగనూరులో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించిన బిజెపి నాయకులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదినం సందర్భంగా పుంగనూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీశ్ రాజు,సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులతో కలసి ఎన్టీఆర్ సర్కిల్ నందు బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు పంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు మాట్లాడుతూ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ ‘సేవా సంకల్ప్ అభయాన్’ పేరుతో నెల రోజుల పాటు సాగే భారీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు,'ఆశీర్వాద్ కా దియా' ప్రమిదల వెలిగింపు, వడ్ నగర్ నుంచి వారణాసి వరకు బైక్ ర్యాలీతో పాటు పూరీ బీచ్లో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ 2,500 ప్రమిదలతో తీర్చిదిద్దిన అద్భుత ఇసుక శిల్పం ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని,దేశ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని,బీజేపీ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ప్రజలందరూ ఆయనను ఆశీర్వాదించాలని కోరారు. అలాగే ఈరోజు సాయంత్రం పట్టణ కూడలి లో మరియు మీ ఇంటి వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవుని వద్ద దీపాలు వెలిగించి ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థించాలని కోరారు. జన్మదిన వేడుకలలో బిజెపి సీనియర్ నాయకులు టీవీఎస్ ప్రసాద్, పెద్ద మఠం బాబు, చంద్రశేఖర్ రాజు, రాజా జెట్టి,సతీష్, వెంకటేష్, న్యాయవాదులు మహేష్, ప్రసాద్,నిరంజన్ రాజు, శివయ్య, శివ,సుబ్రహ్మణ్యం, దివాకర్, గిరి,రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.4
- ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు.... అక్టోబర్ 17 వరకు సేవా కార్యక్రమాలు. బుచ్చిరెడ్డిపాళెం లో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని కనకదుర్గమ్మ దేవాలయంలో ఆయన పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. అలాగే కొట్టాల గ్రామంలోని శ్రీకృష్ణ సేవా ట్రస్ట్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లను పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించిన నాయకులు, ఆయన ఆయురారోగ్యాలతో దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 17వ తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంజాం ప్రసాద్, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు ముక్కు రాధాకృష్ణ, మాజీ మండల అధ్యక్షుడు గండి రఘురామయ్య, మాజీ ఎంపీపీ డాక్టర్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- పొదిలి మెయిన్ రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థం, స్థానికుడు ఇబ్బందులు పొదిలి మెయిన్ రోడ్డు లో డ్రైనేజీ చెత్తాచెదారంతో నిండిపోయి మురుగునీరు ప్రవాహం ఆగిపోయింది. దీంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో అధికారుల ఆదేశాలతో పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీ కాలువలోని చెత్తాచెదారాన్ని తొలగించారు. మురుగు నీరు వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో సమస్య పరిష్కారమైంది.1
- 22 అడుగుల ఎత్తు గల వినాయక విగ్రహం రేపల్లె ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో ఏర్పడిన గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి ప్రాంగణంలో గత 22 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 14 నుండి ప్రారంభమైన గణేష్ మహోత్సవాలు 7 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య యువత అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు లలిత సహస్రనామ పారాయణం సంపత్ గణపతి గానామృతం సౌందర్యలహరి పారాయణం పంచ హారతులు తీర్థప్రసాదాలు వినియోగము జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, 20వ తేదీ అన్న ప్రసాద వితరణ స్వామి వారి లడ్డు వేలం పాట సాయంత్రం 4 గంటలకు వినాయక నిమర్జనం ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కేరళ వారిచే అందకాసురుడు, రోబోటిక్ ప్రోగ్రాం, సరస్వతీ నాదస్వర బృందం, పామరు వారిచే క్లాసికల్ సన్నాయి మేళం లతో గణేష్ నిమజ్జనాన్ని రేపల్లె పెనుమూడి కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.2