Shuru
Apke Nagar Ki App…
గ్రామదేవతల పండుగల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామదేవతల పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కట్టంగూర్ మండలం సోమవారిగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కట్టంగూర్ మండలం మల్లారం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నకిరేకల్ పట్టణంలోని 17వ వార్డు ఎస్సీ కాలనీలో నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగకు హాజరై అమ్మవారిని దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలతో కలిసి పండుగ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Nagesh Kothapalli
గ్రామదేవతల పండుగల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామదేవతల పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కట్టంగూర్ మండలం సోమవారిగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కట్టంగూర్ మండలం మల్లారం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే నకిరేకల్ పట్టణంలోని 17వ వార్డు ఎస్సీ కాలనీలో నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగకు హాజరై అమ్మవారిని దర్శించుకుని ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రజలతో కలిసి పండుగ కార్యక్రమాల్లో పాల్గొని, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నియోజకవర్గం: నార్కెట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి మారయ్య గారి కుమారుడి వివాహ వేడుకకు నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన జక్కంపూడి సత్యనారాయణ గారి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నార్కెట్‌పల్లి పట్టణానికి చెందిన బైరగొని రవి గౌడ్ గారి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చిరుమర్తి లింగయ్య గారు ఆకాంక్షించారు.4
- చౌటుప్పల్ లో భారీగా నిలిచిన ట్రాఫిక్.. వాహనదారుల ఇబ్బందులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల పొడవున నిలిచిన వాహనాలు, మధ్యలోనే ఇరుక్కుపోయిన రెండు అంబులెన్సులు .. అంబులెన్సులు కు సైతం దొరకని దారి. ..1
- *చేతులు లేకపోతేనేం.. అన్నపై ప్రేమ ఉందిగా!* *- అందరినీ ఆకర్షిస్తున్న వీడియో. *సూర్యాపేట సిటీ ఆగస్టు 26: అన్నాచెల్లెళ్ల ప్రేమకు అవధులు ఉండవు. తోబుట్టువుల మధ్య ఉండే పవిత్ర బంధం అమూల్యమైనది. ఆ ఆప్యాయతను గుర్తుచేస్తూ ఓ చిట్టితల్లి అన్నపై చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోదరుడికి రాఖీ కట్టాలనే తపన ముందు ఆమె అంగవైకల్యం ఓడిపోయింది. చేతులు లేకపోయినా రాఖీ కట్టడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఆపై కాలితోనే అతనికి బొట్టు పెట్టి, స్వీట్ తినిపించింది. అన్న ఇచ్చిన డబ్బు తీసుకొని ఆశీర్వాదం అందుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1
- భక్తి బావంతో ఘనంగా బోనం ఎత్తి మొక్కులు సమర్పించిన మరిపెడ మహిళలు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో భక్తి బావంతో మహిళలు ఘనంగా బోనాల పండుగను జరుపుకున్నారు.. పసుపు, కుంకుమ, బియ్యం లతో బోనాన్ని వండి మహిళలు తలపై మోస్తూ ముత్యాలమ్మ తల్లి కి సమర్పించేందుకు బయలు దేరి ఆటపాటలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు..2
- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- గ్రానెట్ లారీ బోల్తా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం చెరువు మూలమలుపు వద్ద గ్రానెట్ లారీ బోల్తా పడటంతో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ డ్యామేజ్ కావడం వలన కొడకండ్ల పెద్దవంగర మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో గ్రామ పంచాయతీలు గ్రామ ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.1
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హౌస్ అరెస్ట్ వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసనలు తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు గురువారం వరంగల్ కి వెళ్తున్న హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.1