logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

🚩 *మిత్రులకు జైశ్రీరామ్*🚩 *ఈనెల 27వ తేదీన జరగనున్న గో సంరక్షణ, గోవును జాతీయ జంతువు గుర్తించాలని, గో వధ నిరోధ చట్టాలు తేవాలని కోరుతూ జరగనున్న కార్యక్రమానికి గాను బాన్సువాడ గౌరవ శ్రీ సబ్ కలెక్టర్ గారిని కలసి ముందస్తు పర్మిషన్ కొరకు నిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది.*

2 hrs ago
user_Vishwamber Rao
Vishwamber Rao
Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
2 hrs ago
d8129ea1-5e4d-4e49-b7a8-59a14dd3a03e

🚩 *మిత్రులకు జైశ్రీరామ్*🚩 *ఈనెల 27వ తేదీన జరగనున్న గో సంరక్షణ, గోవును జాతీయ జంతువు గుర్తించాలని, గో వధ నిరోధ చట్టాలు తేవాలని కోరుతూ జరగనున్న కార్యక్రమానికి గాను బాన్సువాడ గౌరవ శ్రీ సబ్ కలెక్టర్ గారిని కలసి ముందస్తు పర్మిషన్ కొరకు నిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది.*

More news from తెలంగాణ and nearby areas
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.
    1
    కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభలో రెండువర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.ఓ వర్గానికి చెందిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ను అధికారులు వేదిక పై పిలిచి సర్పంచును వేదిక పై పిలవకపోవడంతో అధికారులను సర్పంచ్ ప్రథమ పౌరుని అయిన మాకు ఎందుకు పిలవలేదనీ సర్పంచ్ ధర్మతేజ అధికారులను నిలదీశాడు.అంతలోనే ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది.  ధర్మ తేజ,మండల సర్పంచ్ లు క్రింద నేల పై కూర్చుండి నిరసన తెలిపారు.వారిని పోలీసులు సముదాయించి కుర్చీల్లో కూర్చోపెట్టారు.
    user_Reporter Khaseem
    Reporter Khaseem
    బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • *ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు త్వరితగతిన అట్టి వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుంది పోలీస్ కమిషనర్ వెల్లడి* *జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ* *ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండవలెను* రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న *99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో ట్రాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగముగా నేడు ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు బ్లూ కోర్టు సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్*., గారు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పోలీస్ కమిషనర్ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ గారు తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం , ప్రాథమిక ప్రథమ చికిత్స (First Aid), అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. ప్రతి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) శ్రీ జి.బస్వా రెడ్డి , నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పి శ్రీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , ట్రాఫిక్ సి ఐ శ్రీ ప్రసాద్ , ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ వినోద్ , డాక్టర్ శ్రీ విశాల్ (ఐ.ఎమ్.ఏ ప్రెసిడెంట్ ) , డాక్టర్ రామనేశ్వర్ ( న్యూరాలజిస్ట్ , ( ఐ.ఎమ్.ఏ ట్రెజరీ ), డాక్టర్ శ్రీశైలం (పీడియాట్రెస్ట్) , డాక్టర్ విట్టల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్, మరియు ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
    3
    *ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు త్వరితగతిన అట్టి వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ ఎంతో ఉపయోగపడుతుంది పోలీస్ కమిషనర్ వెల్లడి*
*జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాల నిర్వహణ*
*ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండవలెను*
రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న *99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో* భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో ట్రాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా   అరైవ్  ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగముగా నేడు ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు బ్లూ కోర్టు సిబ్బందికి మరియు ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా  *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్*., గారు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ  “అరైవ్  అలైవ్” కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పోలీస్ కమిషనర్ గారు పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా CPR (Cardiopulmonary Resuscitation) విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ గారు తెలిపారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం , ప్రాథమిక ప్రథమ చికిత్స (First Aid), అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు.
ప్రతి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ గారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్)  శ్రీ జి.బస్వా రెడ్డి , నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పి శ్రీ మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , ట్రాఫిక్ సి ఐ శ్రీ ప్రసాద్ ,  ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీ వినోద్  , డాక్టర్ శ్రీ విశాల్  (ఐ.ఎమ్.ఏ ప్రెసిడెంట్ ) , డాక్టర్ రామనేశ్వర్  ( న్యూరాలజిస్ట్ ,  ( ఐ.ఎమ్.ఏ ట్రెజరీ ),  డాక్టర్ శ్రీశైలం (పీడియాట్రెస్ట్) , డాక్టర్ విట్టల్ ఆనస్తేషియా  స్పెషలిస్ట్, మరియు ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • 15 ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలి కలెక్టర్ ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ సమస్యలను నిర్మూలించాలి ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలి. 15వ ఆర్థిక సంఘం విధుల వినియోగంపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు వర్క్ షాప్ నిర్వహణ గ్రామాల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని.ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం. చాలని. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగం పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో 15 వ ఆర్ధిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించి గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు మోడల్ గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ బిల్డింగ్స్, జిపి బిల్డింగ్స్ లేని గ్రామాలకు నూతన బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ సమన్వయంతో గ్రామ పంచాయతీలో పనులు సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని ,వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలన్నారు. నిధుల వినియోగం లో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించక పోతే ,అక్రమాలు జరిగితే సర్పంచ్ , కార్యదర్శుల పై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. గ్రామాల్లో త్రాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఈ.ఈ మిషన్ భగీరథ ఇంట్రా సంపత్ కుమార్, గ్రిడ్ డి.ఈ నాగభూషణం, డిఎల్పిఓలుసాయి బాబు, తిరుపతి రెడ్డి ,అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    15 ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 
పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలి కలెక్టర్ 
ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరించాలి. 
సమ్మర్ యాక్షన్ ప్లాన్ తో గ్రామాలలో డ్రింకింగ్ వాటర్ 
సమస్యలను నిర్మూలించాలి
ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ సమన్వయంతో గ్రామంలో సుపరిపాలన అందించాలి.
15వ ఆర్థిక సంఘం విధుల వినియోగంపై సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు వర్క్ షాప్ నిర్వహణ
గ్రామాల్లో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి 
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
పంచాయతీరాజ్ చట్టంలో నిబంధనలకు లోబడి గ్రామ పాలన కొనసాగాలని.ప్రతి సర్పంచ్ గ్రామానికి లీడర్ గా వ్యవహరిం. చాలని.  సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామాలలో నీటి ఎద్దడి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు
శుక్రవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగం పై వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో 15 వ ఆర్ధిక సంఘం నిధులు సక్రమంగా వినియోగించి గ్రామా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు మోడల్ గా తీర్చిదిద్దాలని, గ్రామాలలో అన్ని రకాల మౌలిక వసతులపై దృష్టి సారించాలన్నారు, అంగన్వాడీ బిల్డింగ్స్, జిపి బిల్డింగ్స్  లేని గ్రామాలకు నూతన బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకునేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రత్యేక అధికారి, పంచాయతీ సెక్రెటరీ సర్పంచ్ సమన్వయంతో గ్రామ పంచాయతీలో పనులు సవ్యంగా నడవాలన్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని 15 ఆర్ధిక సంఘం నిధులను అన్ని గ్రామాలకు ప్రభుత్వం అందించిందని ,వాటితో గ్రామాల్లో సమస్యలు లేకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో   పని చేయాలన్నారు. నిధుల వినియోగం లో అక్రమాలకు తావులేదన్నారు. నిధులు సక్రమంగా వినియోగించక పోతే ,అక్రమాలు జరిగితే సర్పంచ్ , కార్యదర్శుల పై చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. 
గ్రామాల్లో త్రాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఈ.ఈ మిషన్ భగీరథ ఇంట్రా సంపత్ కుమార్, గ్రిడ్ డి.ఈ నాగభూషణం, డిఎల్పిఓలుసాయి బాబు, తిరుపతి రెడ్డి ,అధికారులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Boke saikumar Boke saikumar
    1
    Post by Boke saikumar Boke saikumar
    user_Boke saikumar Boke saikumar
    Boke saikumar Boke saikumar
    Security Guard Sirikonda, Nizamabad•
    5 hrs ago
  • Post by Congress social media work
    1
    Post by Congress social media work
    user_Congress social media work
    Congress social media work
    మునిపల్లి, సంగారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • హుగ్గేల్లి చౌరస్తాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జహీరాబాద్ పోలీసులు
    1
    హుగ్గేల్లి చౌరస్తాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జహీరాబాద్ పోలీసులు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    32 min ago
  • సి ఐటీయుచొరవ కార్మికుల ఐక్యత తో మెరుగైన వేతన ఒప్పందం.... సిఐటియు చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు.మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందం పై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వద్ద శుక్రవారం నాడు సంతకాలు పూర్తి అయిన సందర్భంగా ఏ.మల్లేశం మాట్లాడినారు.కార్మికుల వేతన ఒప్పందం గడువు 2026 మార్చి 31 తో పూర్తి కాగా ఏప్రిల్ నెలలో యాజమాన్యం తో ఏప్రిల్ 12 వ తేదీన వేతన ఒప్పందం పై చర్చలు జరిగినాయన్నారు.ఆ ఒప్పందం ప్రకారం కార్మికులకు నెలకు గరిష్టంగా 7080 రూపాయలు, కనిష్టంగా 6000 రూపాయల వేతనం పెంపుదల, నెలకు 30 రూపాయల సర్వీస్ వెయిటేజ్, 1982 సిరీస్ ప్రకారం వి.డి. ఏ 7 రూపాయల నుండి 8 రూపాయలకు పెంపుదల, ముగ్గురు క్యాజువల్ కార్మికులను పెర్మనెంట్ చేయడం కోసం ఒప్పందం కుదిరిందన్నారు.జిల్లా లో చాలా పరిశ్రమల్లో నెలల తరబడి చర్చలు జరిగే సాంప్రదాయం ఉండగా CITU ఒకే దఫా చర్చలు చేసి ఒప్పందం చేయడం జిల్లాలోనే రికార్డు అన్నారు.ఇది కేవలం CITU నిజాయితీ,కార్మికుల ఐక్యమత్యం తోనే సాధ్యం అయిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక వైపు 12 గం.ల పని విధానం,ఉన్న కార్మికుల్నే కాంట్రాక్ట్ కార్మికులు గా మారుస్తుంటే ఉన్న క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేసే చరిత్ర CITU దే అని ఏ.మల్లేశం అన్నారు.జిల్లాలో అనేక పరిశ్రమల్లో ఎప్పుడో నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఇ.ఎస్. ఐ, పి.ఎఫ్, బోనస్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఏ.మల్లేశం అన్నారు.కేంద్రం ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మరింత రెచ్చి పోయి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.హక్కుల కోసం యూనియన్స్ ఏర్పాటు చేసుకుని పోరాడటమే అంతిమ పరిష్కారం అని అన్నారు.పోరాడే కార్మికులకు CiTU పూర్తి అండగా నిలుస్తుందని అన్నారు.వేతన ఒప్పందం పై యజమ్యం తరపున పరిశ్రమ పార్టనర్ దక్షిత్ మోర్, ప్రతినిధి ఆదర్శ్, నియాపోలి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU తరపున CITU జిల్లా కార్యదర్శి ఆ యూనియన్ అధ్యక్షులు ఏ.మల్లేశం ,ప్రధాన కార్యదర్శి కె.నవీన్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్,సహాయ కార్యదర్శి మహేష్, కోశాధికారి శేఖర్, కార్మిక శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డి సంతకాలు చేశారు. ఐ.డి యాక్ట్ 12(3)ప్రకారం ఈ వేతన ఒప్పందం కాల పరిమితి 2026 ఏప్రిల్ 1 నుండి 2029 మార్చి 31 వరకు ఉంటుందన్నారు.
    1
    సి ఐటీయుచొరవ కార్మికుల ఐక్యత తో మెరుగైన వేతన ఒప్పందం....
సిఐటియు చొరవ కార్మికుల ఐక్యమత్యం ద్వారా మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సిఐటియు  జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు.మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందం పై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి వద్ద శుక్రవారం నాడు సంతకాలు పూర్తి అయిన సందర్భంగా ఏ.మల్లేశం మాట్లాడినారు.కార్మికుల వేతన ఒప్పందం గడువు 2026 మార్చి 31 తో పూర్తి కాగా ఏప్రిల్ నెలలో యాజమాన్యం తో ఏప్రిల్ 12 వ తేదీన వేతన ఒప్పందం పై చర్చలు జరిగినాయన్నారు.ఆ ఒప్పందం ప్రకారం కార్మికులకు నెలకు  గరిష్టంగా 7080 రూపాయలు, కనిష్టంగా 6000 రూపాయల వేతనం పెంపుదల, నెలకు 30 రూపాయల సర్వీస్ వెయిటేజ్, 1982 సిరీస్ ప్రకారం వి.డి. ఏ 7 రూపాయల నుండి 8 రూపాయలకు పెంపుదల, ముగ్గురు క్యాజువల్ కార్మికులను పెర్మనెంట్ చేయడం కోసం ఒప్పందం కుదిరిందన్నారు.జిల్లా లో చాలా పరిశ్రమల్లో నెలల తరబడి చర్చలు జరిగే సాంప్రదాయం ఉండగా CITU ఒకే దఫా చర్చలు చేసి ఒప్పందం చేయడం జిల్లాలోనే రికార్డు అన్నారు.ఇది కేవలం CITU నిజాయితీ,కార్మికుల ఐక్యమత్యం తోనే సాధ్యం అయిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక వైపు 12 గం.ల పని విధానం,ఉన్న కార్మికుల్నే కాంట్రాక్ట్ కార్మికులు గా మారుస్తుంటే ఉన్న క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేసే చరిత్ర CITU దే అని ఏ.మల్లేశం అన్నారు.జిల్లాలో అనేక పరిశ్రమల్లో ఎప్పుడో నిర్ణయించిన కనీస వేతనాలు అమలు చేయకపోవడం, ఇ.ఎస్. ఐ, పి.ఎఫ్, బోనస్ లాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఏ.మల్లేశం అన్నారు.కేంద్రం ప్రభుత్వం పాత చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యాలు మరింత రెచ్చి పోయి కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు.హక్కుల కోసం యూనియన్స్ ఏర్పాటు చేసుకుని పోరాడటమే అంతిమ పరిష్కారం అని అన్నారు.పోరాడే కార్మికులకు CiTU పూర్తి అండగా నిలుస్తుందని అన్నారు.వేతన ఒప్పందం పై యజమ్యం తరపున పరిశ్రమ పార్టనర్ దక్షిత్ మోర్, ప్రతినిధి ఆదర్శ్, నియాపోలి ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ CITU తరపున CITU జిల్లా కార్యదర్శి ఆ యూనియన్ అధ్యక్షులు ఏ.మల్లేశం ,ప్రధాన కార్యదర్శి కె.నవీన్, ఉపాధ్యక్షులు మురళి గౌడ్,సహాయ కార్యదర్శి మహేష్, కోశాధికారి శేఖర్, కార్మిక శాఖ తరపున డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రవీందర్ రెడ్డి సంతకాలు చేశారు. ఐ.డి యాక్ట్ 12(3)ప్రకారం ఈ వేతన ఒప్పందం కాల పరిమితి 2026 ఏప్రిల్ 1 నుండి 2029 మార్చి 31 వరకు ఉంటుందన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.