logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 1,00,000 విరాళం కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి ఆలయ అభివృద్ధికి జోగులాంబ గద్వాల జిల్లా ఐజ వాస్తవ్యులు Dr. విశోక్ శెట్టి ₹ 1,00,000 విరాళంగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు దేవస్థాన సిబ్బంది శ్రీ స్వామివారి శేష వస్త్రములు, లడ్డు ప్రసాదములు మరియు బాండ్ పేపర్ అందజేసి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు జె. ఈరప్ప స్వామి, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

1 hr ago
user_కామవరం సురేష్ రిపోర్టర్
కామవరం సురేష్ రిపోర్టర్
Local News Reporter మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
656bf3f1-bb02-47a5-b6dd-566190218f2e

ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 1,00,000 విరాళం కౌతాళం మండలంలోని ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహ ఈరన్నస్వామి ఆలయ అభివృద్ధికి జోగులాంబ గద్వాల జిల్లా ఐజ వాస్తవ్యులు Dr. విశోక్ శెట్టి ₹ 1,00,000 విరాళంగా గురువారం అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు దేవస్థాన సిబ్బంది శ్రీ స్వామివారి శేష వస్త్రములు, లడ్డు ప్రసాదములు మరియు బాండ్ పేపర్ అందజేసి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు జె. ఈరప్ప స్వామి, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.
    1
    గాజుల పల్లెలో  బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి
రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా   నాలుగు ఎకరాల  పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • తీన్మార్ మల్లన్న సర్జికల్ స్ట్రైక్ లో మేడ్చల్ మల్కాజ్గిరి గురించి ప్రస్తావన
    1
    తీన్మార్ మల్లన్న సర్జికల్ స్ట్రైక్ లో మేడ్చల్ మల్కాజ్గిరి గురించి ప్రస్తావన
    user_బండారు రమేష్ యాదవ్ అడ్వకే
    బండారు రమేష్ యాదవ్ అడ్వకే
    Lawyer శేరిలింగంపల్లి, రంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........ ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
    1
    శ్రీశైలం విషాద ఘటనపై మంత్రి సత్యకుమార్ పరామర్శ........
ధర్మవరం: ధర్మవరం నియోజకవర్గానికి చెందిన కుటుంబ సభ్యులు శ్రీశైలంలో మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురువారం బత్తలపల్లిలోని వారి స్వగృహానికి ఎం. ఆర్. ఓ ,ఆర్ డి ఓ తదితర అధికారులతో కలిసి వెళ్లిన మంత్రి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం,ప్రజాప్రతినిధులు కుటుంబానికి అండగా ఉంటారని భరోసా కల్పించారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మంత్రి,ప్రభుత్వం తరఫున అందించగల సహాయంపై అధికారులతో అక్కడికక్కడే చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు.జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను ఆత్మీయులు,కుటుంబ సభ్యులు,స్నేహితులతో పంచుకుని పరిష్కారం వెతుక్కోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలకు ఎవరూ పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
    user_Bandi vasava datta sanjay
    Bandi vasava datta sanjay
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ధర్మవరం నుంచి మరో సరికొత్త వెబ్ సిరీస్.. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో “అర్జున్ – ది హంట్” శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం పట్టణానికి చెందిన పెద్ది రాజు నరసింహ రచన, దర్శకత్వంలో “అర్జున్ – ది హంట్” పేరుతో మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా కథ, సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో AI టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారి ఫొటోలను స్వీకరించి, వాటి ఆధారంగా AI సహాయంతో ప్రత్యేకమైన క్యారెక్టర్ లుక్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల లుక్‌కు అనుగుణంగా కథలో పాత్రను డిజైన్ చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెబ్ సిరీస్‌లో భాగం కావాలనుకునే వారు తమ ఫొటోతో పాటు వివరాలను పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 8978580208 నంబర్‌కు WhatsAppలో “ARJUN – THE HUNT” అని మెసేజ్ చేసి, పేరు, వయస్సు, ప్రాంతం, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలను పంపించాలని సూచించారు. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ను సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
    1
    ధర్మవరం నుంచి మరో సరికొత్త వెబ్ సిరీస్.. మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో “అర్జున్ – ది హంట్”
శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం పట్టణానికి చెందిన పెద్ది రాజు నరసింహ రచన, దర్శకత్వంలో “అర్జున్ – ది హంట్” పేరుతో మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలతో వెబ్ సిరీస్ రూపొందుతోంది. ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగించేలా కథ, సన్నివేశాలను రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వెబ్ సిరీస్‌లో AI టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వారి ఫొటోలను స్వీకరించి, వాటి ఆధారంగా AI సహాయంతో ప్రత్యేకమైన క్యారెక్టర్ లుక్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. వ్యక్తుల లుక్‌కు అనుగుణంగా కథలో పాత్రను డిజైన్ చేసే విధంగా ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.
వెబ్ సిరీస్‌లో భాగం కావాలనుకునే వారు తమ ఫొటోతో పాటు వివరాలను పంపించవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం 8978580208 నంబర్‌కు WhatsAppలో “ARJUN – THE HUNT” అని మెసేజ్ చేసి, పేరు, వయస్సు, ప్రాంతం, ఫొటో, మొబైల్ నంబర్ వివరాలను పంపించాలని సూచించారు.
మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌ను సరికొత్త విధానంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
    user_HI DHARMAVARAM
    HI DHARMAVARAM
    Mobile Store ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః ప్రారంభించారు.
    1
    దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మహా సంప్రోక్షణ
దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.ఆగమశాస్త్రోక్తంగా మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ,కళాకర్షణ కార్యక్రమాలను అర్చకులు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ
రవిచంద్ర పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ మహాసంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి అంతరాలయ దర్శనాన్ని పునః
ప్రారంభించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా 1000 బైకులతో భారీ ర్యాలీ ఆగస్టు 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కూటమి నేతల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు,రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదటిగా మార్కాపురం పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ తర్లుపాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్ సెంటర్, కంభం బస్టాండ్, దోర్నాల బస్టాండ్, సప్తగిరి సెంటర్, తూర్పు వీధి మీదుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు 1996వ సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని అనంతరం పలు ఇబ్బందులను దాటుకొని ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజలకు పట్టరాని సంతోషంతో ఉన్నారని అన్నారు. వైసిపి నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడం జరిగిందని ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగదనులని వారి వలన నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందని వారి త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగును ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేసి జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు కందుల విగ్నేష్ రెడ్డి , మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు , కూటమి నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా 1000 బైకులతో భారీ ర్యాలీ
ఆగస్టు 31వ తేదీన  రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కూటమి నేతల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు,రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మొదటిగా మార్కాపురం పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద  నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ  తర్లుపాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్ సెంటర్, కంభం బస్టాండ్, దోర్నాల బస్టాండ్, సప్తగిరి సెంటర్, తూర్పు వీధి మీదుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి  మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు 1996వ సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు  శంకుస్థాపన చేశారని అనంతరం పలు ఇబ్బందులను దాటుకొని ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుకోవడం  ఈ ప్రాంత ప్రజలకు పట్టరాని సంతోషంతో ఉన్నారని అన్నారు.
వైసిపి నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడం జరిగిందని ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగదనులని వారి వలన నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందని వారి త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగును ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేసి జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు  కందుల విగ్నేష్ రెడ్డి , మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు , కూటమి నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ సమీపంలో ఎత్తైన కొండపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ సమీపంలో అత్యంత ఎత్తైన కొండపై ఉపాధ్యాయులు జాతీయ జెండాను ప్రతిష్టించారు. దశాబ్దాలుగా పశ్చిమ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో కొత్త ఆశలకు ఆనందానికి నాంది పలికింది. ఎన్నో ఏళ్లుగా కరువుతో అల్లాడిన ఈ ప్రాంతంలో కృష్ణా జలాలతో జలకళ సంతరించుకుంటుందని ఉపాధ్యాయులు అన్నారు. జలధార సమీపంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
    1
    వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ సమీపంలో ఎత్తైన కొండపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా 
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ సమీపంలో అత్యంత ఎత్తైన కొండపై ఉపాధ్యాయులు జాతీయ జెండాను ప్రతిష్టించారు. దశాబ్దాలుగా పశ్చిమ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో కొత్త ఆశలకు ఆనందానికి నాంది పలికింది. ఎన్నో ఏళ్లుగా కరువుతో అల్లాడిన ఈ ప్రాంతంలో కృష్ణా జలాలతో జలకళ సంతరించుకుంటుందని ఉపాధ్యాయులు అన్నారు. జలధార సమీపంలో  మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?* *ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన* *తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు* *కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు* *రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు* *అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న* *తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు* *భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు* *రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు* *కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు* తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    3
    *కోర్టు పరిధిలో భూమి..! కబ్జాలోకి ఎలా వచ్చింది.?*


*ఈదులనాగులపల్లిలో సర్వే నంబర్లు 134, 135పై రైతుల ఆందోళన*


*తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం చేస్తారంటున్న రైతులు*


*కోర్టు పరిధిలో ఉన్న భూములలొ జేసీబీలతో రోడ్డు పనులు ఎలా చేస్తారు*


*రియల్‌ వ్యాపారుల పనులను అడ్డుకున్న గ్రామస్తులు*


*అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ రైతుల ప్రశ్న*


*తహసీల్దార్‌కు ఫిర్యాదు.. కలెక్టర్‌ను కలవనున్న గ్రామస్తులు*


*భూముల రక్షణ కొరకు  కార్యాచరణ కమిటీ ఏర్పాటు*


*రోడ్డు పనులకు అనుమతులు ఎవరు అనుమతులు ఇచ్చారు*


*కోర్టు వివాదం నడుస్తుండగానే పనులెలా సాగిస్తారు*


తమ భూములు తమకు దక్కేవరకు పోరాటం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామ రైతులు స్పష్టం చేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, ఈదులనాగులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 134, 135లోని భూములపై వివాదం కొనసాగుతోంది. తమ భూములకు సంబంధించిన వివాదం న్యాయస్థాన పరిధిలో ఉండగానే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడం రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు చేపట్టేందుకు అనుమతి ఎవరు ఇచ్చారు? అధికారులు ఎందుకు స్పందించడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు జేసీబీలతో భూమి చుట్టూ మట్టి రోడ్డు వేస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అప్పటికే కొంత దూరం వరకు మట్టి రోడ్డు వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కోర్టులో వివాదం కొనసాగుతున్న భూమిలో ఎలాంటి నిర్మాణాలు, రోడ్డు పనులు, ఇతర మార్పులు జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంపై రైతులు ఆర్‌సీ పురం తహసీల్దార్‌ను కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే ఆమె ఇది తన పరిధిలోకి రాదని తప్పించుకున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో పనులు జరుగుతున్న అంశంపై సమగ్ర విచారణ చేపట్టి, భూముల రికార్డులు, కోర్టు కేసు వివరాలను పరిశీలించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. వివాదాస్పద భూములను పరిరక్షించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించేందుకు గ్రామస్తులు సమావేశం నిర్వహించారు. తమ భూములు తమకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యను జిల్లా స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు. భూముల పరి రక్షణ కోసం కార్యచరణ కమిటీని ఏర్పాటు చేసి, తదుపరి పోరాట కార్యక్రమాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. న్యాయస్థానంలో వివాదం కొనసాగుతున్న భూమిలో రియల్ వ్యాపారులు జేసీబీలతో రోడ్డు పనులు చేపట్టడంపై అధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోర్టు పరిధిలోని భూములలో రోడ్డు పనులు చేపట్టడానికి అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు ఇచ్చారు? రికార్డులను పరిశీలించకుండానే పనులు ఎలా కొనసాగుతున్నాయనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూమి హద్దులు, రికార్డులు, కోర్టు కేసు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే తమ భూమి తమకు దక్కేవరకు పోరాటం తీవ్ర తరం చేస్తామని ఈదులనాగులపల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.