logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలో వినాయక నిమజ్జన పాయింట్లను పరిశీలించిన డీఎస్పీ కలసపాడు, సెప్టెంబర్ 15: వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ మంగళవారం పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో పర్యటించి నిమజ్జన పాయింట్లను పరిశీలించారు. కలసపాడు మండలంలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన సగిలేరు వాగు పరివాహక ప్రాంతం, రాచరు పరిసర ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నిమజ్జన సమయంలో భక్తులు, వినాయక విగ్రహాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసు సిబ్బందితో డీఎస్పీ చర్చించారు. నిమజ్జన పాయింట్ల వద్ద నీటి ప్రవాహం, భక్తుల రాకపోకలు, విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశాలను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ముఖ్యంగా నిమజ్జన సమయంలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు నీటి ప్రవాహానికి సమీపంలోకి వెళ్లకుండా నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎస్పీ సూచించారు. భక్తులు అత్యుత్సాహానికి లోనుకాకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. నిమజ్జన పాయింట్ల వద్ద ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం రాజుపాలెం గ్రామంలోని శ్రీ వినాయక స్వామి విగ్రహం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు నిమజ్జన కార్యక్రమంలో భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. నిమజ్జనం సజావుగా జరిగేందుకు పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల సీఐ హేమసుందర్‌రావు, కలసపాడు ఎస్‌ఐ సుభాన్, పోలీసు సిబ్బంది, పోకల మళ్లీ కార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Nageswararao pasupula
Nageswararao pasupula
Photographer పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
1 hr ago
dfa65ddd-1220-4146-ad41-0a509404a37e

పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలో వినాయక నిమజ్జన పాయింట్లను పరిశీలించిన డీఎస్పీ కలసపాడు, సెప్టెంబర్ 15: వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ మంగళవారం పోరుమామిళ్ల, కలసపాడు మండలాల్లో పర్యటించి నిమజ్జన పాయింట్లను పరిశీలించారు. కలసపాడు మండలంలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలైన సగిలేరు వాగు పరివాహక ప్రాంతం,

3214c35e-1d61-4cdb-af67-52257f6f3786

రాచరు పరిసర ప్రాంతాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. నిమజ్జన సమయంలో భక్తులు, వినాయక విగ్రహాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై పోలీసు సిబ్బందితో డీఎస్పీ చర్చించారు. నిమజ్జన పాయింట్ల వద్ద నీటి ప్రవాహం, భక్తుల రాకపోకలు, విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశాలను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ముఖ్యంగా

0452324c-f5d2-4b7f-a02f-b01b8fcfc4e5

నిమజ్జన సమయంలో చిన్నారులు, వృద్ధులు, మహిళలు నీటి ప్రవాహానికి సమీపంలోకి వెళ్లకుండా నిర్వాహకులు, కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎస్పీ సూచించారు. భక్తులు అత్యుత్సాహానికి లోనుకాకుండా క్రమశిక్షణతో వ్యవహరించాలని, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కోరారు. నిమజ్జన పాయింట్ల వద్ద ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం రాజుపాలెం గ్రామంలోని శ్రీ వినాయక స్వామి విగ్రహం వద్ద

c2576ef3-5fcd-446b-905d-966398c78677

నిర్వహించిన పూజా కార్యక్రమంలో డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు నిమజ్జన కార్యక్రమంలో భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. నిమజ్జనం సజావుగా జరిగేందుకు పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల సీఐ హేమసుందర్‌రావు, కలసపాడు ఎస్‌ఐ సుభాన్, పోలీసు సిబ్బంది, పోకల మళ్లీ కార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వినాయక చవితి సందర్భంగా బద్వేలు కు విచ్చేసిన జబర్దస్త్ టీం బద్వేలు, సెప్టెంబర్ 15:వినాయక చవితి పండుగ శోభతో బద్వేలు పట్టణం కోలాహలంగా మారింది. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ప్రముఖ జబర్దస్త్ టీం బద్వేలు కు విచ్చేసింది.బద్వేలు పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జబర్దస్త్ ఆర్టిస్టులు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సందడి చేశారు. తమదైన కామెడీ పంచ్ లతో అక్కడికి వచ్చిన అభిమానులను, చిన్నారులను అలరించారు. ఈ సందర్భంగా శేఖర్ రాయల్ కుటుంబ సభ్యులు జబర్దస్త్ టీంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, చుట్టుపక్కల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    వినాయక చవితి సందర్భంగా బద్వేలు కు విచ్చేసిన జబర్దస్త్ టీం
బద్వేలు, సెప్టెంబర్ 15:వినాయక చవితి పండుగ శోభతో బద్వేలు పట్టణం కోలాహలంగా మారింది. ఈ పండుగ వేడుకల్లో భాగంగా ప్రముఖ జబర్దస్త్ టీం బద్వేలు కు విచ్చేసింది.బద్వేలు పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని జబర్దస్త్ ఆర్టిస్టులు సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి సందడి చేశారు.
తమదైన కామెడీ పంచ్ లతో అక్కడికి వచ్చిన అభిమానులను, చిన్నారులను అలరించారు. ఈ సందర్భంగా శేఖర్ రాయల్ కుటుంబ సభ్యులు జబర్దస్త్ టీంను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో స్థానికులు, చుట్టుపక్కల వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    45 min ago
  • వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్ కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది. రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    వెలుగోడు నుంచి రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి తెలుగు గంగ SR1, SR2 లను నింపాలి - రైతు సేవా సమితి డిమాండ్
కడప జిల్లాలో నీరు లేకుండా అడుగంటిపోయిన తెలుగు గంగ SR1, SR2 ప్రాజెక్టులకు వెలుగోడు నుండి రోజుకు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి, కడప జిల్లా ప్రజలకు, రైతులకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని రైతు సేవా సమితి కడప జిల్లా సమితి డిమాండ్ చేసింది.
రైతు సేవా సమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి కడప జిల్లా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న "రైతు గ్రామబాట" కార్యక్రమం ఈరోజు 15వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా ఈరోజు మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో నిరసన తెలియజేసి, ఎమ్మార్వో గారు లేకపోవడంతో డిప్యూటీ ఎమ్మార్వో నరసింహ గారికి వినతి పత్రాన్ని అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
ఏలినో ప్రభావంతో జిల్లాలో ఈ సంవత్సరం వర్షాలు లేక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేలు సహాయం అందించాలని, అలాగే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజోలి, జొలదరాశి, తెలుగు గంగ తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ కార్యదర్శి మాడి శెట్టి సహదేవుడు, మైదుకూరు పట్టణ, మండల నాయకులు, రైతులు దాశ రెడ్డి గారి సుబ్బరాయుడు, రాజా, మూలే రామచంద్రారెడ్డి, కోటయ్య గారి గుర్రప్ప, రాజాల రామచంద్రుడు, పసల పుల్లయ్య, అంకిరెడ్డిపల్లి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు 9వ గేటు మరమ్మతు పనులు పూర్తి జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రూ.2.40 లక్షలతో మరమతు పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యకు ఉన్నతాధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం చూసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
    1
    జూపాడుబంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు 9వ గేటు మరమ్మతు పనులు పూర్తి
జూపాడు బంగ్లా మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 9వ గేటుకు అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. రూ.2.40 లక్షలతో మరమతు పనులు పూర్తి చేసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో రైతులకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ సమస్యకు ఉన్నతాధికారుల సహకారంతో సమస్యకు పరిష్కారం చూసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం.. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ గారు ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    2
    వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, 
అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం..
వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్,  ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ  సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ  సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ గారు ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నందవరం లో సర్వ రక్షక సేవ సంఘం నాయకులు గణనాధునికి ఘనంగా పూజలు నందవరం లో వినాయక చవితి సందర్భంగా గణనాధునికి ఘనంగా పూజలు చేశారు .స్తానిక బిసీ కాలని వద్ద సర్వ రక్షక సేవ సంఘం వినాయక యూత్ ఆధ్వర్యంలో కొలువు తీరిన వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు, నైవేద్యం ,పుష్పాలు, పత్రాలతో పూజలు అందుకున్నారు.మండపం వద్ద ఆధ్యాత్మిక శోభఉట్టిపడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణతో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ,విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించిన స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    1
    నందవరం లో సర్వ రక్షక సేవ సంఘం నాయకులు గణనాధునికి ఘనంగా పూజలు
నందవరం లో వినాయక చవితి సందర్భంగా గణనాధునికి ఘనంగా పూజలు చేశారు .స్తానిక బిసీ కాలని వద్ద సర్వ రక్షక సేవ సంఘం వినాయక యూత్  ఆధ్వర్యంలో కొలువు తీరిన వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు, నైవేద్యం ,పుష్పాలు, పత్రాలతో పూజలు అందుకున్నారు.మండపం వద్ద ఆధ్యాత్మిక శోభఉట్టిపడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణతో స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రాణప్రతిష్ఠ,విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రంగురంగుల పూలమాలలతో సర్వాంగసుందరంగా అలంకరించిన స్వామివారికి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
    user_Viswanath boya
    Viswanath boya
    నందవరం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • పత్రికా ప్రకటన నంద్యాల జిల్లా 15.09.2026 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆత్మకూరు:నంద్యాల జిల్లా. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
    4
    పత్రికా ప్రకటన

నంద్యాల జిల్లా 
15.09.2026

 వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS.
అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. 

ఆత్మకూరు:నంద్యాల జిల్లా.
వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది.
ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, IPS  నేడు ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని *వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా* మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ  సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ  సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నంద్యాల.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు. స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం. బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు: వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. -విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి -అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ -లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి -పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ -పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ ఆర్థిక సహాయం అందించిన దాతలు: శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/- ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.
    2
    బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు.
స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం.
బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది.
ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు.
ఉత్సవాలకు సహకరించిన దాతలు:
వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
-విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి
-అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ
-లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి
-పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ
-పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ
ఆర్థిక సహాయం అందించిన దాతలు:
శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/-
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ,  కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    57 min ago
  • *సెల్ఫీ వీడియో కలకలం* *గడ్డి మందు తాగుతూ..* *వేధింపులు తట్టుకోలేక మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం* *కుటుంబ సభ్యుల ఫిర్యాదు* *బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆశ్రయించిన కుటుంబం* పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రైమ్‌9 న్యూస్‌ రిపోర్టర్‌ పోలిశెట్టి సత్యనారాయణ (చంటి) గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు గమనించి ఆయనను తొలుత నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆక్వా సాగులో నష్టాల కారణంగా అప్పులపాలైన సత్యనారాయణ, అనంతరం అప్పులు తీర్చినప్పటికీ కొందరు వడ్డీ వ్యాపారులతో కలిసి సహచర మీడియా ప్రతినిధులు తనను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రెస్‌మీట్లకు వెళ్లిన సందర్భాల్లో అవమానాలకు గురిచేశారని, సత్యనారాయణను పిలిస్తే తాము ప్రెస్‌మీట్లకు రామని కొందరు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్యనారాయణ భార్య, పిల్లలు, అన్న సుబ్రహ్మణ్యం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి సత్యనారాయణే ప్రధాన ఆధారమని, ఆయనకు ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై టీవీ 9 మారుతి, టీవీ 5 సందీప్, ఐ న్యూస్ రాజేష్, సాక్షి పత్రిక కేతినేడి రంగపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరుతూ...ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు.
    3
    *సెల్ఫీ వీడియో కలకలం*

*గడ్డి మందు తాగుతూ..*

*వేధింపులు తట్టుకోలేక మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నం*

*కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

*బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆశ్రయించిన కుటుంబం*

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ మీడియా ప్రతినిధి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ప్రైమ్‌9 న్యూస్‌ రిపోర్టర్‌ పోలిశెట్టి సత్యనారాయణ (చంటి) గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. చుట్టుపక్కల రైతులు గమనించి ఆయనను తొలుత నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఆక్వా సాగులో నష్టాల కారణంగా అప్పులపాలైన సత్యనారాయణ, అనంతరం అప్పులు తీర్చినప్పటికీ కొందరు వడ్డీ వ్యాపారులతో కలిసి సహచర మీడియా ప్రతినిధులు తనను వేధించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రెస్‌మీట్లకు వెళ్లిన సందర్భాల్లో అవమానాలకు గురిచేశారని, సత్యనారాయణను పిలిస్తే తాము ప్రెస్‌మీట్లకు రామని కొందరు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సత్యనారాయణ భార్య, పిల్లలు, అన్న సుబ్రహ్మణ్యం నరసాపురం డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి సత్యనారాయణే ప్రధాన ఆధారమని, ఆయనకు ఏదైనా జరిగితే కుటుంబం రోడ్డున పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై టీవీ 9 మారుతి, టీవీ 5 సందీప్, ఐ న్యూస్ రాజేష్, సాక్షి పత్రిక కేతినేడి రంగపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరుతూ...ఆత్మహత్యాయత్నానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డీఎస్పీని కోరారు.
    user_మన నల్లమల
    మన నల్లమల
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.