Shuru
Apke Nagar Ki App…
వినాయకుడి ఆశీస్సులతో ప్రజల సుభిక్షంగా వర్ధిల్లాలి. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వినాయకుడి ఆశీస్సులతో విజ్ఞాలన్ని తొలగిపోయి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం దారూర్ మండల కేంద్రంలో ప్రతిష్టించిన వినాయకులకు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడికి పూజలు నిర్వహిస్తే అన్ని విధాలుగా మంచి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు.
Jvnath
వినాయకుడి ఆశీస్సులతో ప్రజల సుభిక్షంగా వర్ధిల్లాలి. మాజీ ఎమ్మెల్యే ఆనంద్ వినాయకుడి ఆశీస్సులతో విజ్ఞాలన్ని తొలగిపోయి ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సుభిక్షంగా వర్ధిల్లాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం దారూర్ మండల కేంద్రంలో ప్రతిష్టించిన వినాయకులకు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడికి పూజలు నిర్వహిస్తే అన్ని విధాలుగా మంచి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పేర్కొన్నారు.
More news from Telangana and nearby areas
- పెండింగ్ జీతాలు చెల్లించడంతో కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికులు పెండింగ్ జీతాలు చెల్లించాలని నిరసన తెలుపడంతో అధికారులు పాలకులు దిగివచ్చి జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ కార్మికులు సిఐటియు జిల్లా అధ్యక్షులు మైపాల్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేర్ చౌరస్తా వద్ద ఉదయం వేళలో మున్సిపల్ కార్మికులు సమావేశమై పెండింగ్ జీతాలు చెల్లించినందుకు మున్సిపల్ చైర్మన్కు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు1
- రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం! హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.1
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- షెహెరోన్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు వద్దిరాజు,దీవకొండ, రాజ్యసభ మాజీ సభ్యులు సురేష్ రెడ్డిలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనాగ్రహ అనే సంస్థ ఢిల్లీలో మంగళవారం "షెహెరోన్ పే చర్చా"అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.న్యూఢిల్లీ ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లోని స్టెయిన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.దేశంలోని నగరాల భవిష్యత్తు,వాటి సమర్థవంతమైన పాలన,ప్రజలకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి,అందుకు తీసుకురావలసిన సంస్కరణల గురించి కేటీఆర్, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి,లోకసభ సభ్యులు తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణ), డాక్టర్ టీ.సుమతి (చెన్నై దక్షిణ)లు ఈ చర్చా గోష్ఠిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు.ఈ కార్యక్రమానికి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కే.ఆర్.సురేష్ రెడ్డిలు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కే.టీ.రామారావుతో కలిసి హాజరయ్యారు.1
- బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ దుస్థితి.. మురుగునీటితో అవస్థలు హైదరాబాద్ బేగంపేట్‌లోని ప్రకాష్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడద పెరిగిందని వాపోతున్నారు. గుంతల్లో నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.1
- మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి న్యాయం చేస్తాం. మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అనన్య తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ అనన్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ లో కార్మికులు పనిచేయడం వల్లనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.1
- ఇస్లాంపూర్ తండాలో చిరుత కలకలం.. లేగ దూడ మృతి, చిరుతను పట్టుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన సర్పంచ్ తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మంగళవారం రాత్రి పొలం వద్ద కట్టేసిన లేగ దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి తెలిపారు. తండాకు చెందిన లంబాడి రాజు పొలం వద్ద పశువులను కట్టేసి ఉంచగా, సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత ఒక్కసారిగా దాడి చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో లేగ దూడ అక్కడికక్కడే మృతి చెందినట్లు వివరించారు. దీంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే రైతులు, తండావాసులు ఆందోళన చెందుతున్నారు. చిరుత సంచారాన్ని గుర్తించి, దాన్ని పట్టుకునేందుకు అటవీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని సర్పంచ్ కోరారు.1