నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు. కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.
నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై దేశ వ్యాప్తంగా నెలరోజుల పాటు సేవా కార్యక్రమాలు...కేంద్ర పథకాల లబ్దిదారులంతా భాగస్వాములుకావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ‘‘సేవా సంకల్ప్ అభియాన్ – జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘ఆశీర్వాద దీపం’ పేరిట మోదీ నిండు నూరేళ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ లబ్దిదారులంతా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ‘‘ఆశీర్వాద దీపం’’ పేరిట దేశవ్యాప్తంగా అందరం దీపాన్ని వెలిగించి మోదీ నిండు నూరేళ్లు ప్రజాసేవలో తరలించాలని ప్రార్ధిస్తూ భగవంతుడిని వేడుకుంటామని తెలిపారు. కేంద్రం నుండి లబ్ది పొందిన వాళ్లంతా ‘‘ఆశీర్వాద దీపం’’ పాల్గొనాలని కోరుతున్నాం. సెప్టెంబర్ 17న పగటిపూట దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఊరూవాడా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని, పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ పోరాట చరిత్రను పాఠ్యంశాలుగా పొందుపరుస్తామని తెలిపారు.
- కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన బాట పట్టారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్ మాట్లాడుతూ.. హామీలు అమలు చేయాలి… మభ్యపెట్టడం ఆపాలి! హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ యునైటెడ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ నాన్ పొలిటికల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో… ప్రభుత్వం రెండుసార్లు హామీ ఇచ్చినా ఇప్పటివరకు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రస్తావిస్తామని చెప్పి… చివరకు సమస్యను దాటవేయడం మోసపూరిత చర్య అంటూ మండిపడ్డారు. ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు తెలంగాణ మాల మానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్ల కనకరాజు మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మద్దెల రాజేందర్‌తో పాటు ఆకుల మల్లేశం, తప్పట్ల మల్లేశం, ఎస్కే సలీం, మెట్పల్లి రాజు, లక్ష్మణ్ తదితరులు కరీంనగర్ నుంచి ధర్నాలో పాల్గొన్నారు.1
- క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి: జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ జనగామ: క్రీడాకారులు నిరంతర సాధన, పట్టుదలతో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ జాతీయ స్థాయికి ఎదగాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు వై. కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు మానసికోల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని, క్రమశిక్షణను అలవరుస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విశేష ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందితే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. క్రీడాకారులు కేవలం స్థానిక పోటీలకే పరిమితం కాకుండా కఠిన సాధనతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి జిల్లాకు, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనగామ మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనిల్ బాబు, కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, నాయకులు కౌడగాని మోహన్ రావు, బండి కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు (PETలు) సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, పీఈటీలు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరై పోటీలను విజయవంతం చేశారు.1
- దంతాలపల్లి *ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ దంతాలపల్లి *ఎస్సై వేధింపులంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట కుటుంబం మందు డబ్బతో ఆందోళన* ఇంటి దారి, భూవివాదంలో శంకర్ కేసు పెట్టినట్లు బాధితుల ఆరోపణ కేసుకు సంబంధించిన ఆధారాలు పరిశీలించకుండానే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారన్నారు ఎస్సై బి. రవికుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించారని బాధితుల ఆవేదన పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ ఎస్సై వేధింపులు తట్టుకోలేక మందు డబ్బాతో పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసిన రూప్‌సింగ్ కుటుంబ సభ్యులు ఎస్సైపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ బాధితుల ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి.2
- *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ *జాతీయ మహాసభలను జయప్రదం చేయండి* *ఆలేరులో బైక్ ర్యాలీ – మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ* రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా అధ్యక్ష కారుదర్శులు కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ లు పిలుపునిచ్చారు. మహాసభల జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో ఏ.ఐ.కె.ఎం.ఎస్. ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లెపు అడివయ్య, బేజాడి కుమార్ మాట్లాడుతూ.. దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రైతుల హక్కుల కోసం జరిగే పోరాటాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, అప్పుల భారం వంటి సమస్యలు రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఐక్యం చేసి పోరాటాలను నిర్మించడమే లక్ష్యంగా ఏ.ఐ.కె.ఎం.ఎస్. పనిచేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న జాతీయ మహాసభలు భవిష్యత్ రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేసే కీలక వేదికగా నిలుస్తాయని అన్నారు. జాతీయ మహాసభల పిలుపును గ్రామగ్రామానికి తీసుకెళ్లేందుకు ఆలేరు ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు మహాసభల సందేశాన్ని చేరవేయడంతో పాటు, పోస్టర్లను ఆవిష్కరించి మహాసభల ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, యువత, ప్రజాతంత్రవాదులు పెద్ద సంఖ్యలో జాతీయ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, గడ్డం మంకన్న, మురళి, కుమార్, అంజిరెడ్డి, భూష శ్రీశైలం, బాలయ్య, రామ చంద్రయ్య, మశయ్య, ఆర్.ఉదయ్, పాల్గొన్నారు.2
- డేంజర్ జోన్ గా జగిత్యాల బైపాస్ రోడ్డు: గుంతలు పూడ్చేదెప్పుడు? ప్రయాణం సురక్షితమయ్యేదెప్పుడు? జగిత్యాల పట్టణంలో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉండే కొత్త బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ వైన్స్ చౌరస్తా నుండి బైపాస్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. రోడ్డు పునర్నిర్మాణం లేదా డ్రైనేజీ/పైప్‌లైన్ పనుల కోసం తవ్విన భారీ గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చకుండా, మట్టి మరియు రాళ్ల శిథిలాలను (Debris) రోడ్డు పైనే అస్తవ్యస్తంగా వదిలేశారు. ప్రాణసంకటంగా రాత్రి ప్రయాణం: తెలంగాణ వైన్స్ చౌరస్తా వద్ద నిత్యం వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఈ గుంతల వద్ద ఎటువంటి రేడియం సూచికలు గానీ, ప్రకాశించే బారికేడ్లు గానీ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు ట్రాఫిక్ దిగ్బంధం: కొత్త బస్ స్టాండ్ వైపు, బైపాస్ వైపు వెళ్లే వాహనాలు ఈ గుంతలను తప్పించబోయి హఠాత్తుగా బ్రేకులు వేయడం వల్ల చౌరస్తా ప్రాంతంలో తీవ్రంగా ట్రాఫిక్ నిలిచిపోతోంది. ప్రయాణికులకు దుమ్ము ఇబ్బందులు: రోడ్డుపై విసిరేసినట్లున్న కంకర, మట్టి వల్ల వాహనాలు వెళ్లేటప్పుడు విపరీతంగా దుమ్ము రేగి కాలినడకన వెళ్లే ప్రయాణికులు, స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త బస్ స్టాండ్ మరియు బైపాస్ రోడ్డును కలిపే ఈ కీలకమైన చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ మరియు ఆర్ అండ్ బి (R&B) అధికారులు తక్షణమే స్పందించాలి. వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి, తవ్విన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారుల ప్రయాణాన్ని సురక్షితం చేయాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.1
- సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై కరపత్రం విడుదల 50 ఏళ్ల అరుణోదయలో 50 ఏళ్ల విమలక్క ప్రస్థానం సెప్టెంబర్ 26న ప్రారంభ సభ ప్రజా కళా జాతరలో భాగస్వామ్యంకై ఆహ్వానం కరపత్రం విడుదల ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కోశాధికారి జి రాములు ఆధ్వర్యంలో ఈరోజు రాంనగర్ లో కరెక్ట్ కరపత్రాల విడుదల కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ... సెప్టెంబర్ 26న ప్రారంభ సభ విమలక్క ప్రస్థానం 50 గంటల పాటు ఏకధాటిగా పాట ఆట మాటలతో సాగే ఈ సభను విజయవంతం కొరకు కరపత్రాలు విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సభలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర చత్తీస్ గడ్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ నుండి కళాకారులు తెలుగు రాష్ట్రంలోని డజన్ల కొద్ది కళారూపాలు వందలాది కళాకారుల దీనిలో భాగస్వామవుతున్నారు హైదరాబాద్ సుందరయ్య పార్క్ నుండి ఆర్టీసీ కల్యాణ మండపం వరకు ఊరేగింపుగా వెళ్లి జెండా ఆవిష్కరణ నిర్వహించి ప్రారంభ సభలో ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ లక్ష్మి ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు ఆచార్య కట్ట భగవంతు రెడ్డి ప్రొఫెసర్ వినయ్ బాబు పోతల రమేష్ ముఖ్య అతిధి హాజరై ఈ ప్రారంభ సభను పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాష్ట్ర కార్యదర్శి పల్లె లింగన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు యాకుబ్, రాష్ట్ర కమిటీ సభ్యులు జనగాం చిన్నయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి బతుకుల రాజన్న, జిల్లా కమిటీ సభ్యులు పద్మ, ఏఐఎస్టియు పెద్దపెల్లి జిల్లా నాయకులు ఎం రామస్వామి, రామగుండం డివిజన్ అధ్యక్షుడు ఆర్ యాకయ్య, ఎండి మహమ్మద్, తదితరులు పాల్గొన్నారు.1
- రైతులకు ఫ్రీగా వేములవాడ రాజన్న కోడెల పంపిణీ...500 కోడెలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పరిమితికి మించి ఉన్న 500 రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిధిలోని తిప్పాపురంలో గల గోశాలలో రైతులకు రాజన్న కోడెల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో పాటు ఆలయ అధికారులు పాల్గొని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 250 మంది రైతులకు 500 కోడెలు ఉచితంగా అందజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రమే రాజన్న కోడెలు పంపిణీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదివరకు 10 విడతలుగా 2100 కోడెలు పంపిణీ చేశామని, ప్రస్తుతం మరో 500 కోడెలు రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. భక్తి భావంతో భక్తులు పాలు మరువని అనారోగ్యంగా ఉన్న కోడెలను రాజరాజేశ్వర స్వామికి సమర్పిస్తున్నారని అలాంటి కోడెలు సమర్పించవద్దని కోరారు. నిజ కోడెలు సమర్పించే భక్తులు నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అనారోగ్యంగా పాలు మరువని, జర్సీ కోడెలను ఇచ్చి పాపం మూట కట్టుకోవద్దని సూచించారు. రాజన్న కోడెల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని భక్తులు సమర్పించే కోడెలను గ్రేడింగ్ పద్ధతిలో వేరు వేరు ప్రదేశాల్లో ఉంచేలా కృషి చేస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. పాలు మరవని కోడెలను, జెర్సీ కోడెలను తీసుకురావద్దన్నారు. రైతులకు ఇచ్చిన కోడెను రాజన్న ప్రసాదంగా భావించి, కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకోవాలన్నారు. రైతులకు ఇచ్చిన కోడెలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఒకవేళ రైతులు పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.2
- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం వీరోచితంగా పోరాడిందన్నారు. ఈ చరిత్రను వక్రీకరించొద్దన్న చాడ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని, అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేయాలని, పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.3
- ఇంజనీర్లు పాత్ర కీలకం. ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించిన రామగుండం మేయర్ మహంకాళి స్వామి రామగుండం పునర్నిర్మాణంలో ఇంజనీర్లు పోషిస్తున్న పాత్ర కీలకమని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ఇంజనీర్స్ డే పురస్కరించుకొని మంగళ వారం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజినీర్లను లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సౌజన్యంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ సిబ్బంది శక్తి కి మించి శ్రమిస్తూ అభివృద్దిలో చురుగ్గా పాలు పంచుకుంటున్నారని ఆయన కొనియాడారు. ప్రస్తుత ఇంజినీర్లు చిత్త శుద్దితో సేవలందిస్తూ నాణ్యత లో ఏ మాత్రం రాజీ పడకుండా మన్నికగా సుదీర్ఘ కాలం నిలిచి ఉండేలా రోడ్లు , కాలువల నిర్మాణం చేపడుతున్నారని అభినందించారు. రామగుండం నగరాన్ని అధ్భుతoగా తీర్చి దిద్దాలనే స్థానిక ఎం ఎల్ ఎ లక్ష్యానికి అనుగుణంగా ఇదే ఒరవడి కొనసాగిస్తూ ఇంజనీర్లు పని చేసి పాలవర్గానికి మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నామని అన్నారు. అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాంతి స్వరూప్ , ఎ ఇ లు మీర్ , తేజస్విని , సౌమ్య , మనోజ్ , అన్వేష్ , నవీన్ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు నవీన్ , అశోక్ , కళ్యాణ్ , శ్రావణ్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ సత్కారం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి కజంపురం రాజేందర్ తో పాటు , నగర పాలక సంస్థ కార్పొరేటర్లు గట్ల రమేష్ , వడ్లూరి రవి , కొలని కవిత , బాలసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.1