logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గద్వాల పట్టణ పుట్ పాత్ అక్రమణలకు మంగళం పడేనా . ?? గద్వాల మున్సిపాలిటి పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా పుట్ పాత్ అక్రమించి, డబ్బాలు వేసి వ్యాపారాలు కొనసాగించడంతో పాదచారులకు నరకంగా మారిన పుట్‌పాత్ అక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా, మంగళవారం భారీ స్థాయిలో అక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేందుకు గద్వాల మున్సిపల్ మరియు ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ అధికారులు అక్రమణకు గురైన పుట్ పాత్ లను , రోడ్లను గుర్తించి మార్కింగ్ వేయడం జరిగింది. ఈ మేరకు ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణదారులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు మున్సిపల్ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రాఫిక్ ఆర్ఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ బాల చంద్రుడు కృష్ణవేణి చౌరస్తా నుంచి భీంనగర్ లో గల షాపుల యజమానులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు‌. పుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్లు, సామాగ్రిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. గద్వాల పట్టణంలో కృష్ణవేణి చౌరస్తా నుంచి ఆంబేద్కర్ చౌరస్తా, కృష్ణవేణి చౌరస్తా నుంచి భీంనగర్ వరకు అధికారులు ఎక్కడి వరకు మార్కింగ్ చేశారో అక్కడి వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.

1 hr ago
user_Ram  Ram
Ram Ram
Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
1 hr ago
dec4429b-79d5-4308-852a-c1055500656e

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్‌ను చూడవచ్చు.
    1
    తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన వరి ధాన్యం కొనుగోళ్ల వివరాలపై స్పష్టమైన వీడియో విడుదలైంది. వరి పంట బోనస్ గురించిన పూర్తి సమాచారం కోసం రైతులు 'అగ్రికల్చర్ రఘురామ్' యూట్యూబ్ ఛానెల్‌ను చూడవచ్చు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    11 hrs ago
  • ఎమ్మెల్యే బీవీ జై నాగేశ్వర్ రెడ్డికి హాలహర్విలో ఘన స్వాగతం హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా
    1
    ఎమ్మెల్యే బీవీ జై నాగేశ్వర్ రెడ్డికి హాలహర్విలో ఘన స్వాగతం
హాలహర్విలో శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    48 min ago
  • తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
    1
    తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా, కోడేరు మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులకు సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    6 hrs ago
  • జడ్చర్ల పట్టణ కేంద్రంలో భారీ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టాపన జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో పరిసర ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. అనంతరం అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రవచనాలలో ఆంజనేయ స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా వీక్షించారు.
    1
    జడ్చర్ల పట్టణ కేంద్రంలో భారీ ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టాపన
జడ్చర్ల పట్టణ కేంద్రంలో శ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో భారీ ఆంజనేయస్వామి ఏకశిల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో పరిసర ప్రాంతం జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగింది. అనంతరం అహోబిల రామానుజ జీయర్ స్వామి ప్రవచనాలలో ఆంజనేయ స్వామి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా వీక్షించారు.
    user_Ramu Waytunews
    Ramu Waytunews
    మిడ్జిల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    27 min ago
  • ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    1
    ఆదోని కొత్త బైపాస్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని నాగరాజు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు, భార్య ఉన్న ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    user_K Thasleema  MA JOURNALISM
    K Thasleema MA JOURNALISM
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
    1
    కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
    3
    కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • ఎస్సీ హోదా కోసం ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ ఎస్సీ హోదా కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్
    1
    ఎస్సీ హోదా కోసం ఎమ్మిగనూరులో దళిత క్రైస్తవుల భారీ ర్యాలీ
ఎస్సీ హోదా కొనసాగించాలని ప్రభుత్వానికి డిమాండ్
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.