బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు 2014 నుంచి ఇప్పటి వరకూ బీ సీ లకు కేటాయించిన , ఖర్చు చేసిన నిధుల వివరాలు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేసిన టి ఆర్ పి నేతలు – తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండన అచ్చంపేట, జనవరి 07,(క్విక్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్రం లో బీసీ లో ఎలా మోసపోతున్నారో బీసీ ల కు వివరిస్తూ ఒక తాటి పైకి తెస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్నపిలుపుమేరకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ అచ్చంపేట కార్యాలయానికి బీసీ సబ్‌ప్లాన్ కింద 2014 నుంచి ఇప్పటి వరకు కేటాయించిన బడ్జెట్, ఖర్చులవివరాలుఇవ్వాలంటూ వినతి పత్రాలను ఇస్తూ వాస్తవాన్ని వారు డిమాండ్ చేశారు. బీసీలకు కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా వేల రూపాయలే ఖర్చు చేసి బీసీలను మోసం చేస్తున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆరోపించింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 56 శాతం ఉన్న బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, కులగణన పేరుతో నామమాత్రంగా సర్వే నిర్వహించి తప్పుడు నివేదికలతో బీసీలను మభ్యపెడుతోందని విమర్శించింది. అలాగే, కేవలం 8 శాతం జనాభా ఉన్న అగ్రవర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను 15 శాతానికి పెంచి, 56 శాతం ఉన్న బీసీలను ముస్లిం జనాభాతో కలిపి చూపించే ప్రయత్నాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండించింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సర్పంచ్ వ్యవస్థ కొనసాగుతున్న నేపథ్యంలో, తక్షణమే ప్రతి గ్రామంలో కులగణన ఆధారంగా కులాల వారీగా, కుటుంబాల వారీగా జనాభా వివరాలను గ్రామపంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాలని అచ్చంపేట నియోజకవర్గ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కన్వీనర్ బీసం. ఆంజనేయులు డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలకు వెళ్తే, బీసీలు ఓటు ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు శైలజ, హుస్సేన్ పూల్య, మహేశ్వరి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు 2014 నుంచి ఇప్పటి వరకూ బీ సీ లకు కేటాయించిన , ఖర్చు చేసిన నిధుల వివరాలు ఇవ్వాలని వినతి పత్రాన్ని అందజేసిన టి ఆర్ పి నేతలు – తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖండన అచ్చంపేట, జనవరి 07,(క్విక్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్రం లో బీసీ లో ఎలా మోసపోతున్నారో బీసీ ల కు వివరిస్తూ ఒక తాటి పైకి తెస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్నపిలుపుమేరకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని తహసిల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ అచ్చంపేట కార్యాలయానికి బీసీ సబ్‌ప్లాన్ కింద 2014 నుంచి ఇప్పటి వరకు కేటాయించిన బడ్జెట్, ఖర్చులవివరాలుఇవ్వాలంటూ వినతి పత్రాలను ఇస్తూ వాస్తవాన్ని వారు డిమాండ్ చేశారు. బీసీలకు కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా వేల రూపాయలే ఖర్చు చేసి బీసీలను మోసం చేస్తున్నాయని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆరోపించింది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 56 శాతం ఉన్న బీసీలకు
కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, కులగణన పేరుతో నామమాత్రంగా సర్వే నిర్వహించి తప్పుడు నివేదికలతో బీసీలను మభ్యపెడుతోందని విమర్శించింది. అలాగే, కేవలం 8 శాతం జనాభా ఉన్న అగ్రవర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను 15 శాతానికి పెంచి, 56 శాతం ఉన్న బీసీలను ముస్లిం జనాభాతో కలిపి చూపించే ప్రయత్నాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండించింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సర్పంచ్ వ్యవస్థ కొనసాగుతున్న నేపథ్యంలో, తక్షణమే ప్రతి గ్రామంలో కులగణన ఆధారంగా కులాల వారీగా, కుటుంబాల వారీగా జనాభా వివరాలను గ్రామపంచాయతీ రికార్డుల్లో నమోదు చేయాలని అచ్చంపేట నియోజకవర్గ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కన్వీనర్ బీసం. ఆంజనేయులు డిమాండ్ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికలకు వెళ్తే, బీసీలు ఓటు ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు శైలజ, హుస్సేన్ పూల్య, మహేశ్వరి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
- *ఎన్నికలలో హామీలు చేయమని అడిగితే విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన అక్రమ కేసుల?* *ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విద్యార్థి విజన సంఘాల నాయకుల పైన రౌడీషీట!?* *రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్న నారా లోకేష్* *విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ ను ఎత్తివేయాలి* *రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం* *ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎన్ఎస్యుఐ, వైయస్సార్ విద్యార్థి విభాగం* *రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి రౌడీషీట్లు ఓపెన్ చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వైయస్సార్ ప్రెస్ క్లబ్ నందు పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్ర, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న, ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షులు బాబు, వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు సాయి దత్త మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాలలో అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తూ జైలుకు పంపడాన్ని ఖండించారు.. ఈ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు అడగడం లేదు ఎన్నికలలో ఏవైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు యువజనలకు వాటిని అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేస్తే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పెట్టినటువంటి దొంగ కేసులను బయటికి తోడి విద్యార్థి యువజన సంఘాల నాయకులను జైలుకు పంపుతూ రౌడీషీట్లు ఓపెన్ చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి యువజన సంఘాల నాయకులను కేసుల ద్వారానో జైల్లోకు పంపడం ద్వారానో రౌడీ షీట్లు ఓపెన్ చేయడం ద్వారానో విద్యార్థి యువజన ఉద్యమాలను అనిచివేయాలని చూస్తూ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో వైయస్సార్సీపి ప్రభుత్వం విద్యార్థి యువజన సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పులు ప్రశ్నిస్తే వారి పైన కేసులు పెడతారా అని మన ప్రభుత్వం వస్తే మీకు విద్యార్థులకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి నేరుగా తీసుకురండి మేము కేసులు పెట్టడం అరెస్టు చేయడం గృహనిర్బంధాలు చేయడం ఇలాంటివి మా ప్రభుత్వంలో ఉండదని చెప్పిన నారా లోకేష్ ఈరోజు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన ఎలా కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టినటువంటి అక్రమ కేసులు వేయాలని విశాఖపట్నంలో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పై పెట్టిన రౌడీషీట్ను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన సంఘాల నాయకులు తేజ అరుణ్ నాగరాజు మహేష్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు*1
- నల్లగొండ బ్రేకింగ్: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం.. రామగిరి సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులతో మాట్లాడి హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పలు సూచనలు... హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించబోదనే నిబంధనను వాహనదారులకు తెలియజేత... హెల్మెట్ వలన వాహనదారుల ప్రాణాలే కాకుండా వారి కుటుంబ భవిష్యత్తు కూడా సురక్షితమవుతుందని అవగాహన... హెల్మెట్‌ను “శ్రీరామరక్ష”గా భావించి ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా వినియోగించాలని పిలుపు... రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక...1
- మేడారం జాతరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావుకు ఆత్మీయ ఆహ్వానం పలికిన రాష్ట్ర మహిళా మంత్రులు.. రాష్ట్ర మహిళా మంత్రులకు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయ పలకరింపు.ఇంటికి వచ్చిన అతిథులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాదర ఆహ్వానం అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో ఆడబిడ్డలకు సంప్రదాయ సత్కారం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పంచాయతీ రాజ్ & మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు. ఈ సందర్భంగా, శాలువాకప్పి ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు కేసీఆర్ కి మేడారం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా... తన ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను ఆత్మీయంగా పలకరించి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ శోభమ్మ దంపతులు, వారిని పసుపు కుంకుమ వస్త్రాలు, తాంబులాలతో సాంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. కేసీఆర్ దంపతులు అందించిన తేనీటి విందు స్వీకరించిన మహిళా మంత్రులు, కాసేపు పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్టి అనంతరం మంత్రులు తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా.. తొలుత, ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, సాదర ఆహ్వానం పలికారు.1
- మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీగా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి అభినందనలు అందుకుంటున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మరియు దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల రికవరీలో పోలీసులు కీలక విజయం సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ – CEIR పోర్టల్ సహాయంతో మొత్తం 1039 మొబైల్ ఫోన్లను రికవరీ చేయగా, వీటి విలువ రూ. 2 కోట్ల 8 లక్షలుగా అధికారులు తెలిపారు.పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఐపిఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఎల్బీ నగర్, మల్కాజిగిరి యూనిట్లు, ఐటి సెల్ కలిసి ప్రత్యేక బృందాలుగా పనిచేసి ఆరు నెలల వ్యవధిలో ఈ ఫోన్లను గుర్తించారు. ఎల్బీ నగర్ పరిధిలో 739, మల్కాజిగిరి పరిధిలో 300 మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి. గురువారం రోజు జనవరి 8న రికవరీ చేసిన ఫోన్లను అసలైన యజమానులకు అందజేయగా, బాధితులు మల్కాజిగిరి పోలీసుల పనితీరును ప్రశంసించారు. మొబైల్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, దొంగిలించిన ఫోన్ల కొనుగోలు నేరమని పోలీసులు హెచ్చరించారు.2
- యాదాద్రి జిల్లా.. నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల నిధులు త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. ఎమ్మెల్యే కుంభం..1
- విశాఖపట్నం గాజువాకలోని ఓం జ్యువలరీ షాపులో జరిగిన ఈ దొంగతనం ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. గాజువాక బి.సి. రోడ్డులోని ఓం జ్యువలరీ షాపులోకి ముగ్గురు మహిళలు కస్టమర్లలా వేషధారణలో వచ్చారు. నగలు చూపిస్తుండగా, షాపు యజమాని కళ్లు గప్పి అత్యంత చాకచక్యంగా బంగారు వస్తువులను తమ జడల్లో (కొప్పులో) దాచుకోవడానికి ప్రయత్నించారు. మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని, సిబ్బంది వారిని నిశితంగా గమనించారు. వారు బంగారాన్ని జడలో పెట్టుకోవడం గమనించిన యజమాని వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. నిందితులను సోదా చేయగా దొంగిలించిన బంగారం బయటపడింది. పోలీసుల విచారణలో పట్టుబడిన మహిళలను ఈ క్రింది విధంగా గుర్తించారు: 1.-భోజ నాగమణి 2.-బోజగాని జ్ఞానమ్మ 3.-పొన్నా పద్మ సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో ఉన్నారు వీరు పాత నేరస్తులా? లేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండటం, యజమాని అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఈ భారీ దొంగతనం విఫలమైంది. గాజువాక పరిసరాల్లోని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని సంజీవిని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన నాలుగు సంవత్సరాల బాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డాక్టర్ పై దాడి చేయడంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అసలు బాలుడు మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు. డాక్టర్లపై దాడి చేయడం సరి కాదని ఏదైనా అనుమానం ఉంటే టెక్నికల్గా ప్రూఫ్ చేయాలని సూచించారు.1