సిరిబాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు – పాత్రికేయుడు చంటిబాబుకు ఘన సన్మానం అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం వంచుల పంచాయతీ పరిధిలోని సిరిబాల గ్రామంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. స్థానిక నెతన్య చర్చిలో జరిగిన ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా దైవ సేవకుడు వసుపరి తిమోతి భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, యేసుక్రీస్తు పునరుత్థాన మహిమను వివరించారు. లోక రక్షణ కోసం క్రీస్తు చేసిన త్యాగం, ప్రేమ, శాంతి మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.ఈస్టర్ పండుగను పురస్కరించుకుని గూడెం కొత్త వీధి మండల కేంద్రానికి చెందిన పాత్రికేయుడు మాదిరి చంటిబాబును చర్చి కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. దుశ్శాలువాతో సత్కరించి, ఆయన చేస్తున్న సామాజిక సేవలను కొనియాడారు. ముఖ్యంగా ప్రజా సమస్యలను వెలికితీస్తూ వాటి పరిష్కారానికి ఆయన చూపుతున్న కృషి ప్రశంసనీయమని వక్తలు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ కుమారి, ఎంపీటీసీ జోరంగి సరస్వతి, వైస్ ప్రెసిడెంట్ చల్లంగి శ్రీధర్, ముర్ల సత్యనారాయణ, జయలక్ష్మి, కోటిబాబు, బి. సత్యనారాయణ, తుచ్చా బంగారయ్య, సిహెచ్ సుహాసిని, సిహెచ్ సుదర్శన్, బి. బంగారు రాజు, బూడిద రామారావు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేయగా, గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

- భారతదేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయం1
- బద్వేలు:స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాయ్ జయంతి పురస్కరించుకొని కడప జిల్లా బద్వేల్ పట్టణం సిద్ధవటం రోడ్డు లోని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, కొంకుల రాంబాబు, జహంగీర్ భాష, పరిటాల వెంకటసుబ్బయ్య,పాలకొండు రాజశేఖర్ రెడ్డి,పి,ప్రసాద్ రెడ్డి, సిమెంట్ షరీఫ్, మౌలాలి, జయరామిరెడ్డి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తాజాగా నిర్వహించిన దాడుల్లో రేషన్ బియ్యం అక్రమ నిల్వలను పట్టుకోవడంతో పాటు పేకాట స్థావరంపై దాడి చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర తెలిపారు. కులక్చర్ల మండలంలో ప్రదీప్ అనే వ్యక్తి తన నివాసంలో 38 బస్తాలు రవితేజ అనే వ్యక్తి తన దుకాణంలో 31 బస్తాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా తాండూర్ మాణిక్ నగర్ లో ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై దాడిలు చేసి 350 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తాండూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.1
- కడప జిల్లా.. వేంపల్లి.. వేంపల్లి మండలం లోని వీరన్నగట్టుపల్లి వద్ద లెవెన్ కె.వి విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం... కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం.. విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడంతో ఆర్టీసీ బస్సు లో చెలరేగిన మంటలు.. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సును ఆపివేసిన డ్రైవర్ ... దీంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. క్రమేపి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.. ఫైర్ అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ అధికారులు.. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బస్సులో ఉన్న ప్రయాణికులు.1
- PROTEST INHEDAME JANNATUL BAQEE at: Dharna Chowk Indira Park1
- అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల పినకోటకు వెళ్లే ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుంచి బల్ల గురువు మీదుగా వాజంగి గ్రామానికి వెళ్లే రోడ్డును మరమ్మత్తులు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.15ఏళ్ళ క్రితం గ్రామాలకు రోడ్డు పనులు చేపట్టరన్నారు.అటుగా భారీ వాహనాలు వెళ్లడంతో 10కిలోమీటర్ల తారు రోడ్డు పూర్తిగాపాడైపోయి గోతులు ఏర్పడ్డాయి.తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటోజర్నలిస్టుల అవార్డు ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్, నాంపల్లి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఏం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నల్గొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ అవార్డు అందుకున్నరు1
- Post by K AMPAIAH ACHARI1