Shuru
Apke Nagar Ki App…
అరకు: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను ఆయన క్యాంపు కార్యాలయంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎస్సీ, ఎస్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. 10-20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని, తమను రెగ్యులర్ చేయాలని కోరారు. ఐటీఐ సివిల్ అర్హత ఉన్నవారికి ఏఈ పోస్టులు ఇవ్వాలన్నారు. సమస్యను ప్రభుత్వం, అల్లూరి కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Shyam
అరకు: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను ఆయన క్యాంపు కార్యాలయంలో ఏపీ గృహ నిర్మాణ సంస్థ ఎస్సీ, ఎస్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. 10-20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నామని, తమను రెగ్యులర్ చేయాలని కోరారు. ఐటీఐ సివిల్ అర్హత ఉన్నవారికి ఏఈ పోస్టులు ఇవ్వాలన్నారు. సమస్యను ప్రభుత్వం, అల్లూరి కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఆపత్కాలంలో కాపాడేవారు అగ్నిమాపక కేంద్రం సిబ్బందని మండలపరిషత్ అభివృద్ధిఅధికారి కుప్పిలి ఫణీంద్ర కుమార్ పేర్కొన్నారు.మంగళవారం కోటబొమ్మాళి అగ్నిమాపకకేంద్రంలో జాతీయఅగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సమాచారం తెలుసుకున్న వెంటనే వెళ్లి మంటలను అదుపుచేసి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండాకాపాడుతున్నారని అన్నారు.వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు.7
- *టెక్కలి మరియు పరిసరప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా.... ప్రతి గురువారం ప్రముఖ* *క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు ''డా.మానస'' గారు* *టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్(DH)లో అందుబాటులో* *కలరు. కావున అవసరం ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ* *అవకాశాన్ని సద్వినియోగం* *చేసుకోవాలని మనవి.* *బి. అప్పన్న మేనేజర్ జెమ్స్ హాస్పిటల్ రాగోలు శ్రీకాకుళం* *సెల్:-7337330139,,* *9618797634*1
- భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నివాళులర్పించడం జరిగింది. #AmbedkarJayanti #StatueOfSocialJustice1
- నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ *నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1
- మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 135వ జయంతి సందర్భంగా ఘనంగా ఆవిష్కరించాల్సిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులు తెల్లవారుజామున విగ్రహం ముఖ భాగం పూర్తిగా చిద్రమై ఉండటాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గ్రామంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. పెద్దఎత్తున ప్రజలు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. జయంతి రోజునే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల గ్రామస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కావాలనే చేసిన దుశ్చర్యగా భావిస్తూ, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండటం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. కార్యక్రమం నిర్వహణపై అనిశ్చితి నెలకొనగా, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్ర స్పందనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి లో నివాసం ఉంటున్న దేవి పాపా వింత అనారోగ్యంతో బాధపడుతుంది పుట్టిన్నుంచి వెన్నెముక వంకరగా నడవడానికి ఇబ్బంది పడుతూ రోజురోజుకు నరకయాతన అనుభవిస్తుంది. నిటారుగా నిలవలేని పరిస్థితి ఏర్పడింది వైద్య చికిత్స చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని దీనస్థితిలో ఉండి తమ తల్లి కూతుర్ని కాపాడుకోవాలని అందరిని ప్రాధేయ పడుతోంది.1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- Post by Veesachandu1