అన్నాచెల్లెళ్ల ఆత్మీయ బంధానికి రక్షాబంధన్ సాక్ష్యం మహిళల గౌరవం, భద్రతే సమాజ ప్రగతికి పునాది: నీలం మధు పటాన్‌చెరు, శురు ప్రతినిధి ఆగస్టు 28: అన్నాచెల్లెళ్ల ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, బాధ్యతలకు రక్షాబంధన్ పండుగ సాక్ష్యంగా నిలుస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా శుక్రవారం పలువురు మహిళలు ఆయన నివాసానికి చేరుకుని నీలం మధుకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళలకు మిఠాయిలు అందించి ఆప్యాయంగా పలకరించారు. రక్షాబంధన్ భారతీయ సంస్కృతిలో ఎంతో పవిత్రమైన పండుగ అని, ఇది కేవలం రాఖీ కట్టే సంప్రదాయం మాత్రమే కాదని నీలం మధు అన్నారు. పరస్పర విశ్వాసం, ఆత్మీయత, రక్షణకు ఇచ్చే మాటకు ప్రతీకగా ఈ పండుగ నిలుస్తుందన్నారు. సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, భద్రంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. సోదరభావం, సామాజిక ఐక్యతను పెంపొందించే రక్షాబంధన్ వంటి పండుగలు ప్రజల మధ్య ఆత్మీయతను మరింత పెంచుతాయని నీలం మధు అన్నారు.

- జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రత్యేక హోమం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పోచమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.1
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాఖీ కట్టిన బండ కార్తీక చంద్రారెడ్డి. రక్షాబంధన్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక చంద్రారెడ్డి, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి రాఖీ కట్టారు. కిషన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసి చేతికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావుకు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ లకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు ఆమెకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందజేశారు.3
- హైదరాబాద్ లో రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ ప్రతి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టాను సీఎం కోసం ప్రత్యేకంగా చేయించిన బంగారు రాఖీ కట్టాను సీఎం మనవడికి, అల్లుడికి కూడా రాఖీ కట్టా పండగ వాతవరణంలో నేను ఎలాంటి కామెంట్స్ చేయను - మంత్రి కొండా సురేఖ1
- Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti Kanpur Police Ko Salaam! Jashn-e-Miladunnabi Mein Aman, Insaniyat Aur Zimmedari Ki Ban Gayi Misaal ❤️🇮🇳 #KanpurPolice #Kanpur #JashneMiladunnabi #Miladunnabi #PoliceKoSalaam #AmanKiMisaal #Insaniyat #PoliceDuty #KanpurNews #UPPolice #AmanAurBhaiChara #HaqKiAwaz #TwentyFourNews #GroundReport #KanpurPoliceZindabad #UnityInDiversity #Hindustan #AmanAurShanti1
- మారుతినగర్ లో దాదాపు పది లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ప్రారంభం మారుతి నగర్ లో దాదాపు 10 లక్షల రూపాయల వ్యయం తో ఓపెన్ జిమ్ ను మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కాలనీ వాసులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ సామాగ్రిని జాగ్రత్తగా వాడుకోవాలని ప్రజలకు సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని, అందరు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కాలనీవాసులు జైకృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, శ్రవణ్,, అనిల్, బాలరాజ్, బాబు తదితరులు పాల్గొన్నారు.1
- రాఖీ పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ రోజున అక్క చెల్లెలు అందరూ రాఖీ పండుగ సంతోషంగా జరుపుకుంటారు రాఖీ పండుగ రోజున అక్క చెల్లెలు అందరూ పండుగ రోజున సంతోషంగా రక్షాబంధన్ కట్టి సంతోషంగా పండుగను జరుపుకుంటారు2
- 22-A భూములపై హరీష్ రావు సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నాయకులు కోల్కూరి నరసింహారెడ్డి బీఆర్ఎస్ పాలనలో అసైన్డ్, మాజీ సైనికులు, పారిశ్రామిక, అటవీ కంచె, కన్జర్వేషన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెట్టారో మాజీ మంత్రి హరీష్‌రావు చెప్పాలని సంగారెడ్డి జిల్లా INTUC అధ్యక్షుడు కొల్కురి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. పటాన్‌చెరులో కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. 22-A భూములపై హరీష్‌రావు విమర్శలు చేయడం సరికాదన్నారు. కంజర్ల, పాటి, నందిగామ ప్రాంతాల్లో భూముల వ్యవహారాలపై సమాధానం చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- రాఖీ పండుగ రోజు రక్తమోడుతున్నా.. బిడ్డ ఆకలి తీర్చిన తల్లి మమకారం రాఖీ పండుగ రోజున బంధువులకు రాఖీలు కట్టేందుకు బయలుదేరిన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. హత్నూర మండలం చందాపూర్‌కు చెందిన కుటుంబం చిలిపిచేడ్ చౌరస్తా వద్దకు చేరుకోగానే బైక్‌కు కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడింది. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలై రక్తస్రావమైనప్పటికీ.. ఒడిలో ఉన్న చిన్నారి ఆకలిని మాత్రం ఆమె పట్టించుకోకుండా ఉండలేకపోయింది. గాయాల బాధను భరిస్తూనే బిడ్డకు పాలు ఇచ్చింది. రక్తమోడుతున్న స్థితిలోనూ బిడ్డ ఆకలి తీర్చిన ఆ తల్లి మమకారం అక్కడున్న వారిని కదిలించింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. రాఖీ పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది.1