logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

హైదరాబాద్ కు చేరుకున్న నూతన గవర్నర్ -తెలంగాణ నూతన గవర్నర్ గా రేపు ప్రమాణ స్వీకారం? తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా హైదరాబా ద్‌ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయా నికి చేరుకున్న గవర్నర్ దంపతులకుకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు మరియు ఉన్నతాధికారు లు ఘనస్వాగతం పలికారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేపట్టిన గవర్నర్ల బదిలీల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఈ నెల 16న అసెంబ్లీలో నూతన గవర్నర్ తొలి ప్రసంగం రేపు బుధవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు లోక్ భవన్‌లో జరుగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన తొలి ప్రసంగం చేయనున్నారు. ఆ రోజు నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివప్రతాప్ శుక్లా బీజేపీలో సీనియర్ నేతగా సుదీర్ఘ కాలం పనిచేశారు. యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2017 నుంచి 2019 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఫిబ్రవరి 2023 నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

1 hr ago
user_Sagaboina Paparao
Sagaboina Paparao
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
1 hr ago
7d152801-d9db-4da0-adf2-e2916ea3127a

హైదరాబాద్ కు చేరుకున్న నూతన గవర్నర్ -తెలంగాణ నూతన గవర్నర్ గా రేపు ప్రమాణ స్వీకారం? తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లా హైదరాబా ద్‌ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయా నికి చేరుకున్న గవర్నర్ దంపతులకుకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, మంత్రులు మరియు ఉన్నతాధికారు లు ఘనస్వాగతం పలికారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేపట్టిన గవర్నర్ల బదిలీల్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. ఈ నెల 16న అసెంబ్లీలో నూతన గవర్నర్ తొలి ప్రసంగం రేపు బుధవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు లోక్ భవన్‌లో జరుగుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన తొలి ప్రసంగం చేయనున్నారు. ఆ రోజు నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చిన బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివప్రతాప్ శుక్లా బీజేపీలో సీనియర్ నేతగా సుదీర్ఘ కాలం పనిచేశారు. యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2017 నుంచి 2019 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఫిబ్రవరి 2023 నుంచి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

More news from తెలంగాణ and nearby areas
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్ / రంజాన్ ఉపవాసాల సందర్బంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. తదితర నాయకులు పాల్గొన్నారు.
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్ /
రంజాన్ ఉపవాసాల సందర్బంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. తదితర నాయకులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి! వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొగరాయి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో, సదరు వాహనదారుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ​మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తొగరాయి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
    2
    వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి!
వరంగల్: జిల్లాలోని దుగ్గొండి మండలంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొగరాయి ప్రధాన రహదారిపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో, సదరు వాహనదారుడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
​మంగళవారం జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తొగరాయి పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/
విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ  వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు.  ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు  నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    16 hrs ago
  • సిద్దిపేట జిల్లా : యువకుల ర్యాష్ డ్రైవింగ్ పై గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. * గజ్వెల్ మున్సిపల్ సంగాపూర్ రోడ్డు లో ర్యాష్ డ్రైవింగ్ వీడియోను తీసుకున్న యువకులు * ర్యాష్ డ్రైవింగ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువకులు * వీడియో వైరల్ గా మారడంతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను గజ్వెల్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ * మళ్లీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేస్తానని హెచ్చరిక * విద్యార్థులు రాకపోకల సమయంలో పిచ్చి చేష్టలు చేస్తే చర్యలు తప్పవని యువకులను హెచ్చరించిన సీఐ రవి కుమార్
    1
    సిద్దిపేట జిల్లా :
యువకుల ర్యాష్ డ్రైవింగ్ పై గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు.
* గజ్వెల్ మున్సిపల్ సంగాపూర్ రోడ్డు లో ర్యాష్ డ్రైవింగ్ వీడియోను తీసుకున్న యువకులు
* ర్యాష్ డ్రైవింగ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువకులు 
* వీడియో వైరల్ గా మారడంతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను గజ్వెల్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్
* మళ్లీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేస్తానని హెచ్చరిక
* విద్యార్థులు రాకపోకల సమయంలో పిచ్చి చేష్టలు చేస్తే చర్యలు తప్పవని యువకులను హెచ్చరించిన సీఐ రవి కుమార్
    user_PITLA KANAKA RAJU PRAJA PILUPU
    PITLA KANAKA RAJU PRAJA PILUPU
    Local News Reporter గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Sk report PRESS
    Sk report PRESS
    Local Politician మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    20 hrs ago
  • పక్కగా భూ హక్కులకోసం రీసర్వే ----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
    1
    పక్కగా భూ హక్కులకోసం రీసర్వే 
----జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ 
పక్కగా భూ హక్కుల కోసం రీ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వివరించారు. 
మంగళవారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రీ సర్వే అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. 
మఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. 100 సంవత్సరాల పూర్వం నిజాం ప్రభుత్వం 35 నుంచి 40 సంవత్సరాల మధ్య కష్టపడి పనిచేసి భూమి నక్ష ను రూపొందించడం జరిగిందన్నారు. అప్పటినుంచి కొన్ని గ్రామాల్లో భూనక్షల్లో సమస్యల తలెత్తయన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించేందుకే భూ రీ సర్వే కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి ప్రతి భూ కమతానికి ఆన్లైన్ డిజిటలైజేషన్లో పొంద పరుస్తామన్నారు. ఏలాంటి భూ వివాదాలు లేకుండా చేసి,భూమికి భూధార్ ను అందించడం జరుగుతుందన్నారు. భూమి ప్రతి రైతుకు ఒక సెంటిమెంట్ అని ,భూమికోసం  రైతులు పరితపిస్తూఉంటారన్నారు. భూ సమస్యలు లేకుండా చేయడమే దీని ఉద్దేశం అన్నారు.జిల్లాలో 24 గ్రామాల్లో భూ రిసర్వే ను శాస్త్రీయంగా నిర్వహించి రైతుల భూ హక్కులను పరిరక్షిస్థామన్నారు. 
భూ రిసర్వే అనంతరం విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం  పక్కగా వారి భూమిని పరిశీలించుకోవచ్చని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో  మెదక్  ఆర్డిఓ రమాదేవి,ఎ .డి ల్యాండ్ సర్వే  కిషన్, డి.పి ఆర్ ఓ రామచంద్ర రాజు,తహసిల్దార్ రజనీ,ఎంపీడీవో  గ్రామ సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • గజ్వేల్ మండలంలోని మాసన్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి గారు మరియు బి ఆర్ఎస్ శ్రేణులు ముస్లిం మైనార్టీ సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు
    4
    గజ్వేల్ మండలంలోని మాసన్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి గారు మరియు బి ఆర్ఎస్ శ్రేణులు ముస్లిం మైనార్టీ సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్! బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.​దీక్షలో ఆమెతో పాటు డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
    1
    తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్!
బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.​దీక్షలో ఆమెతో పాటు  డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రక్రియ రైతులకు శాపంగా మారింది. నిరక్షరాస్య రైతులు ఎరువులు పొందలేక గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నా, సాంకేతిక కారణాలతో యూరియా అందడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి అందరికీ యూరియా అందేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు.
    1
    ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా పంపిణీ ప్రక్రియ రైతులకు శాపంగా మారింది. నిరక్షరాస్య రైతులు ఎరువులు పొందలేక గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నా, సాంకేతిక కారణాలతో యూరియా అందడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి అందరికీ యూరియా అందేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని కోరుతున్నారు.
    user_Sk report PRESS
    Sk report PRESS
    Local Politician మసాయిపేట్, మెదక్, తెలంగాణ•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.