Shuru
Apke Nagar Ki App…
ఈ క్రిస్మస్, మీ వేడుకలు ఆనందంగా ఉండనివ్వండి మరియు మీ చిరునవ్వులు ఆరోగ్యంగా ఉండనివ్వండి. మీ దంతవైద్యుల నుండి సున్నితమైన జ్ఞాపిక — ఈరోజు చిన్న జాగ్రత్త రేపు నొప్పిని నివారిస్తుంది. విజయనగరం కిరణ్ డెంటల్ క్లినిక్ నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉🎊 This Christmas, may your celebrations be joyful and your smiles stay healthy. A gentle reminder from your dentists — small care today saves pain tomorrow. Warm wishes from Kiran Dental Clinic Vizianagaram 🎄🦷
కిరణ్ డెంటల్ క్లినిక్ - అడ్వాన్స్డ్ ఆర్థో అండ్ ఇంప్లాంట్ సెంటర్
ఈ క్రిస్మస్, మీ వేడుకలు ఆనందంగా ఉండనివ్వండి మరియు మీ చిరునవ్వులు ఆరోగ్యంగా ఉండనివ్వండి. మీ దంతవైద్యుల నుండి సున్నితమైన జ్ఞాపిక — ఈరోజు చిన్న జాగ్రత్త రేపు నొప్పిని నివారిస్తుంది. విజయనగరం కిరణ్ డెంటల్ క్లినిక్ నుండి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉🎊 This Christmas, may your celebrations be joyful and your smiles stay healthy. A gentle reminder from your dentists — small care today saves pain tomorrow. Warm wishes from Kiran Dental Clinic Vizianagaram 🎄🦷
More news from తెలంగాణ and nearby areas
- BREAKING కెసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ కొడంగల్ వేదికగా సవాల్ విసురుతున్నా 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా 150 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 100 కు పైగా స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తా ఇదే నా సవాల్.. చేతనైతే కాస్కో బిడ్డా నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. రాబోయే ఎన్నికల్లో కెసీఆర్ కు అధికారం ఇక కల్లనే బీఆరెస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం పది మందిని వెనకేసుకుని పొంకనాలు కొట్టుడు కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా.. ఏ అంశంపై అయినా అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధం సభకు రండి.. అర్థవంతమైన చర్చ చేద్దాం… కాళేశ్వరంపై చర్చిద్దామా, కృష్ణా గోదావరి జలాలపై చర్చిద్దాం, టెలిఫోను ట్యాపింగ్ పై చర్చిద్దామా రండి సొంత చెల్లిలి భర్త ఫోన్ ట్యాపింగ్ చేశారని వాళ్ళింటి ఆడబిడ్డనే చెబుతోంది సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడు మీ గ్రాండ్రింపులకు, బెదిరింపులకు భయపడేది లేదు.. తోలు తీసుడు కాదు.. మీ తోలు సంగతి చూసుకోండి..1
- తెలంగాణ రాష్ట్ర పర్యటన లో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ తో కలిసి టిఫిన్ చేస్తున్న అఖిలేశ్ యాదవ్1
- అలరించిన అడవి దున్నలు జన్నారం మండలంలోని పైడిపల్లి గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో అడవి దున్నలు అందరిని అలరించాయి. గురువారం అటవీ ప్రాంతంలో ఉన్న ప్రధాన రహదారిని అడవి దున్నలు దాటాయి. ఈ సందర్భంగా అటుగా వెళుతున్న ప్రకృతి ప్రేమికులు వాటిని వీడియో తీశారు. సాధారణంగా అటవీ ప్రాంతంలో ఉండే అడవి దున్నలు బయట కనబడడం అరుదుగా ఉంటుందని అధికారులు తెలిపారు. అడవి దున్నల సంచారం దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా వెళ్లాలని వారు కోరారు.1
- అభినవ ఛత్రపతి శివాజీ అభినవ బాబా సాహెబ్ బాల్ ఠాక్రే హిందూ టైగర్ రాజా సింగ్ భాయ్2
- *అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న అదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, అదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్* భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు రేపు అటల్ బిహారీ వాజ్‌పేయి గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దీపారాధన కార్యక్రమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్ మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్‌పేయి గారు భారతీయ జనతా పార్టీలో కీలక పాత్ర వహించారు, భారతదేశానికి మూడుసార్లు ప్రధానిగా ఉండి,భారతదేశ దేశీయ-విదేశీ విధానాల రూపకల్పనలో ముఖ్యపాత్ర పోషించిన అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు మరి ఎన్నో అవార్డులను గ్రహించారు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు1
- ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష1
- Post by Lucky Lucky3
- *_నల్లగొండ జిల్లాలో తగ్గిన క్రైమ్ రేట్.!_* _(Q న్యూస్ &శనార్తి తెలంగాణ)_ *2025 వార్షిక క్రైమ్ రేట్ ప్రకటన ను విడుదల చేసిన జిల్లా ఎస్పీ.!* సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించింది... 2025లో జిల్లాలో మొత్తం8,834 నుండి 8,493కి తగ్గాయి.. తీవ్రమైన నేరాలు 221 నుండి 169కి తగ్గడం విశేషమని పేర్కొన్నారు... *శనార్తి తెలంగాణ నల్లగొండ:* నల్గొండ జిల్లా పోలీస్ శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజా భద్రత, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత, యువత సాధికారత, పోలీస్ సంక్షేమం వంటి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ప్రజల సహకారం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన దర్యాప్తే ఈ ఫలితాలకు కారణమని ఆయన పేర్కొన్నారు. నేరాల సంఖ్య తగ్గింపు 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నమోదైన మొత్తం నేరాలు 8,834 నుంచి 8,493కు తగ్గాయి. తీవ్ర నేరాలు 221 నుంచి 169కు తగ్గడం గమనార్హం. లాభం కోసం జరిగే హత్యలు, దోపిడీలు పూర్తిగా సున్నాగా నమోదయ్యాయి. నివారణాత్మక పోలీసింగ్, నిరంతర గస్తీ, నిఘా చర్యల ఫలితంగానే ఈ తగ్గుదల సాధ్యమైందని ఎస్పీ తెలిపారు.. శిక్షల అమల్లో రికార్డు నేరాల నియంత్రణతోపాటు న్యాయ ప్రక్రియల్లోనూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసింది. 2025లో ఘోర నేరాల కేసుల్లో రెండు మరణ శిక్షలు, జీవిత ఖైదు సహా మొత్తం 132 మంది దోషసిద్ధులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే శిక్షల శాతం 103 శాతం పెరిగింది. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాల వినియోగం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం ఇందుకు దోహదపడిందని తెలిపారు. ఆస్తి నేరాల్లో తగ్గుదల ఆస్తి నేరాల కేసులు 2024లో 700 ఉండగా, 2025లో 637కు తగ్గాయి. నష్టం విలువ రూ.15.17 కోట్ల నుంచి రూ.5.28 కోట్లకు తగ్గింది. ఆస్తి నేరాల గుర్తింపు శాతం 36.47 నుంచి 63.08 శాతానికి పెరగడం విశేషం.మొత్తం కేసుల గుర్తింపు శాతం కూడా 69 శాతానికి చేరింది.. *సైబర్ నేరాలపై కట్టడి..* సైబర్ నేరాల వల్ల బాధితులు కోల్పోయిన మొత్తం 2024లో రూ.16.31 కోట్లుండగా, 2025లో రూ.4.62 కోట్లకు తగ్గింది. జిల్లా స్థాయిలో D4C సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి, గ్రామాలు–పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజల్లో చైతన్యం పెరిగిందని ఎస్పీ వివరించారు. *లోక్ అదాలత్ ద్వారా న్యాయం..* లోక్ అదాలత్ వేదికగా 49,943 కేసులు పరిష్కారమయ్యాయి. దీని వల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గడంతోపాటు ప్రజలకు త్వరిత న్యాయం లభించిందన్నారు. *డ్రగ్స్‌పై కఠిన చర్యలు..* నల్గొండను మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. డ్రగ్ పెడ్లర్లపై దాడులు నిర్వహించి 53 మందిని అరెస్టు చేశారు. 304.756 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వినియోగదారులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. *యువత, రోడ్డు భద్రతపై దృష్టి..* పాఠశాలలు, కళాశాలల్లో ‘ప్రాజెక్ట్ శుద్ధి’ ద్వారా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతలో భాగంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే గ్రామాలను గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, బ్లాక్ స్పాట్లు 11 తగ్గాయి. మహిళలు–పిల్లల రక్షణ షీ–టీమ్స్, మహిళా భరోసా కేంద్రం, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ వంటి కార్యక్రమాల ద్వారా మహిళలు, పిల్లలకు భద్రత కల్పించామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా 205 మంది పిల్లలను రక్షించారు. *పోలీస్ సంక్షేమం..* పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం మెగా మెడికల్ హెల్త్ క్యాంపులు, దూర గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. సెప్టెంబర్‌లో తెలంగాణలో తొలి పోలీస్ క్రెచ్‌ను నల్గొండలో ప్రారంభించడం విశేషంగా నిలిచింది. *నల్గొండ జిల్లాను మరింత సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.* ఈ కార్యక్రమంలో నల్లగొండ అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు, నల్లగొండ డిఎస్పి కె శివరాంరెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు, దేవరకొండ డి.ఎస్.పి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు...1
- గ్రామాలలో క్రిస్మస్ సందడి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించుకుంటున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గురువారం ఉదయం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో క్రైస్తవులు జీసస్ భక్తి పాటల మధ్య నిర్వహించారు. అనంతరం వారి ఇళ్లల్లో మరోసారి ప్రార్థనలు చేశారు. అలాగే పలు గ్రామాలలో కూడా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఉత్సాహ వాతావరణంలో జరుపుకుంటున్నారు.1